శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 13 అక్టోబరు 2016 (14:08 IST)

రష్యన్లూ.. స్వదేశానికి వచ్చేయండి... ఏ క్షణమైనా మూడో ప్రపంచ యుద్ధం: పుతిన్ వార్నింగ్

ప్రస్తుతం ఏ క్షణమైనా మూడో ప్రపంచ యుద్ధం జరిగే అవకాశం ఉందని అందువల్ల విదేశాల్లో నివశించే రష్యన్లూ వీలైనంత త్వరగా స్వదేశానికి వచ్చేయాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని రష

ప్రస్తుతం ఏ క్షణమైనా మూడో ప్రపంచ యుద్ధం జరిగే అవకాశం ఉందని అందువల్ల విదేశాల్లో నివశించే రష్యన్లూ వీలైనంత త్వరగా స్వదేశానికి వచ్చేయాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని రష్యాలో ప్రముఖ పత్రిక 'ది సన్' ప్రచురించింది.
 
ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్నాయని, కొత్త ప్రపంచ యుద్ధం ఆరంభం కానుందని పుతిన్ వ్యాఖ్యానించినట్టు పత్రిక తెలిపింది. యుద్ధం వస్తే, అణ్వాయుధాల ప్రయోగం తప్పదని భావిస్తూ, దాదాపు 4 కోట్ల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా అతిపెద్ద ఢిఫెన్స్ డ్రిల్ నిర్వహించిన రోజుల అనంతరం పుతిన్ నోటి వెంట ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం. 
 
వివిధ దేశాల్లోని అందరు అధికారులు, వారి భార్యా బిడ్డలు, బంధువులతో సహా మాతృదేశానికి వచ్చేయాలని పుతిన్ ఉన్నతస్థాయి హెచ్చరికలు జారీ చేసినట్టు ఆ పత్రిక పేర్కొంది. ఇప్పటికే ఫ్రాన్స్ పర్యటనను రద్దు చేసుకున్న ఆయన స్వయంగా, స్వదేశానికి వచ్చేందుకు నిరాకరించే వారు, భవిష్యత్తులో ఉద్యోగార్హత కోల్పోతారని హెచ్చరించినట్టు తెలుస్తోంది.