బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : సోమవారం, 3 ఆగస్టు 2015 (12:14 IST)

మిచెల్‌ ది 'గొరిల్లా' ముఖం.. కోతిలాంటి ఒబామాకే నచ్చుతుంది.. వాషింగ్టన్ మేయర్ వ్యాఖ్య..

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిచెల్ ది గొరిల్లా లాంటి ముఖం అని, అది కోతిలాంటి ఒబామాకు మాత్రమే నచ్చుతుందని వాషింగ్టన్ మేయర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆయన ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌లో ఒబామా కుటుంబాన్ని కోతులు గొరిల్లాలతో పోలుస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ తొలి మహిళ మిచెల్ ఒబామాది 'గొరిల్లా ఫేస్' అని, ఆమెను 'మంకీ మ్యాన్ ఒబామా' తప్ప మరెవరూ ఇష్టపడరన్నారు. కావాలంటే వారి చెవులు చూడండి అంటూ తెలిపారు.
 
పాట్రిక్ వ్యాఖ్యలు అమెరికాలో పెద్ద దుమారాన్నే రేపాయి. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన వెంటన పదవికి రాజామానా చేయాలని పలు వర్గాల వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనికి ఆయన నిరాకరించాడు. అంతేకాకుండా నేను తప్పు చేశాను. నా తప్పు నాకు తెలుసు. ఒకవేళ నేను రాజీనామా చేస్తే, నేను జాతి విద్వేష పూరితుడినని ఒప్పుకున్నట్టు అవుతుంది. కానీ నేను కాదు" అని ఆయన అన్నారట.