శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 28 అక్టోబరు 2016 (17:39 IST)

అండాశయ క్యాన్సర్‌కు కారకమైన జాన్సన్ అండ్ జాన్సన్‌: భారీ జరిమానా

జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి కొత్త చిక్కొచ్చి పడింది. కాలిఫోర్నియాకు చెందిన మహిళ అండాశయ కాన్సర్‌కు గురైనట్టు తేలింది. కంపెనీ ఆఫర్ చేసే చిన్న పిల్లల ఫౌండర్, షవర్-టు-షవర్ టాల్క్ ఉత్పత్తులు అండాశయ క్యాన

జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి కొత్త చిక్కొచ్చి పడింది. కాలిఫోర్నియాకు చెందిన మహిళ అండాశయ కాన్సర్‌కు గురైనట్టు తేలింది. కంపెనీ ఆఫర్ చేసే చిన్న పిల్లల ఫౌండర్, షవర్-టు-షవర్ టాల్క్ ఉత్పత్తులు అండాశయ క్యాన్సర్‌కు కారకాలుగా నిలుస్తున్నాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జాన్సన్ అండ్ జాన్సన్‌కు సెయింట్ లూయిస్ జడ్జి భారీ జరిమానా విధించారు. 
 
ఆ మహిళకు 70 మిలియన్ డాలర్లను(రూ.467కోట్లకు పైగా) చెల్లించాలని కంపెనీని కోర్టు ఆదేశించింది. మూడు గంటల పాటు జరిగిన వాదోపవాదాల అనంతరం భారీ జరిమానా పడింది. ఈ కేసులో సమర్థవంతమైన వాదనను వినిపించడంలో వరుసగా మూడోసారి జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ విఫలమైంది. ఇప్పటికే ఈ కంపెనీకి వ్యతిరేకంగా 1,700 దావాలు ఫెడరల్ కోర్టుల్లో నమోదైనాయి.