Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ట్రంప్ ఆదేశాలను అమలు చేయనంటే చేయను.. అటార్నీ జ‌న‌ర‌ల్ స‌ల్లీ యేట్స్‌ పై వేటు

మంగళవారం, 31 జనవరి 2017 (14:00 IST)

Widgets Magazine
Sally Yates

ఏడు ముస్లిం దేశాలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన ఇమ్మిగ్రేషన్ ఆదేశాలపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అలాగే, ట్రంప్ ఆదేశాలను ఆ దేశ అటార్నీ జనరల్ ధిక్కరించారు. ఆయన ఆదేశాలను అమలు చేయనని తేల్చి చెప్పారు. దీంతో ఆమెను పదవి నుంచి క్షణాల్లో తొలగించారు. 
 
అమెరికా పౌరుల ర‌క్ష‌ణ కోసం రూపొందించిన న్యాయ‌ప‌ర‌మైన ఆదేశాన్ని అమ‌లు చేసేందుకు అటార్నీ జ‌న‌ర‌ల్ నిరాక‌రించారు. శ‌ర‌ణార్థుల‌పై ప్రెసిడెంట్ ఆదేశం చ‌ట్ట‌ప‌రంగా లేద‌ని స‌ల్లీ యేట్స్ అభిప్రాయ‌ప‌డ్డారు. తాను అటార్నీ జ‌న‌ర‌ల్‌గా ఉన్నంత వ‌ర‌కు ప్రెసిడెంట్ ఆర్డ‌ర్‌పై న్యాయ‌శాఖ ఎటువంటి వాద‌న‌లు చేయ‌ద‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. దీంతో ప్రెసిడెంట్ ట్రంప్ ఆమెపై వేటు వేసిన‌ట్లు వైట్‌హౌస్ ప్ర‌క‌టించింది. ఇమ్మిగ్రేష‌న్ నిషేధాన్ని ప్ర‌శ్నించినందుకు ఆమెను తొలిగించారు. 
 
మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా పాల‌నా స‌మ‌యంలో స‌ల్లీ యేట్స్ నియామ‌కం జ‌రిగింది. ముస్లిం శ‌ర‌ణార్థుల‌ను అడ్డుకోవాలంటూ ట్రంప్ జారీ చేసిన ఫ‌ర్మానాను అమ‌లు చేయ‌వ‌ద్దంటూ అటార్నీ జ‌న‌ర‌ల్ స‌ల్లీ న్యాయ‌శాఖ లాయ‌ర్ల‌కు ఆదేశించారు. దీంతో ఆమెను విధుల నుంచి బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు ట్రంప్ పేర్కొన్నారు. అటార్నీ జ‌న‌ర‌ల్ స‌ల్లీ యేట్స్ న్యాయ‌శాఖ‌ను మోసం చేసింద‌ని వైట్‌హౌస్ ఓ ప్ర‌క‌ట‌న‌లో అభిప్రాయ‌ప‌డింది. ప్ర‌స్తుతం వ‌ర్జీనియా అటార్నీగా ఉన్న డానా బొన్నెట్‌ను తాత్కాలిక అటార్నీ జ‌న‌ర‌ల్‌గా నియ‌మించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అమెరికాలో ఇండియన్ టెక్కీలకు ట్రంప్ షాక్... రూ.87,00,000 జీతం వుంటేనే... లేదంటే పొండి...

డొనాల్డ్ ట్రంప్ అనుకున్నట్లే అమెరికాలోని ఎన్నారైలను ఖాళీ చేయించే దిశగా అడుగులు ...

news

ఇండియన్ టెక్కీలకు ముచ్చెమటలు... అమెరికా సభకు హెచ్1 బీ వీసాల సంస్కరణ బిల్లు

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డోనాల్డ్ ట్రంప్ అనుకున్నంత పనిచేస్తున్నారు. తన ...

news

జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోనున్న నాగబాబు.. తమ్ముడికి తోడుగా..

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో మెగా బ్రదర్ నాగబాబు చేతులు కలుపనున్నట్లు వార్తలు ...

news

టెక్సాస్ మహిళ కౌగిలింతల వ్యాపారం.. నో సెక్స్.. అయినా భలే డిమాండ్

అమెరికాకు చెందిన ఓ మహిళ సరికొత్త వ్యాపారాన్ని ప్రారంభించింది. ఆ వ్యాపారం పేరు కౌగిలింతలు. ...

Widgets Magazine