Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'బాహుబలి'కి 'శాతకర్ణికి' పోలికే లేదు.. దర్శకుడు రాధాకృష్ణ ఇంటర్వ్యూ

సోమవారం, 9 జనవరి 2017 (22:51 IST)

Widgets Magazine
krish

తాను తీసిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రానికి రాజమౌళి తీసిన 'బాహుబలి'కి పోలికేలేదనీ, ఎటువంటి పరిస్థితిల్లో దాన్ని అలా చూడవద్దని.. దర్శకుడు రాధాకృష్ణ (క్రిష్‌) తెలియజేశారు. ఈ నెల 12న విడుదలవుతున్న చిత్రం గురించి ఆయన మాట్లాడారు.
 
యుద్ధం సినిమా అనగానే బాహుబలితో పోలుస్తున్నారు.. దాన్ని మీరెలా స్వీకరిస్తారు?
అది కల్పితమైన కథ. ఇది జరిగిన కథ. రెండింటినీ పోల్చలేం. బాహుబలిలో జలపాతాన్ని హీరో ఎక్కడం ఆశ్చర్యంగా చూశారు. అలాంటివి ఇందులో పెట్టడానికి కుదరదు. నా కథలన్నీ రాజమౌళితో చర్చిస్తాను. ఓసారి ఢిల్లీలో కలిశాం. వాకింగ్‌ చేస్తూ కథ చెప్పాను. విన్న వెంటనే చాలా బాగుంది. ఎప్పుడు రిలీజ్‌ చేస్తున్నావ్‌ అని అడిగాడు.. జనవరి 12 అని చెప్పేశా. ఆ రోజు వివేకానందుడి పుట్టినరోజు. ఈ సినిమాను చాలా ప్రణాళికగా సిద్ధం చేసుకున్నాం. 
 
ఉగాదికి అమరావతిలో ప్రారంభించి, తిరుపతిలో ఆడియో చేసి వైజాగ్‌లో   పతాకావిష్కరణ..ఇలా  చాలాక్లారిటీ చేశాం. రాజమౌళి గారు విన్నాక.. రెండు సూచనలు చేశారు. గ్రాఫిక్స్‌ లేకుండా చేయి. అవి నీ చేతుల్లో లేవు. డబ్బుతో పనికాబట్టి.. అన్నీ సహజంగా వుండేలా జాగ్రత్తలు తీసుకోమన్నారు. అందుకే మొరాకాలో షూటింగ్‌ అనుకున్నాక.. ఇక్కడ నుంచి కాస్ట్యూమ్స్‌ను ఇతర ఆభరణాలు తీసుకెళితే చాలా ఎక్కువ బడ్జెట్‌ అవుతుందనీ.. అక్కడే వున్న వాటితో చేశాం. అక్కడ యుద్ధ సామాగ్రి, గుర్రాలు కూడా దొరికాయి. 'కంచె' సినిమా టైమ్‌లో కూడా జార్జియాలో యుద్ధట్యాంకులు అక్కడే వుంటాయని తెలిసి అక్కడే షూటింగ్‌ ప్లాన్‌ చేశాం.
 
బాలకృష్ణ ప్రభావం మీమీద ఎంతవరకు వుంది?
తల్లిపట్ల, అవ్యాజమైన ప్రేమ వున్నవాడు. పరిపాలనా శైలి... ఇవన్నీ రాస్తుంటే.. ప్రతి కథ రాసేటప్పుడు కథకుడిని ఎన్నుకుంటుంది. ఈ కథ రాస్తున్నప్పుడే బాలకృష్ణ గుర్తుకువచ్చారు. రాస్తున్నప్పుడే విదేశీయుడు.. దేశానికి కింద వుండేవాడా అధముడా అంటూ ఎద్దేవా చేస్తాడు. దానికి కౌంటర్‌గా దక్షిణాది అథములం కాదు. తెలుగుజాతి ప్రథములం దేశానికి నిలబెట్టేలా పునాదిని ఇచ్చేది తెలుగుజాతి అంటూ.. కొన్ని డైలాగ్‌లు వున్నాయి. ఇవన్నీ.. రాస్తుంటే అంతకుముందు భైరవ ద్వీపం, కృష్ణదేవరాయలు గెటప్‌ చూశాక.. ఆయనే కళ్ళమందు కన్పించాడు.
 
