గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 1 డిశెంబరు 2015 (10:35 IST)

ఐఎస్‌తో టర్కీకి సంబంధాలు.. అందుకే మా ఫ్లైట్‌ను కూల్చింది : పుతిన్

ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులతో టర్కీకి సంబంధాలు ఉన్నాయని రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. తాము చేసేవి కేవలం ఆరోపణలు కాదనీ, పక్కా ఆధారాలతోనే తాము ఒక విషయంపై మాట్లాడుతామని చెప్పుకొచ్చారు. పారిస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ పర్యావరణ సదస్సులో పాల్గొనేందుకు ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ... టర్కీపై విమర్శలు గుప్పించారు. ఉగ్రవాద సంస్ధ ఇస్లామిక్ స్టేట్ నుంచి తన సంబంధాలు దెబ్బతింటాయనే తమ యుద్ధ విమానాన్ని కూల్చివేసే ఘాతుకానికి టర్కీ దిగిందని ఆక్రోశించారు. 
 
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు చెందిన ఆయిల్‌ను దిగుమతి చేసుకునే విషయంలో ఇబ్బందులు కలుగుతాయనే ఉద్దేశంతోనే తమ యుద్ధ విమానాన్ని కూల్చి వేసిందన్నారు. 'టర్కీ భూభాగంలోకి ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన ఆయిల్ పైప్ లైన్ ఉంది. ఇదంతా ఐఎస్ మాత్రమే నిర్వహిస్తుంది. దానిని తాము ఎక్కడ ధ్వంసం చేస్తామో అనే దురుద్దేశంతోనే మా విమానాన్ని కూల్చి వేశారు. మేం ఏ ఆరోపణలు ఊరికే చేయం. ప్రత్యేకమైన కారణం ఉంటేనే మాట్లాడతాం. మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి' అని పుతిన్ అన్నారు.