శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 10 అక్టోబరు 2015 (19:12 IST)

టర్కీలో శాంతిర్యాలీ లక్ష్యంగా జంట పేలుళ్లు: 86కి చేరిన మృతులు

టర్కీలో శాంతిర్యాలీ లక్ష్యంగా శనివారం జంట బాంబు పేలుళ్ళు సంభవించాయి. టర్కీలోని అంకారాలోని ప్రముఖ రైల్వేస్టేషన్‌ సమీపంలో ఈ బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ళలో మృతిచెందిన వారి సంఖ్య 86కి చేరింది. ఈ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 
 
టర్కీలో కుర్దు మిలిటెంట్లకు, ప్రభుత్వానికి మధ్య ఘర్షణలను వ్యతిరేకిస్తూ ప్రజలు శాంతి ర్యాలీ నిర్వహించేందుకు అక్కడికి చేరిన సమయంలో ఈ బాంబు పేలుళ్లు జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. 
 
ఈ పేలుళ్ళపై టర్కీ స్వదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ, స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం... ఈ ఘటనలో ఇప్పటివరకు 86 మంది చనిపోయారని, 126 మంది వరకు గాయపడినట్టు తెలిపారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం చుట్టుపక్కల ఉన్న ఆసుపత్రులకు తరలించారు. అయితే ఇవి ఆత్మాహుతి దాడులా, బాంబు దాడులా ఇంకా తెలియరాలేదని తెలిపింది. నవంబర్‌ 1 నుంచి టర్కీలో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ పేలుళ్ళు జరగడం గమనార్హం.