మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 18 సెప్టెంబరు 2014 (16:12 IST)

నా కన్యత్వానికి రూ.49 లక్షలివ్వండి.. యువతి : అంతకాదులే.. రూ.3 లక్షలే.. చైనా కోర్టు!

తన ప్రియుడి చేతిలో మోసపోయిన ఓ యువతి తన కన్యత్వానికి రూ.49 లక్షలు, వైద్య ఖర్చుల నిమిత్తం రూ.15 వేలు చెల్లించాలంటూ చైనా కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు.. యువతి కోరిన మొత్తం ఎక్కువగా ఉందని పేర్కొన్న చైనా కోర్టు.. రూ.3 లక్షలతో సరిపుచ్చింది. తాజాగా వెల్లడైన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే.. 
 
చెన్ అనే యువతికి, లీకి మధ్య గత 2009లో పరిచయం ఏర్పడింది. ఇది ప్రేమగా మారడంతో వీరిద్దరు డేటింగ్‌లు మొదలు పెట్టారు. 2013లో ఉన్నట్టుండి లీ ప్రియురాలికి దూరంగా ఉండసాగాడు. దీంతో వారిద్దరి మధ్య ఎడబాటు వచ్చింది. ఈ నేపథ్యంలో, ఓ రోజు లీ ఇంటికి వెళ్ళిన చెన్ అక్కడ పరిస్థితిని చూసి నిర్ఘాంతపోయింది. అతడు తన భార్యతో కనిపించేసరికి తాను మోసపోయిన విషయాన్ని గ్రహించింది. 
 
వెంటనే కోర్టులో అతనిపై దావా వేసింది. పెళ్ళి చేసుకుంటానన్న లీ మాటలు నమ్మి, కన్యత్వాన్ని సమర్పించానని, అందుకు నష్ట పరిహారంగా రూ.49 లక్షలు చెల్లించాలని, వైద్య ఖర్చులకు మరో రూ.15 వేలు చెల్లించాలని డిమాండ్ చేసింది. అయితే, కోర్టు చెన్ డిమాండ్ మరీ ఎక్కువగా ఉందంటూ... పరిహారంగా మూడు లక్షల రూపాయలు చెల్లించాలని లీని ఆదేశించింది. కన్యత్వపు హక్కును చట్టం పరిరక్షిస్తుందని కోర్టు స్పష్టం చేసింది.