గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 25 మార్చి 2017 (09:27 IST)

భారత్‌కు విజయ్ మాల్యా.. ఇక వారెంట్ జారీ చేయాల్సిందే తరువాయి..

బ్యాంకు రుణాలను కట్టలేక విదేశాలకు జంప్ అయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను భారత దేశానికి రప్పించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే విజయ్ మాల్యాను అప్పగించాల్సిందిగా భారత్ చేసిన అభ్యర్థనను బ్రిటన్ విదేశ

బ్యాంకు రుణాలను కట్టలేక విదేశాలకు జంప్ అయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను భారత దేశానికి రప్పించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే విజయ్ మాల్యాను అప్పగించాల్సిందిగా భారత్ చేసిన అభ్యర్థనను బ్రిటన్ విదేశాంగ శాఖ గత నెల 21వ తేదీన సర్టిఫై చేసేసింది. సర్టిఫై చేసిన అభ్యర్ధనను వెస్ట్‌ మినిస్టర్‌ మేజిస్ట్రే‌ట్‌ కోర్టుకు పంపించారు. ఇక మిగిలింది.. విజయ్ మాల్యాను అదుపులోకి తీసుకునేందుకు.. అలాగే భారత్‌కు అప్పగించేందుకు వీలుగా జిల్లా జడ్జి స్థాయి న్యాయాధికారి వారెంట్ జారీ చేయాల్సిందే. 
 
బ్యాంకులకు దాదాపు 9,000 కోట్ల రూపాయల మేర రుణాలను ఎగవేసి రాత్రికిరాత్రే విజయ్ మాల్యా లండన్‌కు పరారైన సంగతి తెలిసిందే. ఒక దేశానికి చెందిన నేరగాళ్లు, చట్టం కనుగప్పి పరారైన వ్యక్తులు మరో దేశంలో ఆశ్రయం తీసుకున్న పక్షంలో, వారిని బంధించి అప్పగించేందుకు భారత, బ్రిటన్‌ మధ్య ద్వైపాక్షిక ఒప్పందం ఎప్పటి నుంచో అమల్లో ఉంది. ఈ చట్టం కిందనే మాల్యాను భారత్‌కు రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.