గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 28 మార్చి 2017 (09:15 IST)

మోడీకి డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశారట.. ఎందుకో తెలుసా?

ఉత్తరప్రదేశ్‌తో పాటు ఐదు రాష్ట్రాల్లో జరిగిన బీజేపీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్‌లలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయగా, పం

ఉత్తరప్రదేశ్‌తో పాటు ఐదు రాష్ట్రాల్లో జరిగిన బీజేపీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్‌లలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయగా, పంజాబ్‌లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల్లో కేంద్రంలోని అధికారిక పార్టీ విజయం సాధించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. 
 
ఐదు రాష్ట్రాల్లో బీజేపీ ఘనవిజయంపై మోడీకి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ ఓ ప్రకటన చేశారు. ఇదివరకు ట్రంప్.. మోడీకి ఫోన్ చేసినా.. భారత్ అంతర్గత విషయాలపై ఆయన స్పందించడం మాత్రం ఇదే తొలిసారి. దీంతో ఆయన ఫోన్‌కాల్‌ ప్రాధాన్యం సంతరించుకుంది. 
 
గతంలో జర్మనీలో జరిగిన తాజా ఎన్నికల్లో చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ సారథ్యంలోని క్రిస్టియన్ డెమొక్రాట్స్ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా మెర్కెల్‌కు కూడా ట్రంప్ శుభాకాంక్షలు తెలిపినట్టు సీన్‌ స్పైసర్‌ పేర్కొన్నారు. అయితే ఈ సందర్భంగా భారతీయులపై జాతివివక్ష అంశాలపై చర్చించినట్లు తెలియరాలేదు.