శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 4 జులై 2015 (17:16 IST)

కంప్యూటర్ గేమ్స్ ఆడుకుంటే చేదు జ్ఞాపకాలకు చెక్!

చేదు జ్ఞాపకాలు మరిచిపోలేకపోతున్నారా? ఆ జ్ఞాపకాలు ప్రశాంతతను చెడగొడుతున్నాయా.. అయితే కంప్యూటర్ గేమ్స్ ఆడుకుంటే సరిపోతోందని యూనివర్శిటీ ఆప్ ఆక్స్ ఫర్డ్ పరిశోధకులు అంటున్నారు. సాధారణంగా చేదు జ్ఞాపకాలు అంత త్వరగా వీడిపోవు. అయితే వీటిని మర్చిపోయేందుకు కంప్యూటర్ గేమ్స్ ఉత్తమమైన చిట్కా అని పరిశోధకులు సూచిస్తున్నారు. 
 
మెదడులో గాయాలున్నవారు అవాంఛిత దృశ్యాలను చూసేందుకు ఇష్టపడరని వారంటున్నారు. కంప్యూటర్ గేమ్స్ ఆడడం వల్ల మెదడు చేదు జ్ఞాపకాలను వదిలించుకుంటున్నట్టు తమ పరిశోధనల్లో వెలుగు చూసిందని వారు తెలిపారు. మొత్తానికి కంప్యూటర్ గేమ్స్ ఆడుకుంటే చేదు జ్ఞాపకాల నుంచి విముక్తి లభిస్తుందని పరిశోధకులు అంటున్నారు. సాధారణంగా చేదుజ్ఞాపకాలు మెదడుకు అయిన గాయాల వల్ల ఏర్పడతాయని పరిశోధకులు చెప్పారు.