కథ వినేటప్పుడు ఆయన ఎలా ప్రవర్తించారు?
కథ ఆరంభంలోనే ముగ్గురు రాయబారులు లేఖలు తీసుకుని వెళతారు. అది బాలకృష్ణ వాయిస్‌ ఓవర్‌తో బాగుంటుందని అనుకుని రాశాం. 'మిత్రమా! మా కత్తికంటే మా నెత్తుటిచార ఇంకా పచ్చిగా వుందని.. చెబుతుంటే.. ఆయనలో ఆవేశం గమనించాను. కథ గంట అనుకుంటే రెండు గంటలు పట్టింది. ప్రతి సన్నివేశంలో ఆయన రియాక్ట్‌ కావడం గమనించాను. విన్న తర్వాత ఎప్పుడు చేస్తున్నామ్‌ అన్నారంతే. 
 
గౌతమీపుత్ర శాతకర్ణి పేరు పెట్టాలని ఎందుకు అనిపించింది?
చిన్నప్పుడు ఆచార్య నాగార్జున యూనివర్శిటీని చూసినప్పుడు ఆ యూనివర్శిటీకి ఆ పేరు ఎందుకు పెట్టారు అని నాలో సంశయం ఉండేది. ఆ తర్వాత అమరావతీ ట్రిప్‌ వెళ్లినప్పుడు కూడా అదే డౌటే. ఇలా నా చిన్నతనం నుంచే ఉండేది. అది పెరిగి పెద్దదై ఇంతదాకా వచ్చింది.
 
ఇంత త్వరగా తీయడానికి ఎలా సాధ్యమైంది?
తెలిసో తెలియకనో ముందు డెడ్‌లైన్‌ పెట్టేసుకున్నాను. ఆ డెడ్‌లైన్‌కి తగ్గట్టు పనిచేశాను. ఎక్కువగా లైవ్‌లో చేయడానికి ప్రయత్నించాను. ఈ సలహా నాకు రాజమౌళిగారు ఇచ్చారు. అలాగే నిద్ర పోకుండా, పోనివ్వకుండా పనిచేశాను.
 
బడ్జెట్‌ను దష్టిలో పెట్టుకుని తగ్గించుకున్న ఖర్చులు ఉన్నాయా?
కొన్ని వున్నాయి. శివరాజ్‌ కుమార్‌ను దృష్టిలో పెట్టుకుని తీసిన పాత్రకోసం ఓ పాట తీయాలనుకున్నాం. అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే వదులుకున్నాం.
 
ఆయన్నే ఎందుకు తీసుకోవాలనిపించింది?
ఆ కేరక్టర్‌ డిమాండ్‌ చేసిన విషయం. ఆ కేరక్టర్‌ని బట్టే మేం ఆయన్ని సెలక్ట్‌ చేశాం. అంతేగానీ కావాలని ఏదో సెన్సేషన్‌ కోసం కాదు.
 
తల్లి పాత్రకు హేమమాలిని ఒప్పుకున్నారా?
అసలు ఆమె నన్ను కలవడానికి కూడా ముందు అంగీకరించలేదు. కానీ ఎలాగోలా సమయాన్ని తీసుకుని వెళ్లి కథను చెప్పాను. దానికి ఆవిడ స్ఫూర్తి పొంది రమ్మన్నారు.
 
మన దగ్గర కథే లేదు. సరైన విషయాలు లేవు. మరి ఎలా ఈ కథను రాసుకున్నారు?
తమిళంలో శాతకర్ణి గురించిన వివరాలున్నాయి. అలాగే మెకంజీ రాసినవి ఉన్నాయి. విదేశాల్లో ఉన్నాయి. మహరాష్ట్ర గెజెట్‌లో ఉన్నాయి. ఇలా పలుచోట్ల దొరికిన విషయాలను తీసుకుని సినిమాటిక్‌ లిబర్టీస్‌ను తీసుకుని చేశాం.
 
