శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 5 ఫిబ్రవరి 2016 (11:44 IST)

వ్యాయామం చేస్తున్నా.. గంటలకొద్దీ కూర్చుంటే డయాబెటిస్ తప్పదట!

గంటల కొద్దీ కూర్చుని పనిచేసే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో.. వ్యాయం చేస్తున్నా.. గంటలపాటు కుర్చీలకు అతుక్కుపోయే వారికి డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నెదర్లాండ్స్ పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. కంప్యూటర్లపై పనిచేయడం, కుర్చీల్లో గంటలపాటు కూర్చోవడం వంటివి చేస్తే డయాబెటిస్ వ్యాధి రావడానికి అవకాశాలున్నాయని ఆ పరిశోధన తేల్చింది. 
 
పరిశోధకుడు జులియానే వాండర్ బెర్గ్ ప్రకారం, కదలికల్లేకుండా కూర్చునే ప్రతి అదనపు గంటతో టైప్-2 మధుమేహం ముప్పు 22 శాతం దాకా పెరుగుతుందని తెలిపారు. కూర్చోవడం వల్లే డయాబెటిస్ వస్తుందని కచ్చితంగా చెప్పలేకపోయినా.. కోర్చోవడానికి డయాబెటిస్‌కు మధ్య సంబంధాలున్నట్లు బెర్గ్ వివరించారు.
 
ఈ అంశంపై నిర్వహించిన పరిశోధనలో 2వేల మంది పాల్గొన్నారని.. వీరిలో 52 శాతం మందికి డయాబెటిస్ టైప్ 2 వచ్చే అవకాశం ఉందని తేలినట్లు బెర్గ్ తెలిపారు. హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్ లెవల్స్, బీపీ వంటి అంశాలపై పరిశోధన జరిగిందని పరిశోధకులు తెలిపారు.