గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 6 జూన్ 2017 (11:32 IST)

మక్కామసీదుకు 500 కిలోల ఖర్జూర ఫలాలిచ్చిన అరబ్ రాజు.. ఔరంగజేబు కానుకగా ఏమిచ్చారంటే?

మక్కామసీదు వద్ద దీక్ష విరమణ సమయంలో ఉచితంగా అందించేందుకుగాను అరబ్‌ దేశ రాజు(యూఏఈ కింగ్‌) 500 కిలోల వరకు ఖర్జూర ఫలాలను బహుమతిగా ఇటీవల పంపించారు. వీటిని పవిత్ర కార్యంగా భావించి రోజా దీక్ష విడిచేవారికి ఇఫ

మక్కామసీదు వద్ద దీక్ష విరమణ సమయంలో ఉచితంగా అందించేందుకుగాను అరబ్‌ దేశ రాజు(యూఏఈ కింగ్‌) 500 కిలోల వరకు ఖర్జూర ఫలాలను బహుమతిగా ఇటీవల పంపించారు. వీటిని పవిత్ర కార్యంగా భావించి రోజా దీక్ష విడిచేవారికి ఇఫ్తార్‌ సమయంలో అందిస్తున్నామని మసీదు సూపరింటెండెంట్‌ ఖదీర్‌సిద్ధికీ, మేనేజరు మన్నాన్‌లు తెలిపారు.
 
కాగా.. రంజాన్‌ ఉపవాసదీక్షలో ఉన్న ముస్లింలు తెల్లవారు జాము నుంచి సూర్యాస్తమయం వరకు ఏ విధమైన ఆహారం తీసుకోరు. దీక్ష విరమణ అనంతరం తక్షణ శక్తి కోసం ప్రత్యేక తరహా పండ్లను ఆరగిస్తారు. అందుకే అరబ్ రాజు ఖర్జూరాలను బహుమతిగా అందజేసినట్లు మసీదు మేనేజర్ వెల్లడించారు. 
 
ఇకపోతే మక్కా మసీదును ముస్లింగా పుట్టిన ప్రతీ పౌరుడు తప్పక సందర్శించుకోవాలనే నియమం ఉంది. ఈ మసీదు పవిత్ర గురించి ప్రపంచ ప్రజలకు బాగానే తెలుసు. మసీదు ప్రాంగణంలో ఒక పక్కగా నల్లని రాతితో చేసిన డబుల్‌కాట్ సైజులోని రాతి మంచం ఒకటి ఉంది. దీన్ని ఆనాటి ఇరాన్ దేశపు రాజు  ఔరంగజేబుకు బహుమతిగా ఇచ్చాడని మక్కా మసీదు పురాణాలు చెప్తున్నారు. 
 
రాతి మంచంపై కూర్చుని కొద్దిసేపు సేద తీరితే మక్కా మసీదును తిరిగి సందర్శించే అవకాశం కలుగుతుందని, అలాగే మన్సలో కోరిక తప్పక నెరవేరుతుందని చెబుతారు. మసీదు లోపల అతి పురాతన గడియారం వుంది. నమాజు చేయాల్సిన సమయాన్ని సూచించే ఐదు రకాల ప్రత్యేక  గడియారాలు వున్నాయి. 
 
ఇవి కాకుండా మసీ ప్రాంగణంలో గడియారాల కనుగొనక పూర్వం ఔరంగజేబు కాలంనాటి టైం కొలిచే "కాలమానచక్రాన్ని" మక్కామసీదు సందర్శకులు తప్పక చూడాలి. రంజాన్ పండుగ సమయంలో ఈద్ కంటె ముదుంగా వచ్చే శుక్రవారం మసీదు పాంగణమంతా మహ్మదీయ సోదరులతో నిండిపోతుంది.