శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 19 జనవరి 2017 (09:18 IST)

'ట్రంప్‌ గెలిచారు కదమ్మా.. మనం వెళ్లిపోవలసిందేనా'! తల్లిని ప్రశ్నించిన బిడ్డ

'అమ్మా! డొనాల్డ్‌ ట్రంప్‌ గెలిచారు కదా! మనం అమెరికా వదలి వెళ్లి పోవలసిందేనా'! అంటూ ఇంట్లో తన పిల్లలు ప్రశ్నించడంతో తెల్లబోయినట్లు ఒబామా ప్రభుత్వంలో దక్షిణ, మధ్యాసియా వ్యవహారాలు చూసిన విదేశాంగశాఖ అసిస్

'అమ్మా! డొనాల్డ్‌ ట్రంప్‌ గెలిచారు కదా! మనం అమెరికా వదలి వెళ్లి పోవలసిందేనా'! అంటూ ఇంట్లో తన పిల్లలు ప్రశ్నించడంతో తెల్లబోయినట్లు ఒబామా ప్రభుత్వంలో దక్షిణ, మధ్యాసియా వ్యవహారాలు చూసిన విదేశాంగశాఖ అసిస్టెంట్‌ సెక్రటరీ నిషా దేశాయ్‌ బిశ్వాల్‌ చెప్పారు. 
 
డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం అనంతరం ఇమిగ్రెంట్లు, మైనారిటీలు.... వివిధ దేశాల నుంచి ఇక్కడికి వచ్చి బతుకుతున్న వారిలో తీవ్రమైన భయాందోళనలు వ్యక్తమౌతున్న విషయం తెల్సిందే. తొమ్మిదేళ్లు, ఏడేళ్ల వయసున్న తన పిల్లలు ఎన్నికలైపోయిన మర్నాడు తనతో మాట్లాడుతూ.... మనమంతా ఇమ్మిగ్రెంట్లం కదా! వెళ్లిపోవలసిందే నా అని అడగటంతో ఒక్కక్షణం అవాక్కయిన తాను తేరుకుని ఇక్కడే ఉండటానికి సకల హక్కులూ ఉన్నట్లు చెప్పానన్నారు.
 
తామంతా అమెరికాకు చెందిన విలువైన సభ్యులమంటూ నొక్కి చెప్పానన్నారు. ఇది తనింట్లో విషయమైనప్పటికీ.. అమెరికా అంతటా ఇదే తరహా అనుమానాలు, భయాలు నెలకొని ఉన్నాయని ఆమె పునరుద్ఘాటించారు. కాగా, డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన మరసటి రోజు నుంచి ఆ దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెల్సిందే.