బాలకృష్ణ 100వ సినిమా అనే టెన్షన్‌ ఉందా?
మంచి సినిమా చేస్తున్నామనే భావన ఉంది. తెలుగువారికి నచ్చేలా చెప్పాలనే ఫీలింగ్‌ ఉంది. ఇది తెలుగువారి కథ. దాన్ని నేను అర్థవంతంగా చెప్పాలనే అనుకున్నాను.
 
ఈ సినిమాను ఇతర భాషల్లో తీసే ఉద్దేశం ఉందా?
లేదు. సబ్‌టైటిల్స్‌‌తో విడుదల చేస్తే చాలు. అందరికీ అర్థమయ్యే కథ ఇది.
 
ఇంత బీజీగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నారే?
జీవితం కడు'రమ్యం'. నా భార్య పేరు రమ్య. అంతకన్నా ఏమీ చెప్పలేను.
 
బాలకృష్ణ గారితో పనిచేయాలంటే భయపడ్డారా?
ఆయన హైపర్‌ యాక్టివ్‌ పర్సన్‌. ఆయన గుర్రాన్ని స్వారీ చేసే విధానం చూసి మొరాకోలో గుర్రాలకు శిక్షణ ఇచ్చే వ్యక్తి ఆశ్చర్యపోయాడు. ఇంత బాగా నడిపేవారిని ఇప్పటిదాకా చూడలేదని అన్నారు. డూప్‌లతో చేయించడానికి, రోప్‌ వర్క్‌కు కూడా ఆయన అసలు ఒప్పుకోలేదు. అంత వర్క్‌ ఓరియంటెడ్‌ పర్సన్‌ ఆయన.
 
సీక్వెల్‌గా వాసిష్టీ పుత్ర ఉంటుందా?
పరిస్థితులు అనుకూలిస్తే. ఉండవచ్చు.
 
పండుగకు రెండు పెద్ద సినిమాలు విడుదల కావడం ఎలా ఉంది?
మన చిన్నతనంలో నాలుగైదు సినిమాలను ఒకేసారి చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు రెండు సినిమాలను చూడటం పెద్ద ఇది కాదు. అయినా మా సినిమా ముహూర్తం సమయంలో చిరంజీవిగారు వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. తమ బాస్‌ శుభాకాంక్షలు చెప్పిన సినిమా బాగా ఆడాలని ఆయన అభిమానులు కోరుకోవాలి. అలాగే నందమూరి బాలకృష్ణ సినిమాకు వచ్చి అభినందనలు చెప్పిన చిరంజీవిగారి సినిమా బాగా ఆడాలని నందమూరి అభిమానులూ కోరుకోవాలి. అంతా ఆనందమైన వాతావరణ వుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'ఎగ్రిసివ్'గా వెళ్లడం పవన్ స్టయిల్... చిరంజీవి ఇంటర్వ్యూ ఆఖరి భాగం

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం.150 చిత్రం విడుదల సందర్భంగా ఇచ్చిన ...

news

రాజకీయంగా ఇప్పుడు నేను చేయగలిగింది ఏమీలేదు... అందుకే సినిమాలు చేస్తున్నా... చిరంజీవి ఇంటర్వ్యూ రెండో భాగం

కొడుకు నిర్మాత మీరు హీరో ఎలా అనిపిస్తుంది? చాలా గర్వంగా వుంది. తను 'ధృవ' షూటింగ్‌లో ...

news

నా ట్రైనర్ రామ్ చరణ్... చిరంజీవి ఇంటర్వ్యూ మొదటి భాగం

జనవరి 11న ఖైదీ నెంబర్ 150 విడుదల సందర్భంగా మెగాస్టార్ చిరంజీవితో ముఖాముఖి. ...

news

నాగబాబును వర్మ హర్ట్ చేశారేమో? వర్మ నాతో కూడా... చిరంజీవి వ్యాఖ్య

రాంగోపాల్ వర్మను మొన్న ఖైదీ నెంబర్ 150 ప్రిరిలీజ్ కార్యక్రమంలో విమర్శలతో దుమ్ముదులపడంపై ...

Widgets Magazine