గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , మంగళవారం, 13 జూన్ 2017 (02:46 IST)

ట్రంప్ ఎవరినీ వదల్లేదా.. చివరకు ఆమెను కూడా.. మాట్లాడనంటే పీకేశాడా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లీలలు రోజుకో రహస్యం తీరున వెల్లడవుతూనే ఉంది. అధ్యక్ష ఎన్నికలకు ముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఉన్న లింకులు, రష్యాకు హిల్లరీ క్లింటన్ సమాచారం ఇచ్చి ఆమెపై

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లీలలు రోజుకో రహస్యం తీరున వెల్లడవుతూనే ఉంది. అధ్యక్ష ఎన్నికలకు ముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఉన్న లింకులు, రష్యాకు హిల్లరీ క్లింటన్ సమాచారం ఇచ్చి ఆమెపై దుష్ప్రచారం చేయించుకున్న ఆరోపణలపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ట్రంప్ ఆ అభియోగాల నుంచి తప్పించుకునేందుకు, కేసు విచారణ జరగకుండా అడ్డుకునేందుకు చేసిన తప్పు పనులు అన్నీ ఇన్నీ కాదని నెమ్మదిగో బోధపడుతోంది. 
 
తన మాట విననందుకు ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ కోమీనీ ప్రలోభ పెట్టి తర్వాత తనను పదవి నుంచి తొలగించన విధంలాగే తనతో కూడా ట్రంప్ వ్యవహరించాడని భారత సంతతి మాజీ అటార్నీ ప్రీత్‌ భరారా ఆరోపించారు. తాను వృత్తిధర్మం పాటించి ట్రంప్‌తో మాట్లాడటానికి నిరాకరించినందుకే తనను అటార్నీ పదవినుంచి తీసివేశారని ప్రీతి భరారా ఆరోపించారు. 
 
అసలు విషయం ఏమిటంటే.. ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్‌ కోమీని ప్రలోభ పెట్టినట్లే తనను కూడా మంచి చేసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రయత్నించారని భారత సంతతి మాజీ అటార్నీ ప్రీత్‌ భరారా ఆరోపించారు. ట్రంప్‌ మూడు సార్లు తనకు ఫోన్‌ చేశారని, ఒకసారి మాత్రం మాట్లాడేందుకు నిరాకరించానన్నారు.
 
అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక తనను ట్రంప్‌ టవర్‌కు ఆహ్వానించి.. అటార్నీగా కొనసాగాలని సూచించినట్లు భరారా చెప్పారు. మార్చిలో ఫోన్‌లో మాట్లాడేందుకు ట్రంప్‌ యత్నించగా.. తాను నిరాకరించానని, వ్యక్తిగత ఆసక్తులకు దూరంగా ఉండాలన్న వృత్తి ధర్మం మేరకే అలా చేశానని తెలిపారు. 
 
న్యూయార్క్‌ రాష్ట్ర అటార్నీగా తప్పుకునేందుకు నిరాకరించిన భరారాను ఆ పదవి నుంచి ట్రంప్‌ తొలగించిన విషయం తెలిసిందే.