Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ట్రంప్ నిర్ణయాలు భారత్ కొంప ముంచడం ఖాయం: చైనా హెచ్చరిక

హైదరాబాద్, మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (03:27 IST)

Widgets Magazine
donald trump

భారతీయ ఐటీ కంపెనీలు అమెరికాలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలంటూ అమరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకువస్తున్న డిక్రీలు, అమలు చేస్తున్న విదానాలు భారత్ పుట్టి ముంచనున్నాయని చైనా తీవ్రంగా హెచ్చరించింది. ప్రధానంగా స్థానికులకు ఉద్యోగాలివ్వాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తెస్తున్న విధానాలు.. భారత ప్రధాని మోదీ ఘనంగా ప్రస్తావిస్తున్న ‘మేకిన్  ఇండియా’ కార్యక్రమానికి సవాలేనని చైనా మీడియా హెచ్చరించింది. అయితే, ఆసియా మిత్రులతో అమెరికా సాగిస్తున్న సత్సంబంధాలు భారత్‌–అమెరికా మైత్రి ని బలోపేతం చేస్తాయని చైనా మీడియా సన్నాయి నొక్కులు నొక్కింది.
 
‘చదువుకున్న, ఐటీ శిక్షణ పొందిన యువకులు ప్రపంచంలో అత్యధికంగా భారత్‌లోనే ఉన్నారు. అమెరికా కంపెనీలకు వారే కీలకం. అందువల్ల అమెరికన్లకే ఉద్యోగాలు అంటూ ట్రంప్‌ తీసుకుంటున్న తీవ్ర నిర్ణయాలు (హెచ్‌1బీ వీసాలపై ఆంక్షలు) ఇప్పటికే అక్కడున్న భారత ఐటీ ఉద్యోగులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. అమెరికాకు ఔట్‌సోర్సింగ్‌ చేస్తున్న భారత ఐటీ, ఫార్మా కంపెనీలపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రతిపాదిస్తున్న మేకిన్  ఇండియా నినాదానికి ఇది తీవ్రంగా ఇబ్బందికరమే’ అంటూ చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొంది.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

భారత్ ఎటు వెళ్తోందో ఎవరికీ తెలీదు.. మోదీకి అస్సలు తెలీదు..ట

పెద్దనోట్ల రద్దు నేపధ్యంలో భారతదేశం ఎటు పోతోందో ఎవరకీ తెలీదని, ప్రధాని నరేంద్రమోదీకి ...

news

బురఖాకు మనోభావాలకు సంబంధం ఉందా? ఉందంటున్న విద్యా బోర్డు

అమ్మాయిలు ఏ రకమైన దుస్తులు వేసుకోవాలో, కూడదో, ఎలాంటి దుస్తులు ధరిస్తే వారిని రేప్ ...

news

మిత్రధర్మానికి గండి కొడుతున్న టీడీపీ: తొలి ఝలక్ ఇచ్చిన బీజేపీ

తాము ఎన్నిసార్లు భంగపడినా, ఎంత తగ్గి మాట్లాడినా, ఎంత సాన్నిహిత్యంగా ఉండాలని ప్రయత్నించినా ...

news

బయటి శత్రువుల కంటే ఇంటి మిత్రులే ప్రమాదకరం: లెస్స బలికిన నేత

ఆయన రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటులో విభజనకు వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో పోరాడిన ఎంపీ. ...

Widgets Magazine