శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 28 నవంబరు 2016 (13:15 IST)

హిట్లర్ హయాంలో యూదులకు పట్టిన గతే ట్రంప్ ముస్లింలకు పట్టిస్తారు.. బెదిరింపు లేఖలు

డొనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్న నేపథ్యంలో అమెరికాలోని మూడు మసీదులకు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు లేఖలు వచ్చాయి. హిట్లర్‌ హయాంలో యూదులకు పట్టిచ్చిన గతే ప్రస్తు

డొనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్న నేపథ్యంలో అమెరికాలోని మూడు మసీదులకు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు లేఖలు వచ్చాయి. హిట్లర్‌ హయాంలో యూదులకు పట్టిచ్చిన గతే ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ ముస్లింలకు పట్టిస్తారని ఆ లేఖల్లో రాయబడి వున్నాయి.

పూర్తిగా ద్వేషభావంతో నిండిన లేఖల్లో అధ్యక్షునిగా ఎన్నికైన ట్రంప్‌ని, ఆయన ముస్లిం వ్యతిరేక అభిప్రాయాలను ప్రశంసలతో ముంచెత్తారు. మీరంతా తెలివిగల వాళ్లు అయితే దేశాన్ని విడిచి ముందుగానే వెళ్లిపోవాలని లేఖల్లో పేర్కొన్నారు. 
 
డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో అమెరికాకు ముస్లింల రాకను నిషేధించాలని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే అమెరికాలో ముస్లింలకు వ్యతిరేకంగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు.

ట్రంప్‌ అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాతి నుంచి ముస్లింలకు వ్యతిరేకంగా దాదాపు 100 సంఘటనలు చోటు చేసుకున్నాయని సీఏఐఆర్‌ అధికారులు వెల్లడించారు. దీనిపై విచారణ చేపట్టాలని కోరారు. చేతిరాతతో రాసిన లేఖ చివరిలో 'అమెరికన్స్‌ ఫర్‌ ఏ బెటర్‌వే' 'లాంగ్‌ లివ్‌ ప్రెసిడెంట్‌ ట్రంప్‌, గాడ్‌ బ్లెస్‌యూ' అని రాసి ఉన్నట్లు సీఏఐఆర్ అధికారులు వెల్లడించారు.