గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 20 ఏప్రియల్ 2015 (19:05 IST)

ఏకకాలంలో 17 మందితో డేటింగ్.. చైనా మోసగాడు చిక్కాడోచ్!

ఏకకాలంలో 17 మందితో సరససల్లాపాలు చేస్తూ అమ్మాయిలను నమ్మించి నట్టేట ముంచిన ఓ చైనా మోసగాడు చిక్కాడు. చాంగ్ షా ప్రాంతానికి చెందిన యువాన్ అనే యువకుడు ఓ రోజు తన ప్రియురాలి కారులో వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. గాయపడిన అతడిని ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, అతడి కుటుంబ సభ్యులు, బంధువుల కోసం ఆసుపత్రి సిబ్బంది ఫోన్లు చేయడంతో యువాన్ బండారం బట్టబయలైంది. అతగాడు 17 మందితో ప్రేమాయణం సాగిస్తున్న వైనం వెల్లడైంది.
 
ఆసుపత్రి సిబ్బంది చేసిన ఫోన్లు అతడి ప్రియురాళ్లకూ చేరాయి. వారందరూ ఆసుపత్రికి వచ్చి, తాము మోసపోయామని గుర్తించి లబోదిబోమన్నారు. వారందరినీ తన ఆర్థిక అవసరాలకు యువాన్ వాడుకున్నాడనే విషయం లేటుగా తెలిసింది. ధనికుడినని చెప్పుకుని వారిని వలలో వేసుకుని, ఆపై వారి నుంచి అందినకాడికి దండుకునే ఈ చైనా మోసగాడి వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.