శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 2 మార్చి 2015 (11:55 IST)

రావల్పిండి జైలులో జల్సా చేస్తున్న లఖ్వీ.. ఇంటర్నెట్‌తో బిజీ బిజీ!

ముంబై దాడుల రూపకర్త లష్కరే తోయిబా నేత, కరుడుకట్టిన ఉగ్రవాది ఝుకి-ఉర్-రెహమాన్ లఖ్వీ ఇస్లామాబాద్‍‌లోని రావల్పిండి జైలులో ఉంటూ జల్సా చేస్తున్నట్లు సమాచారం. ఇతను జైలులో ఉంటునే ఇంటర్నెట్, మొబైల్‌ల సహాయంలో తీరిక లేకుండ ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని బీబీసీ మీడియా తెలిపింది. ముంబుయి దాడులు జరగడానికి ఇతను ప్రధాన కారణం కావడం గమనార్హం.
 
ముంబయి దాడులు జరిగిన తరువాత భారత్ నుండి ఒత్తిడి ఎక్కువ కావడంతో పాకిస్థాన్ ఉగ్రవాది లఖ్వీని అరెస్టు చేసింది. తరువాత న్యాయస్థానం అతనికి బెయిల్ మంజూరు చేసింది. లఖ్వీకి బెయిల్ మంజూరు చెయ్యడాన్ని భారత్ తీవ్రస్థాయిలో వ్యతిరేకించింది.
 
తర్వాత లఖ్వీని అరెస్టు చేసి పాకిస్థాన్‌లోని రావల్పిండిలో ఉన్న అడ్యాల జైలుకు తరలించారు. లఖ్వీతో పాటు ముంబై దాడులతో సంబంధం ఉన్న అబ్దుల్ వాజిద్, మజహర్ ఇక్బాల్, హమద్ అమీన్ సిధ్దిఖి, షాహిద్ జమీల్ రియాజ్, జమీల్ అహమ్మద్, యూనీస్ అంజూమ్‌లు అడ్యాల జైలులో ఉన్నారు. వీరందరి మీద ముంబై దాడుల కేసులు నమోదయ్యాయి.