మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By dv
Last Updated : సోమవారం, 4 జులై 2016 (15:55 IST)

'దిల్' రాజు.. నా గాడ్‌ఫాదర్.. మంచి న‌టుడుగా పేరు తెచ్చుకోవాల‌నుంది : పార్వ‌తీశం

"కేరింత" సినిమాలో నూక‌రాజుగా తెలుగు ప్రేక్ష‌కుల‌కు గుర్తుండిపోయిన పార్వ‌తీశం న‌టించిన మ‌రో యూత్‌ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ 'రోజులు మారాయి'. తెలుగు ఫిల్మ్ ఇండ‌స్ట్రీ అగ్ర నిర్మాత దిల్ రాజు సమర్పకుడిగా, వ‌రుస బ

"కేరింత" సినిమాలో నూక‌రాజుగా తెలుగు ప్రేక్ష‌కుల‌కు గుర్తుండిపోయిన పార్వ‌తీశం న‌టించిన మ‌రో యూత్‌ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ 'రోజులు మారాయి'. తెలుగు ఫిల్మ్ ఇండ‌స్ట్రీ అగ్ర నిర్మాత దిల్ రాజు సమర్పకుడిగా, వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్స్ క‌థ‌ల‌తో సూప‌ర్‌డూప‌ర్ స‌క్సెస్‌ల‌తో దూసుకుపోతున్న ద‌ర్శ‌కుడు మారుతి క‌థ‌, స్క్రీన్‌ప్లే అందించ‌గా, మారుతి టాకీస్ బ్యాన‌ర్‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్, గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం 'రోజులు మారాయి'. ముర‌ళీక‌ష్ణ ముడిదాని ద‌ర్శ‌క‌త్వంలో జి.శ్రీనివాస‌రావు నిర్మాత‌గా ఈ చిత్రం రూపొందింది. సినిమా జూలై 1న విడుద‌లైంది. ఈ చిత్రం రెండు రోజుల్లో 2 కోట్ల రూపాయ‌ల గ్రాస్‌ను క‌లెక్ట్ చేసి సూప‌ర్‌హిట్ టాక్‌తో స‌క్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమవుతోంది. ఈ చిత్రంలో పీట‌ర్‌గా త‌న పాత్ర మ‌రోసారి తెలుగు ప్రేక్ష‌కులను మెప్పించినందుకు చాలా హ్యాపీగా ఉందంటున్నాడు పార్వ‌తీశం అలియాస్ నూక‌రాజు. త‌న‌ను పార్వ‌తీశం అన‌డం కంటే కేరింత నూక‌రాజు అని పిలిస్తేనే త‌న‌కు అనందం అంటున్న ఈ యువ న‌టుడితో ఇంట‌ర్వ్యూ....
 
* చాలా మంచి రెస్పాన్స్ ... 
'కేరింత' త‌ర్వాత 'రోజుల‌ మారాయి' చిత్రంలో పీట‌ర్ పాత్ర అంద‌రికీ గుర్తుండిపోతుంది. త‌న‌కు న‌చ్చిన అమ్మాయికి జాబ్ ఇచ్చి ఆమెతో 'ఐ ల‌వ్ యూ' చెప్పించుకోవాల‌నుకునే పాత్ర‌. చివ‌ర‌కు అనుకున్న‌ట్టుగానే ఆమెతో ఐ ల‌వ్ యూ చెప్పించుకుంటాడు. రెండు రోజులుగా థియేట‌ర్స్ టూర్‌కు వెళుతున్నాం. ప్రేక్ష‌కుల నుండి చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. 'కేరింత' స‌మ‌యంలో అంద‌రూ న‌న్నెలా నూక‌రాజు అని పిలిచారో ఇప్పుడు పీట‌ర్ అని పిలుస్తున్నారు. 
 
* లాంగ్వేజ్ విష‌యంలో కేర్ తీసుకున్నాను... 
కేరింత సినిమాలో శ్రీకాకుళం స్లాంగ్‌ను ప‌ల‌క‌డానికి చాలా క‌ష్ట‌ప‌డ్డాను. అందుకోసం రెండు నెల‌ల‌కు పైగా శ్రీకాకుళం భాష‌కు సంబంధించిన ప‌దాల‌పై ప‌ట్టు సాధించ‌డానికి ప్ర‌య‌త్నించాను. అలాగే ఈ సినిమాలో వైజాగ్ స్లాంగ్‌లో మాట్లాడ‌టానికి న్యూట్ర‌ల్‌గా మాట్లాడ‌టానికి ప్ర‌య‌త్నించాను. 
 
