శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 26 జూన్ 2016 (17:06 IST)

బెడ్‌పై యువతి.. కళ్లు తెరిచిచూస్తే 16 అడుగుల పైతాన్.. ఆ తర్వాత ఏమైంది (వీడియో)

సాధారణంగా కంటికి చిన్నపాము కనిపిస్తేనే ప్రాణభయంతో పరుగులు తీస్తాం. అలాంటిది ఏకంగా 16 అడుగుల పొడవు ఉండే పైతాన్ పాము పడక గదిలోకి వస్తే.. ఆ పరిస్థిని ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. నిజంగా ఇదే జరిగింది

సాధారణంగా కంటికి చిన్నపాము కనిపిస్తేనే ప్రాణభయంతో పరుగులు తీస్తాం. అలాంటిది ఏకంగా 16 అడుగుల పొడవు ఉండే పైతాన్ పాము పడక గదిలోకి వస్తే.. ఆ పరిస్థిని ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. నిజంగా ఇదే జరిగింది. ఓ యువతి నిద్రపోతుండగా పడక గదిలోకి పైతాన్ వచ్చింది. దాన్ని చూసిన ఆ యువతికి గుండె ఆగినంత పని అయింది. ఇంకేముందు.. బెడ్‌పై నుంచి కిందికి దూకి.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీసింది. 
 
ఆ తర్వాత గుండె ధైర్యం తెచ్చుకుని ఆ పామును వీడియో తీసి యూట్యాబ్‌లో అప్ చేసింది. ఇంకేముంది. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌లా వ్యాపించింది. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలుసుతా. ఆస్ట్రేలియాని క్వీన్స్‌లాండ్‌లో జరిగింది. 
 
ఆ తర్వాత అటవీ అధికారులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. దీంతో వారు వచ్చి ఆ పామును బంధించి తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో విదిలిపెట్టారు. ఈ పామును కాస్సోవరి కోస్ట్ రీజినల్ ఏరియాలో వదిలిపెట్టినట్టు అటవీ అధికారి గుడ్‌విన్ వెల్లడించారు.