Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వేల మైళ్లనుంచి కలుస్తున్న బంధాలు: ఆ విమానాశ్రయాల్లో అపురూప దృశ్యాలు

హైదరాబాద్, మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (06:57 IST)

Widgets Magazine

అమెరికాలోని పలు విమానాశ్రయాల్లో అద్భుతమైన దృశ్యాలు స్పందించే హృదయాలను తట్టి లేపుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం పుణ్యమా అని భావోద్వేగాలను పంచుకోవడంలో, ప్రకటించడంలో అమెరికా ప్రజలు తక్కువేం కాదని తెలిసింది. విడిపోవడం, దూరంగా ఉండటం షరామాములే  అయిపోయిన అమెరికాలో ట్రంప్ సాక్షిగా మానవీయ బంధాలు మహత్వ పూర్ణంగా అక్కడి విమానాశ్రయాల్లో ప్రదర్శించబడుతున్నాయి.
 
ఏడు ముస్లిం దేశాల ప్రయాణికులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన తాత్కాలిక నిషేధాజ్ఞలు కొన్ని వేలమందిని పలుదేశాల విమానాశ్రయాల్లో ఇరుక్కుపోయేలా చేశాయి. అమెరికా కోర్టు ట్రంప్‌ నిబంధనలు చెల్లవని చెప్పిన నేపథ్యంలో ఇక జన్మలో అమెరికాలోకి అడుగుపెట్టలేమనుకున్న వారు దొరికిన విమానాన్ని దొరికినట్లుగా పట్టేసుకుని అమెరికాకు వచ్చేశారు. దాదాపు వారం రోజుల తర్వాత తమవారిని తిరిగి కలుసుకుంటున్న తరుణంగా ఏర్పడిన భావోద్వేగ సన్నివేశాలు కోకొల్లలుగా దర్శనం ఇచ్చాయి. 
 
భార్యకోసం భర్త, తల్లిదండ్రుల కోసం పిల్లలు, తమ బంధువుల కోసం అయినవారి ముఖాలు ఒక్కసారిగా విచ్చిన మొగ్గల్లా మారిపోయాయి. అమాంతం ఆనంద భాష్పాలతో ఆలింగనం చేసుకుంటుండగా చూస్తున్నవారంతా వావ్‌ అంటూ కేకలు పెడుతూ చప్పట్లతో అభినందిస్తూ వారు కూడా భావోద్వేగాలకు లోనయ్యారు. 
 
ఉదాహరణకు ‘డల్లాస్‌కు చెందిన అహ్మద్‌ అబ్దుల్లా సోమాలియా సంతతికి చెందిన అమెరికన్‌. ఆయన గత నాలుగు రోజులుగా తన భార్యకోసం ఎదురుచూస్తున్నాడు. ఏడు ముస్లిందేశాల ట్రావెలింగ్‌ వీసాలపై ట్రంప్‌ నిషేధం విధించిన నేపథ్యంలో అతడి భార్య దుబాయ్‌కు వెళ్లి అక్కడే ఉండిపోయింది. తిరిగి ఇటు వచ్చే క్రమంలో అక్కడే గ్రీన్‌ కార్డు తీసుకోవడంతో దుబాయ్‌ ఎయిర్‌ పోర్ట్‌లో పిల్లలతో సహా నిలిచిపోయింది. దీంతో ఇక తాము కలవగలమా అని ఎదురుచూస్తున్న అతడికి ఇటీవల అమెరికా కోర్టు ట్రంప్‌ నిబంధనలు చెల్లవని చెప్పిన నేపథ్యంలో ఆశలు చిగురించాయి. గ్రీన్‌ కార్డు ఉన్నవాళ్లు అమెరికా నిరభ్యంతరంగా రావొచ్చని చెప్పిన నేపథ్యంలో అతడి భార్య దుబాయ్‌ నుంచి బయలు దేరి రావడంతో అతడి సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి.
 
అలాగే, కావేహ్‌ యూసెఫీ అనే యువకుడి తల్లిదండ్రులను ఇరాన్‌ నుంచి రాకుండా అధికారులు అడ్డుకున్నారు. దీంతో అతడు కూడా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశాడు. వీసా నిబంధనలు పక్కకుపోయిన నేపథ్యంలో వారు తిరిగి అమెరికా రావడంతో వీల్‌ చైర్‌లో ఉన్న తల్లిని చూసి ఆ కుమారుడు మురిసిపోయాడు. ఇలా ఒక్కటేమిటి దాదాపు అన్ని అమెరికా ఎయిర్‌ పోర్టుల్లో ఇలాంటి దృశ్యాలే కనువిందు చేశాయి.
 
విద్వేషంకాదు.. ప్రేమ, అనుబంధం మనిషికి కాస్త సంతోషాన్ని, సాంత్వనను ఇచ్చేవి ఇవే అనే విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ వంటి జాతి, మత వివక్షాపరులైన నేతలు ఎప్పుడు తెలుసుకుంటారో..
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

శశికళ కలలు గల్లంతేనా.. గవర్నర్ మెలికతో ప్రమాణ స్వీకారం వాయిదా..!

తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికల ఆశల సౌధానికి గండి పడే సూచనలు కనిపస్తున్నాయి. ...

news

ఏ పదవీ వద్దు: పన్నీర్‌ సెల్వం తీవ్ర మనస్తాపం

తమిళనాడు రాజకీయాల్లో శరవేగంగా జరిగిన పరిణామాలతో సీఎం పదవిని దివంగత ముఖ్యమంత్రి జయలలిత ...

news

ఏపీకే కాదు... తెలంగాణకూ కేంద్రం మొండిచెయ్యేనట: ధ్వజమెత్తిన జితేందర్

ఒకవైపు రాష్ట్ర విభజనతో కుప్పకూలిన ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం మొండి చెయ్యి చూపిస్తోందని ...

news

ట్రంప్ నిర్ణయాలు భారత్ కొంప ముంచడం ఖాయం: చైనా హెచ్చరిక

భారతీయ ఐటీ కంపెనీలు అమెరికాలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలంటూ అమరికా అధ్యక్షుడు డొనాల్డ్ ...

Widgets Magazine