శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 7 జూన్ 2017 (14:48 IST)

అంతర్జాతీయ యోగా దినోత్సవం.. పోటీపడి రాందేవ్-యోగి ఆసనాలు.. గవర్నర్ కూడా?

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈ నెల 21వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాటైన ఓ కార్యక్రమంలో యోగా గురు బాబా రాందేవ్‌తో పోటీపడి మరీ యోగాసనాలు వేశారు.. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆది

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈ నెల 21వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాటైన ఓ కార్యక్రమంలో యోగా గురు బాబా రాందేవ్‌తో పోటీపడి మరీ యోగాసనాలు వేశారు.. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్. వీరిద్దరితో పాటు యూపీ గవర్నర్ రామ్ నాయక్ సైతం తనకూ యోగా తెలసునని యోగాసనాలు వేశారు. ఈ నెల 21న లక్నోలో యోగా డేను పురస్కరించుకుని భారీ ఈవెంట్ జరుగనుంది. ఇందులో 50వేల మందితో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, యోగి ఆదిత్యనాథ్‌లు యోగాసనాలు వేయనున్నారు. 
 
ఇటీవలి తన 'మన్ కీ బాత్'లో మూడు తరాల ప్రతినిధులు కలసి మూడవ యోగా ఉత్సవాల్లో పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 21న లక్నోలో జరుగనున్న భారీ ఈవెంట్‌కుభారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు చీఫ్ సెక్రటరీ రాహుల్ భట్నాగర్ అధికారులతో ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్రంలోని అంగన్ వాడీ కార్యకర్తలను, సీనియర్ సిటిజన్‌లను యోగా డేలో భాగస్వామ్యం చేయనున్నట్టు వెల్లడించారు.