శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 28 మే 2016 (17:07 IST)

ట్విట్టర్లో సెక్సీయెస్ట్ కామెంట్స్ చేయడంలో మహిళలే ఫస్ట్!

బ్రిటీష్ మేధో సంస్థ డెమోస్ మూడు వారాల పాటు బ్రిటన్‌లోని ట్విట్టర్ యూజర్ల పోస్టులను విశ్లేషించింది. ఇందులో షాక్ ఇచ్చే విషయాలు వెల్లడయ్యాయి. సోషల్ మీడియాలో పురుషులు మాత్రమే అభ్యంతరక పదాలు చేస్తారని అందరూ అనుకుంటున్నారు. అసలు సంగతి ఏంటంటే..? మహిళలు కూడా సాటి మహిళలపై సెక్సీయెస్ట్ కామెంట్స్ చేస్తున్నారట. 
 
ట్విట్టర్‌లో దాదాపు సగం మంది మహిళలు సెక్సీయెస్ట్ కామెంట్స్ చేస్తున్నారని వెల్లడైంది. ఈ పరిస్థితి బాధిత మహిళలు ఎదుర్కొంటున్న మానసిక క్షోభకు అద్దం పడుతుందని పరిశోధకులు అంటున్నారు. డెమోస్‌ ట్విట్టర్లో స్త్రీపురుషుల ద్వేషపూరిత వ్యాఖ్యలను అధ్యయనం చేసింది. సగటున రెండు లక్షల ట్వీట్లలో స్త్రీలను దూషించే అభ్యంతకర పదాలు వెలువడుతున్నాయని తెలిసింది. 
 
6,500 ట్విట్టర్ యూనిక్ యూజర్లలో పదివేల సెక్సీయెస్ట్ ట్వీట్స్ ఉన్నట్లు గుర్తించారు. మరో సోషల్ నెట్‌వర్క్ సైట్ ఫేస్ బుక్ కూడా సెక్సియెస్ట్, అభ్యంతకర, విమర్శనాత్మక కామెంట్లను ఎదుర్కొంటోంది. పోస్టుల కంటే ఇలాంటి కామెంట్స్ ఎక్కువగా ఉన్నాయని స్టడీలో తేలింది.