గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: సోమవారం, 12 సెప్టెంబరు 2016 (19:54 IST)

బిగ్గెస్ట్‌ డేంజర్‌ దాటిపోయా : నాని ఇంటర్వ్యూ

నటుడిగా ప్రతి సినిమానుంచి ఎంతో కొంత నేర్చుకుంటూనే వుంటాననీ. ఇవాళ చేసింది రేపు నచ్చకపోవచ్చు. అందుకే అప్‌డేట్‌ అవుతుంటాను. 'అష్టాచెమ్మ' మొదటి సినిమాగా చేశాను. ఆ తర్వాత టీవీలో చూశాక.. సరిగ్గా చేయలేదని నాకే అనిపించింది. ఆ తర్వాత చేసిన ఒక్కో సినిమాల్లోనూ

నటుడిగా ప్రతి సినిమానుంచి ఎంతో కొంత నేర్చుకుంటూనే వుంటాననీ. ఇవాళ చేసింది రేపు నచ్చకపోవచ్చు. అందుకే అప్‌డేట్‌ అవుతుంటాను. 'అష్టాచెమ్మ' మొదటి సినిమాగా చేశాను. ఆ తర్వాత టీవీలో చూశాక.. సరిగ్గా చేయలేదని నాకే అనిపించింది. ఆ తర్వాత చేసిన ఒక్కో సినిమాల్లోనూ మెచ్యూర్డ్‌గా నటించేందుకు కృషిచేస్తున్నానని కథానాయకుడు నాని అన్నాడు. 
 
నాని హీరోగా విరించి వర్మ దర్శకత్వంలో ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌, కేవా మూవీస్‌ పతాకాలపై పి.కిరణ్‌, గోళ్ళ గీత అందిస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ 'మజ్ను'. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. ఈ నెల 23న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఏషియన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సునీల్‌ నారంగ్‌ రిలీజ్‌ చేస్తున్నారు. ఇమ్మానుయేల్‌, ప్రియాశ్రీ కథానాయికలుగా నటించారు. ఈ సినిమా గురించి నాని చెప్పిన విశేషాలు.
 
మజ్ను కథేమిటి?
ఇదేదో ప్రేమలో విఫలమయిన కథ మాత్రం కాదు. చక్కటి వినోదాన్ని అందించే కుటుంబతరహా చిత్రం. విరించి కథ చెప్పడానికి వస్తున్నాడనగానే పాజిటివ్‌ థింకింగ్‌ వచ్చేసింది. కథ విన్నాక వెంటనే చేసేయాలనిపించింది.
 
నటుడిగా మీలో మీరు గ్రహించిన మార్పు?
'అష్టాచెమ్మా' టీవీలో చూస్తుంటే సరిగ్గా చేయలేదనిపించింది. 'ఎటో వెళ్ళిపోతుంది మనసు'లో పరిణితి చెందిన వాడిగా చేశాను. ఆ తర్వాత 'భలేభలే మగాడివోయ్‌'లో మరింత బాగా నటించానని అనిపించింది. అలాగే 'మజ్ను' సినిమాలో ప్రస్తుతం బాగా చేశానని చెప్పగలను. అయితే రెండేళ్ళ తర్వాత చూస్తే అందులో లోపాలు కన్పిస్తాయి. నటుడికి సంతృప్తి ఇంతటితోనే అనే పరిమితులు ఏమీ వుండవు. ప్రతిసారీ ఏదో ఒకటి నేర్చుకుంటూనే వుంటాను. మరలా 'మజ్ను' సినిమానే చేస్తే కొత్తగా చేస్తా.
 
దర్శకుడు విరంచిపై మీ అభిప్రాయం?
తను చాలా మంచోడు. ఎంత మంచోడంటే.. సెట్‌లో విసుగు కన్పించదు. సీన్‌ను ఎన్నిసార్లయినా చెబుతాడు. అతనిలో చాలా ఓపిక వుంది. సినిమాలో ఆయన చెప్పిన ఫ్యామిలీ రిలేషన్స్‌ చాలా ఇంట్రెస్ట్‌గానూ కొత్తగా అనిపిస్తాయి. ఈ కథలోని పాత్రలన్నీ ఆయనలా అందరూ మంచోళ్ళే. కానీ పరిస్థితులే విలన్‌లు.
 
ద్విభాషా చిత్రాలు చేయడంలేదే?
ఒక సమయంలో చేశాను. ఇప్పుడు చేయాలంటే కష్టంగా వుంది. అందుకు చాలా టైం పడుతుంది. సీన్స్‌ మార్చిమార్చి తీయాల్సి వుంటుంది. నటీనటులు డేట్స్‌ కుదరాలి. చాలా కష్టమైన పని. అందుకే తెలుగులోనే చేస్తున్నాను. తమిళంలో ఇప్పటికి మూడు సినిమాల్లో నటించాను. అక్కడ నన్ను బాగా ఆదరిస్తారు. ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటకు రాగానే... సెల్ఫీలంటూ తమ ప్రేమను వ్యక్తం చేస్తారు. అలాంటప్పుడు ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది.
 
