శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By dv
Last Updated : మంగళవారం, 21 జూన్ 2016 (17:04 IST)

నలుగురు హీరోలను అనుకున్నా.. చివరికి నానితోనే హిట్‌కొట్టా.. 'జెంటిల్‌మన్' ఇంద్రగంటి

'అష్టాచమ్మా' సినిమాతో నాని హీరోగా పెట్టి తీసి సక్సెస్‌ కొట్టిన దర్శకుడు ఇంద్రగంటి మోహనకష్ణ. ఆ తర్వాత 'మాయాబజార్'‌, 'బందిపోటు' వంటి చిత్రాలు చేశాడు. బందిపోటు.. డిజాస్టర్‌ అయింది. ఆ చిత్రం నిరాశపర్చింది

'అష్టాచమ్మా' సినిమాతో నాని హీరోగా పెట్టి తీసి సక్సెస్‌ కొట్టిన దర్శకుడు ఇంద్రగంటి మోహనకష్ణ. ఆ తర్వాత 'మాయాబజార్'‌, 'బందిపోటు' వంటి చిత్రాలు చేశాడు. బందిపోటు.. డిజాస్టర్‌ అయింది. ఆ చిత్రం నిరాశపర్చింది. ఒక్క నెల తర్వాత... జెంటిమెల్‌మెన్‌ కథ వచ్చింది. ఆ కథ పనిలో ఉండటంతో ప్లాప్‌ అయిన బాధ పెద్దగా కన్పించలేదు. ఇప్పుడు సినిమా హిట్‌ తర్వాత.. కొత్త ఉత్సాహం వచ్చిందని ఇంద్రగంటి చెపుతున్నారు. ఈ సినిమాను శ్రీదేవి మూవీస్‌ సంస్థ అధినేత శివలెంక కష్ణప్రసాద్‌ నిర్మించారు. ఈ సందర్భంగా ఇంద్రగంటితో చిట్‌చాట్‌. 
 
* మణిశర్మను మొదటినుంచి అనుకున్నారా? 
అవును. కథ అనుకున్నప్పుడే ఆయనతో చేయించాలని డిసైడ్‌ అయ్యాను. ఇందులో లైవ్‌ ఇన్‌స్ట్రిమెంట్స్‌ వాడారు. 
 
* బయట కథతో సినిమా తీశారే? 
ఈ సినిమా కథను డేవిడ్‌నాథన్‌ ఇచ్చాడు. తను మలయాళీ. చాలాకాలం అయింది చెప్పి.. అయితే.. మన కల్చర్‌కు దూరంగా ఉండడంతో దాన్ని పూర్తిగా మార్చాల్సివచ్చింది. దాదాపు 20 వర్షన్‌లు మార్పులు చేశాం. దానికే చాలా టైం పట్టింది. 
 
* కథను ఇంకెవరికైనా చెబుతారు? 
నేను తీసే ఏ కథైనా.. నా కుటుంబ సభ్యులకు చెబుతాను. ఇంటిలోవారికందరికి చదివి వినిపిస్తాను. వారికి నచ్చితే సినిమా తీస్తాను. అందుకే అటు సెన్సార్‌ పక్షంగా, ఇటు సంసారపక్షంగా నా చిత్రాలుంటాయి. 
 
* బందిపోటు కూడా చెప్పారా? 
చెప్పాను. ఆ కథ.. ఇంగ్లీషు నవల ఆధారంగా చేసి తీసుకుంది. ఎందుకనే ప్రేక్షకుడికి కనెక్టకాలేదు. అల్లరి నరేశ్‌ నిర్మాతగా ఉన్నారు. వారికీ నచ్చింది. ఆ సినిమా ప్లాప్‌తో చాలా నిరాశపడ్డాను. 
 
* 'జెంటిల్‌మెన్‌'కు నానినే హారో అనుకున్నారా? 
మొదట నానితో చేయాలనుకుంటే అప్పుడు 'ఎవడే సుబ్రమణ్యం' సినిమాతో బిజీగా ఉన్నాడు. తర్వాత మరో సినిమాలు చేయాల్సి ఉంది. డిసెంబర్‌ తర్వాత చేద్దాం సార్‌ అన్నాడు. మార్చి నుంచి డిసెంబర్‌ వరకంటే చాలా గ్యాప్‌. ఏం చేయాలని ఆలోచించి.. ముందు స్క్రిప్ట్‌ వర్క్‌ మొదలుపెట్టాను. ఇక లాభంలేదని మరో హీరోతో సినిమా చేద్దామనిపించి శర్వానంద్‌కు కథను చెప్పాను. తను 'ఎక్స్‌ప్రెస్‌రాజా' సినిమాతో బిజీగా ఉన్నాడు. మరో ముగ్గురు హీరోలకు కథను చెప్పాను. వారు తమదైన కారణాలు తెలిపారు. అయితే నాని ఈ సినిమాకు న్యాయం చేయగలడనిపించింది. తన కోసం వెయిట్‌ 
చేశాను. 
 
