శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 17 సెప్టెంబరు 2014 (19:23 IST)

ఎంపీని చెత్త తొట్టెలో విసిరిపారేసిన ఉక్రెయిన్ ప్రజలు!

ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముఖం చాటేసిన ఎంపీని ఉక్రెయిన్ ప్రజలు చెత్తతొట్టెలో విసిరి వేశారు. ఉక్రెయిన్‌ ఎంపీ విటలీ జురవ్ స్కీకి జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈయనగారు ఎంపీగా గెలిచినప్పటి నుంచి ప్రజలకు ముఖం చూపించిన పాపాన పోలేదు. ప్రజల సమస్యలను పట్టించుకున్న పుణ్యానా పోలేదు. ఈయనగారి నియోజకవర్గం ప్రజలు సుదీర్ఘ కాలం పాటు ఓపికతో చూశారు. వారిలో ఓపిక నశించిపోవడంతో... చివరికి పార్లమెంట్ ఎదురుగానే ఆయనకు ఘన సత్కారం చేశారు. మీతో మాట్లాడాలి సార్ అని పార్లమెంట్ నుంచి బయటకి పిలిచి, తమ దగ్గరకి వచ్చిన ఆయన్ని గట్టిగా పట్టుకుని మోసుకెళ్ళి పార్లమెంట్ ముందు ఉన్న చెత్తకుండీలో విసిరి పారేశారు. 
 
చెత్తకుండీలోంచి బయటకి లేవబోయిన ఆయన మీదపడి అందరూ ఆయన్ని చెత్తకుండీలో మరింత లోపలకి నెట్టేశారు. పోలీసులు వచ్చి ఆయన్ని చెత్తకుండీలోంచి బయటకి తీశారు. తన నియోజకవర్గ ప్రజలు ఈ రకంగా అవమానించాక ఆయన ఊరుకున్నారా? ఆ మురికిబట్టలతోనే పార్లమెంట్‌ లోపలకి వెళ్ళి తన ఎంపీ పదవికి రాజీనామా చేసేశాడు. ప్రజాగ్రహం ముందు ఎవరైనా తలవంచక తప్పదు.