నటుడిగా సెంటిమెంట్‌ నుంచి బయటపడ్డారా?
ఆర్టిస్టుగా ద్వితీయవిఘ్నం నుంచి బయటపడ్డాను. తర్వాత కొంత గ్యాప్‌ వచ్చినా.. చేసిన సినిమాలు సక్సెస్‌ అయ్యాను. నటుడిగా అన్ని పాత్రలు చేసే అవకాశం కల్గింది. దాంతో 'టైప్‌ కాస్ట్‌' భయం పోయింది. టైప్‌ కాస్ట్‌.. అంటే.. ఒక నటుడు ఒకే పాత్రకో పరిమితం అవుతాడనే ముద్ర ఇండస్ట్రీలో నెలకొంది. లవ్‌ సినిమాలు చేస్తే వరుసగా అవే వస్తుంటాయి. మరో షేడ్‌ చేసినా కొన్నిసార్లు చూడరు. లవ్‌తోపాటు ఫ్యామిలీ సినిమాలు, థ్రిల్లర్‌ కథలూ చేశాను. త్వరలో మాస్‌ సినిమా చేయబోతున్నా. కరెక్ట్‌గా చెప్పాలంటే.. నటుడిగా బిగ్గెస్ట్‌ డేంజర్‌ను దాటిపోయాను. నాని అన్ని పాత్రలు చేయగలడు అనేది 'జంటిల్‌మెన్‌'తో ప్రూవ్‌ అయింది.
 
ఫ్యామిలీ లైఫ్‌ ఎలా వుంది?
కనీసం మూడు రోజులు సెలవులు దొరికితే చాలనుకుంటే.. అవికూడా దొరకడంలేదు. సినిమాల్లో బిజీగా వుండటంతో నన్ను అర్థం చేసుకున్నారు.
 
సినిమా ఎన్నిరోజులు ఆడుతుందని చెప్పగలరు?
కరెక్ట్‌గా చెప్పలేం. 20 రోజులు ఆడుతుందనుకుంటే అది ఇంకా ఎక్కువగా ఆడొచ్చు. మంచి సినిమా.. ప్రేక్షకులకు నచ్చితే ఎన్నిరోజులకైనా తీసుకెళతారు. ఇదే చివరి రోజంటే చెప్పగలం. కానీ డేస్‌ చాలా వున్నాయికదా.
 
ఇప్పటి రచయితలు కథల్లో కొత్తదనం కన్పిస్తుందా?
కథలు చెప్పేవారు చాలామంది వున్నారు. అవి మనకు నచ్చాలి. వాటిల్లో కొన్నింటిని ఎంపిక చేసుకోవాలి. నా దృష్టిలో కథలు చెప్పే రచయితలు చాలామంది వున్నారు. కాకపోతే వారికి కథలు వెళ్ళడంలేదు. అందుకే సరైన కథలు తెలుగులో లేవని విమర్శలు వస్తున్నాయి. ఇటీవల 10 కథలు విన్నాను. అన్నీ వినూత్నంగా వున్నాయి. నాకు పరిచయమైనవారు చెప్పిన కథలు వింటుంటే.. తెలుగు కథల్లో చాలా మార్పు వస్తుందనిపిస్తుంది. ఇప్పటి రచయితలు చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తున్నారు.
 
మళ్ళీ రాజమౌళితో సినిమా ఛాన్స్‌ వస్తే?
అన్ని వదులుకుని పరుగెడతా. నేను తక్కువ వయస్సులోనే పెద్ద పెద్ద దర్శకులతో పనిచేసే భాగ్యం కల్గింది.
 
నిర్మాత కిరణ్‌గారితో పనిచేయడం ఎలా అనిపించింది?
కిరణ్‌గారితో కెరీర్‌ మొదట్లో చేయాల్సింది. అప్పట్లో కథ చెప్పారు. కానీ సెట్‌ కాలేదు. ఓసారి విరించిను తీసుకువచ్చి వినమన్నారు. విరించి కథ చెబుతున్నాడనగానే పాజిటివ్‌ ఆలోచనలు వచ్చేశాయి. విన్న వెంటనే సినిమా చేస్తున్నానని చెప్పేశాను.
 
రియల్‌లైఫ్‌లో మజ్నులా ఏవైనా జరిగాయా?
నా చదువు అంతా బాయ్స్‌తోనే. స్కూల్‌, కాలేజీలో కూడా బాయ్స్‌.. గాళ్స్‌ వుండరు. అసిస్టెంట్‌  డైరెక్టర్‌ అయ్యాక కూడా అంతా బాయ్స్‌తోనే పనే. సినిమాల్లో నటించాక గాల్స్‌తో కలిసి చేయాల్సి వచ్చింది. అష్టాచెమ్మాకు ముందుగానే నా భార్య పరిచయం. ఆమెతోనే ఫిక్స్‌ అయిపోయాను. అందుకే మజ్ను తరహా సీన్‌కు ఛాన్సే లేదు. అసలు మజ్ను కథ కూడా.. ఎంటర్‌టైన్‌మెంట్‌.. విరహంతో కూడిన సినిమా కథకాదు. మొదటి భాగం పొయిటిక్‌గా వుంటుంది. రెండో భాగం ఎంటర్‌టైన్‌మెంట్‌లో సాగుతుంది అని చెప్పారు.