శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 29 ఆగస్టు 2014 (11:38 IST)

నట దిగ్గజం అక్కినేనికి అరుదైన గౌరవం: అమెరికా పోస్టల్ స్టాంపు!

తెలుగు నట దిగ్గజం, మహానటుడు స్వర్గీయ అక్కినేని నాగేశ్వర రావు జ్ఞాపకార్థం అమెరికా తపాలా శాఖ ఓ పోస్టల్ స్టాంపును విడుదల చేయబోతుంది. ఈ గౌరవం దక్కిన తొలి భారతీయ చలనచిత్ర నటుడు అక్కినేని నాగేశ్వరరావు చరిత్ర సృష్టించనున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 20వ తేదీన అక్కినేని జయంతి సందర్భంగా డల్లాస్‌లో ఏర్పాటు చేయనున్న ప్రత్యేక కార్యక్రమంలో అక్కినేని పోస్టల్ స్టాంప్‌ను గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. 
 
ఆ తర్వాత డిసెంబర్ 17వ తేదీన గుడివాడలో అక్కినేని కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగే అంతర్జాతీయ అక్కినేని అవార్డుల కార్యక్రమంలో కూడా ఈ స్టాంపును విడుదల చేయనున్నారు. అక్కినేని షౌండేషన్ ఆఫ్ అమెరికా (ఎఎఫ్ఏ) చేసిన కృషి ఫలితంగా అక్కినేనికి ఈ గౌరవం దక్కిందని ఏఎఫ్‌ఏ అధ్యక్షుడు ప్రసాద్‌ తోటకూర గురువారం తెలిపారు. అక్కినేని జీవన గమనాన్ని విశ్వవ్యాప్తం చేయాలనే ఉద్దేశ్యంతోనే ఏఎఫ్‌ఏ ఏర్పాటైందని ప్రసాద్ తోటకూరి చెప్పారు.