శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 13 నవంబరు 2014 (18:57 IST)

ఉగ్రవాదం.. వేర్పాటువాదాన్ని అడ్డుకోవాలి: నరేంద్ర మోడీ

విదేశీ పర్యటనలో ఉన్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం మయన్మార్‌ రాజధానిలో రష్యా అధ్యక్షుడు మెద్వెదేవ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ప్రతినిధులు కూడా ఉన్నారు. 
 
భారత్-రష్యా సంబంధాలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలు చర్చకు వచ్చాయి. భారత్ సన్నిహిత, విలువైన భాగస్వామి అని రష్యా ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రధాని ప్రస్తుత పర్యటనలో రష్యా ప్రధానితో సమావేశం మొదటి దౌత్యపరమైన సమావేశం ఇది కావడం గమనార్హం. 
 
ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. మతానికి, ఉగ్రవాదానికి ముడిపెట్టవద్దన్నారు. రెండింటికీ మధ్య సంబంధాన్ని ప్రపంచ దేశాలు తిరస్కరించాలన్నారు. పలు దేశాల్లో ఉగ్రవాదం, వేర్పాటువాదం విపరీతంగా పెరిగిపోతోందని దానిని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మోడీ తెలిపారు.