శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: గురువారం, 27 ఆగస్టు 2015 (19:24 IST)

విష్ణు మైండ్‌‌సెట్‌ చాలా డిఫరెంట్‌‌గా ఉంటుంది : ప్రణీత ఇంటర్వ్యూ

24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్‌‌పై అరియానా, వివియానా సమర్పణలో దేవాకట్టా దర్శకత్వంలో మంచు విష్ణు, ప్రణీత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా 'డైనమైట్‌'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని సెప్టెంబర్‌ 4న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరోయిన్‌ ప్రణీత చెప్పిన సంగతులు.
 
ఇందులో  మీ పాత్ర ఎలా వుంటుంది?
సిటీలో ఉండే మోడరన్‌ గర్ల్‌ పాత్రలో కనిపిస్తాను. చాలా ఫార్వార్డ్‌గా ఆలోచించే క్యారెక్టర్‌. అలాంటి ఓ అమ్మాయికి భయంకరమైన ఓ సంఘటన ఎదురవుతుంది. ఆ పరిస్థితుల నుండి తను బయటపడటానికి హీరో ఎలా హెల్ప్‌ చేసాడనే అంశాలపై సినిమా నడుస్తుంది.  
 
యాక్షన్‌ సీన్స్‌ చేయడం రిస్క్‌ అనిపించలేదా?
రెగ్యులర్‌ సినిమాల్లో హీరోయిన్‌కి సమస్య వస్తే హీరో కాపాడి తనను సేవ్‌ చేస్తాడు. కాని ఈ సినిమాలో హీరోయిన్‌ యాక్షన్‌ సీక్వెన్సెస్‌లో హీరోతో పాటు ట్రావెల్‌ అవుతుంటుంది. కొన్ని షాట్స్‌ నేను చేయలేను అనుకున్నప్పుడు ఫైట్‌ మాస్టర్‌ దగ్గరుండి చేయించేవారు. షూటింగ్‌ టైంలో నా కాళ్ళకు, చేతులకు చాలా గాయాలయ్యాయి.
 
సోలో హీరోయిన్‌‌గా చాలా గ్యాప్‌ వచ్చినట్లుంది..?
'అత్తారింటికి దారేది' చిత్రానికి ముందు సోలో హీరోయిన్‌గా చేసాను. మంచి సినిమాల్లో మాత్రమే నటించాలని నిదానంగా ఓకే చేసుకుంటున్నా. నేను నటించే పాత్రకు ఇంపార్టెన్స్‌ ఉండాలి. 'రాక్షసుడు' సినిమాలో నా స్క్రీన్‌ ప్లేస్‌ చాలా తక్కువసేపు ఉంటుంది. కాని సినిమా చూసిన వారికి మాత్రం నా పాత్ర గుర్తుండిపోతుంది. అలాంటి రోల్స్‌లో నటించాలనుంది.
 
విష్ణుతో వర్క్‌ చేయడం ఎలా అనిపించింది?
వండర్‌‌ఫుల్‌ యాక్టర్‌ తను. విష్ణు మైండ్‌‌సెట్‌ చాలా డిఫరెంట్‌‌గా ఉంటుంది. హాలీవుడ్‌ ఫిల్మ్స్‌ ఎక్కువగా చూస్తాడు. తన సినిమాలు కూడా అలానే ఉండాలని భావిస్తాడు. 
 
డైరెక్టర్‌ గురించి?
దేవకట్ట గారికి స్క్రిప్ట్‌‌పై చాలా క్లారిటీ ఉంది. ఇది రీమేక్‌ చిత్రమైనా తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ జోడించి తీసారు. తన స్క్రీన్‌ ప్లే అద్భుతంగా ఉంటుంది. 
 
సినిమాలో ఛాలెంజింగ్‌ సీన్స్‌ ఏమైనా ఉన్నాయా?
ఈ చిత్రంలో బిగ్గెస్ట్‌ ఛాలెంజింగ్‌ అంటే ఫైట్‌ సీన్సే. బాలీవుడ్‌లో వచ్చిన క్వీన్‌, ఎన్‌హెచ్‌ 4, పెర్ఫార్మన్స్‌‌కు స్కోప్‌ ఉన్న చిత్రాలు. అదే రేంజ్‌‌లో ఈ సినిమా కూడా ఉంటుంది. యాక్షన్‌ సీన్స్‌లో మొదటిసారి నటించాను. అందరూ ఈ చిత్రాన్ని ఆదరిస్తారని భావిస్తున్నాను.
 
కన్నడలో సినిమాలు నిర్మించే ఆలోచన ఉందా?
ప్రొడ్యూస్‌ చేయడం, డైరెక్ట్‌ చేయడం అనేవి చిన్న విషయాలు కావు. ప్రస్తుతం నటిగానే కంటిన్యూ చేస్తాను. ఫ్యూచర్‌లో నిర్మాతగా ఖచ్చితంగా చేస్తాను అని చెప్పింది.