గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : శుక్రవారం, 22 మే 2015 (21:59 IST)

వీరప్పన్... ఇంటర్నేషనల్ బ్రాండ్ అంబాసిడర్...! ఏ కంపెనీకి...?

వీరప్పన్... అనగానే అతనో గందపు చెక్కల దొంగ.. ఏనుగు దంతాల స్మగ్లర్ ఇవే ఆయనకున్న పేర్లు.. భారతదేశంలో స్మగ్లర్లపై ఏమాత్రం అవగాహన ఉన్నవారిని అడిగినా ఇదే చెబుతారు. కానీ అంతర్జాతీయంగా పేరున్న కాస్మోటిక్స్ కంపెనీ ఆయనను అనధికార ఇంటర్నేషనల్ బ్రాండ్ అంబాసిడర్ ను చేసింది. అదీ ఆయన చనిపోయిన పదేళ్ల తరువాత.. అది ఎలాగబ్బా...? వివరాలిలు మీరే తెలుసుకోండి. 
 
వీరప్పన్ చనిపోయిన ఇన్నేళ్లకు ఇప్పుడు మళ్లీ ఆయన పేరు, ఫోటో అంతర్జాతీయ వార్తల్లో కనిపించాయి. అంతర్జాతీయ స్మగ్లర్‌గా, నొటోరియస్ క్రిమినల్‌గా రికార్డులకెక్కిన వీరప్పన్.. ఇప్పుడు ఓ ఇంటర్నెషనల్ కాస్మెటిక్స్ కంపెనీకి అనధికారికంగా బ్రాండ్‌ అంబాసిడర్ అయ్యాడు. ఆయన ఫోటోని వాడుకుని ఓ కంపెనీ తమ కాస్మెటిక్స్ ప్రోడక్ట్స్‌ని అమ్ముకుంటోందన్న మాట! మీసాలకు వాడే వ్యాక్స్ డబ్బాపై పెద్ద పెద్ద మీసాలున్న వీరప్పన్ ఫోటోని ముద్రించడం ద్వారా తమ అమ్మకాలు పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది లష్ కంపెనీ. వీరప్పన్ సోల్(వీరప్పన్ ఆత్మ) పేరిట మరికొన్ని ఉత్పత్తులు తయారుచేస్తోంది ఈ సంస్థ. 
 
అయితే ఎన్నో వందల ఏనుగులని చంపి వాటి కొమ్ములు అమ్ముకున్న క్రూరుడు, తన స్మగ్లింగ్‌కి అడ్డమొచ్చిన వారిని పొట్టనపెట్టుకున్న ఓ దుర్మార్గుడి ఫోటోని వాడుకుని ఉత్పత్తులు అమ్ముకోవడం ఏంటంటూ లష్ కంపెనీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కంపెనీ తీరుని విమర్శిస్తూ ఇప్పటికే 60 వేలకుపైగా నెటిజెన్లు ఆన్‌లైన్ పిటీషన్లు కూడా సమర్పించారు.