శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 13 జనవరి 2015 (17:41 IST)

కాశ్మీర్ అంశం లేకుండా భారత్‌తో చర్చలా.. నో ఛాన్స్ : పాకిస్థాన్

కాశ్మీర్ అంశం లేకుండా భారత్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని పాకిస్థాన్ తెగేసి చెప్పింది. ఇరు దేశాలు శాంతి చర్చలను కొనసాగించాలని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ సూచించిన నేపథ్యంలో పాకిస్థాన్ మంగళవారం పై విధంగా స్పందించింది. వ్యూహాత్మక ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా జరిగిన చర్చల అనంతరం జాన్ కెర్రీ, పాకిస్థాన్ జాతీయ భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్ సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాశ్మీర్ అంశం లేకుండా భారత్‌తో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. అదేసమయంలో ఉభయ దేశాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి తమవంతుగా చొరవు తీసుకుంటున్నట్టు చెప్పారు.
 
అనంతరం జాన్ కెర్రీ స్పందిస్తూ.. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య సరిహద్దుల్లో నెలకొంటున్న ఉద్రిక్తతలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సరిహద్దు వెంబడి, నియంత్రణ రేఖ వెంబడి ఇటీవలి కాలంలో హింస పెరగడం పట్ల తాము ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. పాకిస్థాన్, భారత ప్రయోజనాల దృష్ట్యా ఇరు దేశాలు సత్సంబంధాలతో ముందుకు సాగాలని ఆయన కోరారు.