* టైటిల్‌కు న్యాయం జరిగిందా? 
సాధారణంగా నా సినిమాలకు తెలుగు టైటిల్స్‌ పెట్టాలనుకుంటాను. ఈ సినిమాలో నాని క్యారెక్టర్‌ హీరోనా!, విలనా! అనే విధంగా ఉంటుంది. కానీ తను ఒక జెంటిల్‌మన్‌. ముందు ఈ సినిమాకు 'ఉత్తముడు' అని పెడితే ముందుగానే కథ తెలిసిపోతుంది. అలాగే 'ఉత్తమవిలన్‌' సరిగ్గా సరిపోతుంది. కానీ అప్పటికే కమల్‌ సినిమా వచ్చేసింది. హీరో క్యారెక్టర్‌ రివీల్‌ అవ్వకుండా ఉండాలనే జెంటిల్‌మన్‌ అనే టైటిల్‌వైపు మొగ్గు చూపాం. 
 
* స్క్రీన్‌ప్లే ఎలా అనిపించింది? 
సినిమా క్లైమాక్స్‌ 10 నిముషాలు కీలకం. ఆడియన్స్‌ ఊహించని విషయాలు ఉండాలి. ఏ మాత్రం బోర్‌ ఫీలైనా మొత్తం వృధానే. అందుకోసం ఏం చేయాలని ఆలోచించాం. ముందు క్లైమాక్స్‌ సీన్‌ 18 నిమిషాల వ్యవధితో ఉంటుంది. దీన్ని 12 నిమిషాలకు కుదించాం. స్క్రీన్‌ప్లే పెద్ద చాలెంజ్‌గా మారింది. క్లైమాక్స్‌లో నాని యాక్టింగ్‌కు ఆడియెన్స్‌ క్లాప్స్‌ కొట్టారు. 
 
* డేవిడ్‌ సంతృప్తిగా ఉన్నారా? 
ఇప్పటివరకు నేను చేసిన సినిమాలను చూసుకుంటే దేనికదే డిఫరెంట్‌గా ఉంటుంది. జెంటిల్‌మన్‌ విషయంలో కూడా నా సెన్సిబిలిటీస్‌ వదులుకోకుండా సినిమా చేశాను. మరొకరు రాసిన కథను సినిమాగా తీయాలంటే మనం అన్వయించుకోవాలి. అప్పుడే రచయిత హ్యాపీగా పీలవుతాడు. డేవిడ్‌నాథన్‌ ఈ విషయంలో సంతోషంగా ఉన్నారు. 
 
* హీరోయిన్‌గా నిత్యను అనుకోలేదా? 
ఈ సినిమాలో నివేద స్థానంలో నిత్యామీనన్‌, కీర్తిసురేష్‌తో పాటు నలుగురిని అనుకున్నాం. అయితే మణిరత్నంగారి ఓ సినిమాలో నివేద యాక్టింగ్‌‌ను మా కోడైరెక్టర్‌ సురేష్‌ చూశారు. ఆయనకు నచ్చింది. ఆ సినిమాను నాకు చూపించారు. అలాగే నివేద 'పాపనాశం' చిత్రంలో కమల్‌హాసన్‌ కూతురుగా నటించింది. అలాగే ఆ సినిమా సమయంలో తనిచ్చిన ఇంటర్వ్యూలో తను మాట్లాడిన విధానం నాకు నచ్చింది. అందుకనే తనను ఈ 
సినిమాలో హీరోయిన్‌గా తీసుకున్నాం. తను పెర్‌ఫార్మెన్స్‌కు మంచి ప్రశంసలు దక్కాయి. 
 
* నానితో మళ్ళీ హిట్‌ కొట్టారే? 
నానితో 'అష్టాచమ్మా' సినిమా చేశాను. చాలా గ్యాప్‌ తర్వాత మళ్ళీ మా కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా కమర్షియల్‌గా చాలా పెద్ద సక్సెస్‌ సాధించింది. ఓవర్‌సీస్‌లో కూడా కలెక్షన్స్‌ బావున్నాయి. నాని నా లక్కీ చాంప్‌. ఈ సినిమా నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌. 
 
* మీరు కథలు రాయడం లేదా? 
నేను కథలు రాసేటప్పుడు కథ, కథనం, సందర్భానికి తగిన విధంగా పాటలు ఇలా ఓ ఫార్మేట్‌లో రాసుకుంటూ వెళతాను. కథ అంతా సిద్ధం అయిన తర్వాత దీనికి ఎవరు సూట్‌ అవుతారోనని ఆలోచిస్తాను. 
 
* కొత్త సినిమాలు? 
షేక్స్‌స్పియర్‌ నాటకాల్లోని కామెడీ, రొమాన్స్‌ తీసుకుని ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ కథను సిద్ధం చేసుకుంటున్నాను. అలాగే కుటుంబరావుగారి కథల్లో 
రెండింటిని, బుచ్చిబాబుగారి 'చివరకు మిగిలేది' అనే నవల హక్కులను కూడా పొందాను. వీటి ఆధారంగా సినిమాలు రూపొందించాలనుకుంటున్నాను. ఎప్పటికైనా అంతర్జాతీయస్థాయిలో ప్రదర్శించేలా సినిమా తీయాలనే కోరిక వుంది.