మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : బుధవారం, 25 ఫిబ్రవరి 2015 (11:37 IST)

హెచ్1-బీ వీసా అనుమతుపై ఆఫర్.. మాట నిలబెట్టుకున్న ఒబామా ..!

హెచ్1-బీ వీసాలపై నిబంధనలపై అమెరికా అధ్యక్షుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఇందులో భాగంగా, హెచ్1-బీ వీసాపై అమెరికాలో ఉంటున్నవారి జీవిత భాగస్వాములు కూడా ఉద్యోగం చేసుకోవడానికి అమెరికా ప్రభుత్వం నుండి ఆమోదం లభించింది. 
 
ఈ ఏడాది మే నెల 26వ తేది నుంచి ఇది అమల్లోకి రానుంది. గత నెలలో ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకలకు అతిథిగా హాజరైన ఒబామా, సమగ్ర వలస విధాన సంస్కరణల్లో భాగంగా హెచ్1-బీ అనుమతులపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అమెరికాలో అర్హతలు వుండి కూడా, నిబంధనల కారణంగా ఉద్యోగం చేసుకునే అవకాశం లేని భారతీయులకు ఇక నుంచి హ్యాపీగా ఉద్యోగాలు చేసుకోవచ్చు.