శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: బుధవారం, 21 అక్టోబరు 2015 (17:09 IST)

సినిమాల్లోకి నిహారిక వద్దని అంటున్నారు.. కానీ..: వరుణ్‌ తేజ్‌ ఇంటర్వ్యూ

నాగబాబు తనయుడి హీరోగా 'ముకుంద'తో కెరీర్‌ ప్రారంభించిన వరుణ్‌ తేజ్ తనకు తొలి చిత్రం.. క్రిష్‌ దర్శకత్వంలో చేయాల్సి వుంది. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు.. ఆ తర్వాత.. నితిన్‌ చేసిన 'హార్ట్‌ ఎటాక్‌' చిత్ర కథ నాకు పూరీ చెప్పారు. అయితే తొలి సినిమాకే రిస్క్‌ చేయడం కష్టమని వదులుకున్నానని అన్నాడు. తాజాగా ఆయన క్రిష్‌ దర్శకత్వంలో 'కంచె' చేశాడు. అది ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా తేజ్‌తో ఇంటర్వ్యూ... 
 
క్రిష్‌తో చేయడానికి కారణం?
నా మొదటి సినిమా క్రిష్‌ గారితో చేయాల్సింది. ఈ కంచె కథ అప్పుడే తెలుసు. కాని కుదరలేదు. ఇప్పటికి కుదిరింది. నా సన్నిహితులు కొందరు కమర్షియల్‌ సినిమాల్లో నటించమని సలహాలు ఇచ్చారు. కంటెంట్‌ ఉన్న సినిమాల్లోనే నటించాలనుకున్నాను.
 
ట్రైలర్‌ చూస్తే ముక్కోణపు ప్రేమకథలా వుందే?
కానేకాదు. దూపాటి హరిబాబు అనే ఓ కుర్రాడు కాలేజీలో చదువుకుంటూ ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. తన జర్నీను ఈ సినిమాలో చూపించారు. ఇదొక పీరియాడిక్‌ ఫిలిం.
 
పీరియాడిక్‌ ఫిలింపై ఎంత కేర్‌ తీసుకున్నారు?
1932 లోని కథ. అందుకే ముందు భాష మీద పట్టు రావాలని యాస విషయంలో కేర్‌ తీసుకున్నాను. సైనికుడిలా కనిపించడానికి ట్రైనింగ్‌ తీసుకున్నాను. చాలామంది మిలిటరీ పర్సన్స్‌ను కలిశాను. వార్ నేపధ్యంలో వచ్చిన హాలీవుడ్‌ సినిమాలు చూసాను. ఈ సినిమా యుద్ధంతోనే మొదలవుతుంది. ఒకవైపు యుద్ధాన్ని చూపిస్తూ.. మరోవైపు విలేజ్‌ పార్ట్‌ను చూపిస్తాం. స్క్రీన్‌ ప్లే కొత్తగా ఉంటుంది.
 
గన్‌ పట్టుకోవడం కష్టంగా అనిపించిందా?
నాకు చిన్నప్పటినుండి గన్‌ షూటింగ్‌ అంటే చాలా ఇష్టం. బాబాయి తన సినిమాల్లో ఎక్కువగా గన్స్‌ వాడేవారు. అదిచూసి గొడవ చేసేవాడిని. అప్పుడు బొమ్మ తుపాకి కొని ఇచ్చారు. అలా చిన్నతనంలోనే గన్‌పై ఇంట్రెస్ట్‌ వుండేది. ఇక ఈ సినిమాలో సుమారుగా 30 నుండి 35 కేజీల బరువుండే గన్‌ను సినిమా మొత్తం నా భుజాలపై వేసుకొని మోస్తూనే ఉంటాను. ఫిజికల్‌గా చాలా స్ట్రెయిన్‌ అయ్యేవాడిని. కాని గన్‌ పట్టుకుంటే మాత్రం ఆథెంటిక్‌ ఫీల్‌ వచ్చేది. 1932లో తయారుచేసిన గన్‌ను ఉపయోగించాం.
 
ఫ్యాన్‌ ఎలా ఆదరిస్తున్నారు?
కంటెంట్‌ బావుంటే ఎవరైనా చూస్తారు. బ్యాక్‌‌గ్రౌండ్‌ ఉందని ఒకటిరెండు సినిమాలు మాత్రమే చూస్తారు. టాలెంట్‌ లేకపోతే ఎవరూ చూడరు. అందుకే ముందు నటునిగా నన్ను నేను ప్రూవ్‌ చేసుకోవాలి. దాని కోసం ఎంత హార్డ్‌‌వర్క్‌ అయినా చేస్తాను.
 
