శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 25 నవంబరు 2015 (12:28 IST)

చిలీ సెనేటర్ హత్య కేసు.. ఫ్రాన్స్ మహిళ మేరీకి సుప్రీం నో పర్మిషన్

చిలీ సెనేటర్ జైమీ గుజ్‌మన్ ఎరాజురిజ్ 1991లో హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితురాలైన ఫ్రాన్స్ మహిళ మేరీ ఇమ్మాన్యుయేల్ వెర్హోవెన్ (56)ను ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు మేరకు ఉత్తరప్రదేశ్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత చిలీ విజ్ఞప్తి మేరకు ఆమెను అప్పగించేందుకు భారత్ సిద్ధమైనప్పటికీ.. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. ఆమె పిటిషన్ దాఖలు చేసింది. 
 
దీనిపై మంగళవారం జస్టిస్ టి.ఎస్. ఠాకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లతో కూడిన అత్యున్నత న్యాయస్థానం మేరికి అనుమతిని నిరాకరించింది. ధర్మాసనం వాదనలు విన్న తర్వాత అప్పగింతను ఆపేందుకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న వినతిని నిరాకరించి, విచారణను డిసెంబర్ 8వ తేదీకి వాయిదా వేసింది. ఈ సందర్భంగా ప్రపంచంలో ఉగ్రముప్పు నానాటికి పెరుగుతున్న నేపథ్యంలో అన్ని దేశాలూ సమన్వయంతో మెలగాలని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
 
మేరీ ఇమ్మాన్యుయేల్‌కు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్లు తేలింది. పైగా ఉగ్రవాద దాడులు ప్రపంచ దేశాల్లో పెచ్చరిల్లిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో మేరీని చిలీకి అప్పగించడం సరికాదని సుప్రీం కోర్టు పేర్కొంది. ఇది ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపుతుందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.