గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 29 డిశెంబరు 2016 (10:02 IST)

లష్కర్ ఎ తొయిబాకు అమెరికా షాక్.. విద్యార్థి విభాగం కూడా ఉగ్ర సంస్థే

ఉగ్రవాద సంస్థ లష్కర్ ఎ తొయిబాకు అమెరికా తేరుకోలేని షాకిచ్చింది. లష్కర్ ఎ తొయిబా విద్యార్థి విభాగమైన అల్ మహమ్మదీయను కూడా ఉగ్రవాద సంస్థగా అగ్రరాజ్యం ప్రకటించింది. దీంతో లష్కర్ ఎ తొయిబా ఉగ్రవాద కార్యకలాప

ఉగ్రవాద సంస్థ లష్కర్ ఎ తొయిబాకు అమెరికా తేరుకోలేని షాకిచ్చింది. లష్కర్ ఎ తొయిబా విద్యార్థి విభాగమైన అల్ మహమ్మదీయను కూడా ఉగ్రవాద సంస్థగా అగ్రరాజ్యం ప్రకటించింది. దీంతో లష్కర్ ఎ తొయిబా ఉగ్రవాద కార్యకలాపాలను అడ్డుకునేందుకు, ఆ సంస్థతో సంబంధం ఉన్న విద్యార్ధి నాయకులను అరెస్ట్ చేసేందుకు, సానుభూతిపరులను ప్రశ్నించేందుకు అధికారులకు వీలుచిక్కినట్టయింది. 
 
లష్కర్ ఎ తొయిబా పాక్ కేంద్రంగా భారత్‌ను అస్థిరం చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. 1987లో హఫిజ్ సయీద్ ఈ ఉగ్రవాద సంస్థను నెలకొల్పాడు. 2001లో భారత పార్లమెంట్‌పై దాడి, 2008లో ముంబై దాడులు జరిపింది లష్కర్ ఎ తొయిబాయే. హఫిజ్ సయీద్‌ తలకు వెల కట్టినా అతడి ఆట కట్టించడంలో అమెరికా చూసీ చూడనట్లు వ్యవహరిస్తూ వచ్చింది. అయితే, అమెరికా కొత్త అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ రాకతో పరిస్థితి మారిపోయేలా కనిపిస్తోంది. ఇందులోభాగంగానే అల్ మహమ్మదీయను ఉగ్రసంస్థగా ప్రకటించినట్టు తెలుస్తోంది.