శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (13:25 IST)

భారత్-పాక్‌లు నేరుగా చర్చలకు వస్తే బాగుంటుంది: బాన్ కీ మూన్

భారత్-పాకిస్థాన్ మధ్య చర్చలు రద్దు కావడంతో పాకిస్థాన్ ఐరాసను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ స్పందించారు. ఇరు దేశాలు ప్రత్యక్ష చర్చలకు రావాల్సిందిగా పిలుపునిచ్చినట్టు అధికారిక ప్రతినిధి స్పెపానే దుజార్కిక్ తెలిపారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులను చర్చలతో పరిష్కరించుకోవాలని సూచించారని తెలిపారు. 
 
దుజార్కిక్ ఇంకా మాట్లాడుతూ.. తాము ప్రపంచంలోని అన్ని దేశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. మార్పుల్ని కూడా గమనిస్తున్నాం. పరిస్థితులు చేయిదాటే పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు ముందుగానే అణ్వాయుధ సామర్థ్యం ఉన్న భారత్-పాకిస్థాన్‌లు నేరుగా చర్చలకు వస్తే బాగుంటుందని అనుకుంటున్నట్లు బాన్ కీ మూన్ తెలిపినట్లు వెల్లడించారు.
 
అంతేగాకుండా ఇరు దేశాల సరిహద్దుల్లో సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న అంశాలు తమ దృష్టికి వస్తున్నాయని, దానిపై కొన్ని సూచనలు ఇవ్వాలనుకుంటున్నట్టు బాన్ కీ మూన్ తెలిపారు. కాగా ఆగస్టు 23-24 తేదీల్లో భారత్-పాక్ ఇరు దేశాల విదేశాంగ సలహాదారులైన అజిత్ దోవల్, సర్జాత్ అజీత్‌ల మధ్య ఢిల్లీలో జరగాల్సిన చర్చలు రద్దైన సంగతి తెలిసిందే.