మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 9 అక్టోబరు 2016 (13:21 IST)

బెడ్‌రూమ్‌లో దెయ్యం.. ఏం చేసిందో తెలుసా.. బెడ్ షీట్ లాగిందట..

నిజ జీవితంలో హారర్ సినిమాలోని సీన్స్ చోటుచేసుకుంటే.. ఎలా ఉంటుంది. షాక్ అవుతారు కదూ.. నిజమే ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. చికాగోలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. దెయ్యాలు ఉన్నాయో లేవో తెలియదు కానీ అమెరికాలోని

నిజ జీవితంలో హారర్ సినిమాలోని సీన్స్ చోటుచేసుకుంటే.. ఎలా ఉంటుంది. షాక్ అవుతారు కదూ.. నిజమే ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. చికాగోలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. దెయ్యాలు ఉన్నాయో లేవో తెలియదు కానీ అమెరికాలోని చికాగోలో ఓ యువతి నిద్రలేమి సమస్యతో బాధపడుతోంది. అర్థరాత్రి వేళ తను కప్పుకున్న బెడ్‌షీట్‌ను ఎవరో లాగుతున్నట్లు అనిపించి ఉలిక్కి పడి లేచేది. 
 
రోజూ ఆమెకు ఇదే పరిస్థితి ఎదురవుతోంది. దీంతో అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారనేది తెలుసుకోవాలని ఆమె నిర్ణయించుకుంది వెంటనే బెడ్ రూమ్‌లో సీసీ టీవీ కెమెరాను ఏర్పాటు చేసింది. ఆ సీసీ ఫుటేజీని మరుసటి రోజు చూస్తే షాక్ తింది. 
 
ఆమె బెడ్‌షీట్ ఎవరు లాగేస్తున్నారో తెలుసుకుని కంగుతింది. ఆ యువతి పేరు ఇరిస్ అలమో. దాదాపు సంవత్సరం నుంచి ఆమె ఈ సమస్యతో బాధపడుతున్నట్లు ఆ సీసీ పుటేజిని పోస్ట్ చేసింది. అయితే ఆ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.