* ఆ విష‌యంలో మ‌రోసారీ 
'కేరింత' సినిమాలో నేను మాట్లాడిన శ్రీకాకుళం స్లాంగ్ విష‌యంలో టూర్ వెళ్లిన‌ప్పుడు ఓ ఐదుగురు వ్య‌క్తులు గొడ‌వ చేశారు. కానీ ఎవ‌రినీ కించ‌ప‌ర‌చ‌డానికి నేను ఆ స్లాంగ్‌లో మాట్లాడ‌లేదు. ఒక‌వేళ నిజంగా అలా అనుకుని ఉంటే మ‌రోసారి వారికి మ‌న‌స్ఫూర్తిగా క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నాను. 
 
* నేప‌థ్యం... 
నేను పుట్టి పెరిగిందందా ప‌శ్చిమ బెంగాల్‌లోని ఖ‌ర‌గ్‌పూర్‌. నా ఇంట‌ర్‌ వ‌ర‌కు అక్క‌డే చ‌దివాను. త‌ర్వాత ఇంజ‌నీరింగ్ బెంగ‌ళూరులో చేశాను. క్యాంప‌స్ జాబ్ వ‌చ్చినా వ‌ద్దునుకున్నాను. సినిమాల్లోకి రావాల‌నుకున్నాను. 
 
* సినిమాల్లోకి రావ‌డానికి కార‌ణం... 
సినిమాల్లోకి రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం. నాకు చిన్న‌ప్ప‌టి నుండి నట‌న అంటే ఆస‌క్తి. నాట‌కాలు వేసేవాడిని. ఇంట‌ర్ చ‌దివే రోజుల్లో ఓ నాట‌కం చూసిన కొంద‌రు న‌టుడు అమ‌మ‌ని న‌న్ను అప్రిసియేట్ చేశారు. ఆరోజున నేను సినిమాల్లోకి వెళ్లాల‌నుకున్నాను. ఇంజ‌నీరింగ్ త‌ర్వాత ఎన్‌.హెచ్‌.డివారు ఆడిష‌న్ చేసి న‌న్ను సెల‌క్ట్ చేసి హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటిలో ట్ర‌యినింగ్ ఇప్పించారు. 
 
* నాకు జాబ్ అంటే ఇష్ట‌ముండేది కాదు... 
ఇంజ‌నీరింగ్ త‌ర్వాత జాబ్ వ‌చ్చింది కానీ నాకు జాబ్ చేయ‌డ‌మంటే ఇష్టముండేది కాదు. ఏం చేయాల‌ని బాగా ఆలోచించి చివ‌ర‌కు సినిమాల్లోకి రావాల‌నుకుని ఇటువైపుగా అడుగులేశాను. ఆస‌మ‌యంలో నా స్నేహితులు అండ‌గా నిల‌బ‌డ్డారు. నా త‌ర‌పున మా ఇంటికి వారే డ‌బ్బు పంపేవారు. వారు న‌న్నంత‌గా న‌మ్మారు. వారి రుణం ఎప్ప‌టికీ తీర్చుకోలేను. ముందు డి ఫ‌ర్ దోపిడి చిత్రంలో ఓ గే క్యారెక్ట‌ర్‌లో న‌టించాను. ఆ పాత్ర ఎడిటింగ్‌లో క‌ట్ అయిపోయింది. మ‌రో రెండు సినిమాల్లో చిన్న చిన్న పాత్ర‌లు వేశాను కానీ ఆ సినిమాలు విడుద‌ల కాలేదు. 
 
* ఆయ‌న నా గాడ్ ఫాద‌ర్‌.. 
దిల్‌రాజుగారు నా గాడ్‌ఫాద‌ర్‌. ఈ సినిమాకు కూడా ఆయ‌నే న‌న్ను స‌జెస్ట్ చేశారు. నా పేరును కూడా పార్వ‌తీశం అని కాకుడా కేరింత‌ నూక‌రాజు అని మార్చుకోవాల‌ని కూడా ఆయ‌న సూచించారు. ఆయ‌న‌తో కేరింత సినిమా నుండి నాకు మంచి అనుభ‌వం ఏర్ప‌డింది. 
 
* మంచి న‌టుడుగా పేరు తెచ్చుకోవాల‌నుంది 
నాకు హీరోయే కావాల‌నేం లేదు. అమీర్ ఖాన్‌, ప్ర‌కాష్ రాజ్‌, కోట‌ శ్రీనివాస‌రావు, నానిలా అన్నీ ర‌క‌లా పాత్ర‌లు వేయ‌గ‌లన‌నే మంచి న‌టుడుగా పేరు తెచ్చుకోవాల‌నుంది. నేను అన్నీ ర‌కాల ఎమోష‌న్స్ చేయ‌గ‌ల‌ను. 
 
* తదుప‌రి చిత్రం.. 
బెక్కం వేణుగోపాల్‌గారు నిర్మిస్తున్న "నాన్న.. నేను.. నా బాయ్‌ఫ్రెండ్స్" చిత్రంలో వ‌న్ ఆఫ్ ది లీడ్ రోల్ చేస్తున్నాను.