శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 24 సెప్టెంబరు 2016 (15:57 IST)

భారత సైన్యం అకృత్యాలకు ఒళ్లుమండిన కాశ్మీర్ బంధుగణ ఆగ్రహమే యూరీపై దాడి : నవాజ్ షరీఫ్

పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ మరోమారు భారత్‌పై నోరు పారేసుకున్నారు. కాశ్మీర్‌ లోయలో భారత సైన్యం అకృత్యాలు నానాటికీ హెచ్చుమీరిపోతున్నాయనీ ఆరోపించారు. ముఖ్యంగా.. యురీ ఆర్మీ క్యాంపుపై జరిగిన దాడికి

పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ మరోమారు భారత్‌పై నోరు పారేసుకున్నారు. కాశ్మీర్‌ లోయలో భారత సైన్యం అకృత్యాలు నానాటికీ హెచ్చుమీరిపోతున్నాయనీ ఆరోపించారు. ముఖ్యంగా.. యురీ ఆర్మీ క్యాంపుపై జరిగిన దాడికి... కాశ్మీర్ ప్రాంతంలో భారత సైన్యం అకృత్యాలకు ఒళ్లుమండిన ప్రజలే కారణమని వ్యాఖ్యానించారు.
 
న్యూయార్క్ నుంచి ఇస్లామాబాద్‌కు తిరిగి వెళ్తూ మార్గమధ్యంలో లండన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. "కాశ్మీర్‌లో ప్రజలపై భారత్ పాల్పడుతున్న హింసపై స్పందించిన బాధితుల బంధుగణం యూరీపై దాడి చేసింది. మరణించిన, చూపు కోల్పోయిన వారెందరో ఉన్నారు. వారిలో కొందరి ఆగ్రహమే యూరీ దాడి. ఇండియా మాత్రం విచారణ జరపకుండానే పాకిస్థాన్ పై నిందలేస్తోంది. ఇది బాధ్యతారాహిత్యం. దాటి జరిగిన గంటల్లోనే అది పాకిస్థాన్ పనేనని ఎలా చెబుతారు?" అంటూ నవాజ్ ప్రశ్నించారు.