చిరంజీవి, పవన్‌ సలహాలు ఇస్తుంటారా?
'ముకుంద' సినిమా చూసి పెదనాన్న, బాబాయిలు నాకు కొన్ని సలహాలు ఇచ్చారు. పెదనాన్న అయితే నువ్వు డాన్సు ఇంత బాగా చేస్తావనుకోలేదని చెప్పారు. వాళ్ళు ఇచ్చిన సలహాలను ఈ సినిమాలో ఇంప్లిమెంట్‌ చేసాను. బాబాయ్‌ ఎప్పుడూ.. నీ పేషన్‌ ఫాలో అవ్వని చెబుతుంటారు.
 
పూరీతో 'లోఫర్‌' చేయడం ఎలా అనిపిస్తుంది?
పూరీ గారితో ప్రస్తుతం చేస్తుంది కమర్షియల్‌ సినిమానే. ఆయన మొదట నాకు 'హార్ట్‌ ఎటాక్‌' మూవీ కథ చెప్పారు. ఆ సినిమా కూడా నేనే చేయాల్సింది. కాని మొదటి సినిమాగా అది కరెక్ట్‌ కాదని భావించాం. అప్పుడు నితిన్‌ ఓకే చేసాడు. అలానే ఇప్పుడు నేను పూరి గారి డైరెక్షన్‌లో చేస్తున్న కథ కూడా ముందుగా నితిన్‌ చేయాల్సింది కాని నేను చేస్తున్నాను. ఈ సినిమా షూటింగ్‌ ఇప్పటికే పూర్తయ్యింది. లోఫర్‌, మా అమ్మ సీతామహాలక్ష్మి వంటి టైటిల్‌ అనుకుంటున్నాం. మరో టైటిల్‌ కూడా వచ్చి చేరొచ్చు. త్వరలోనే తెలియజేస్తాం. మంచి ఎంటర్టైనింగ్‌ ఫిలిం. అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి తరహాలో ఉండే సినిమా. 
 
రిస్క్‌ షాట్స్‌ చేశారా?
ఈ సినిమాలో ఓ సన్నివేశంలో రెండు ఫ్లోర్‌ల నుండి దూకాలి. నా హైట్‌ నాకు హెల్ప్‌ చేసింది. కాని సెకండ్‌ ఫ్లోర్‌ ఎక్కి చూసినప్పుడు ఇంకా డెప్త్‌ ఉందే అనుకున్నాను. క్రిష్‌ యాక్షన్‌ చెప్పగానే పై నుండి దూకేశా. ఎలాంటి రోప్‌ సహాయం తీసుకోలేదు. ఆ సీన్‌ రెండుసార్లు చేయాల్సి వచ్చింది. రెండోసారి సులభంగా చేసేశా.
 
మీ సోదరి విషయంలో ఫ్యాన్స్‌ ఒత్తిడి వుందని తెలిసింది?
అవును. కానీ అది ఆమె ఇష్టం. మా ఫ్యామిలీలో హీరోయిన్లు లేరు. అందరూ హీరోలే. నాకు నా సోదరి హీరోయిన్‌గా చేస్తుందని ఆఖరున తెలిసింది. ముందుగా బాబాయ్‌కు చెప్పారు. ఆయన అంగీకారం తీసుకున్నారు. నేను షూటింగ్‌‌లో ఉన్నప్పుడు నిహారిక నాకు ఫోన్‌ చేసి హీరోయిన్‌గా చేయాలనుకుంటున్నాను. నువ్వేం అంటావని అడిగింది. అప్పటివరకు టీవి షోస్‌ చేసే తనకు సినిమాల్లోకి రావాలనే ఆసక్తి ఉందనుకోలేదు. 
 
తనకు అంత పేషన్‌ ఉన్నప్పుడు ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ఇంట్లో అందరం ఒప్పుకున్నాం. తను మొదట నటిగా మారలనుందని పెదనాన్నకే చెప్పింది. మా నాన్నగారితో నిహారికను హీరోయిన్‌‌గా చేయొద్దని చాలామంది చెప్పారు. కొందరైతే ఇంటికొచ్చి మరీ మాట్లాడారు. మెగా అభిమానులు కూడా కొందరికి నిహారిక రావడం ఇష్టం లేదు. అభిమానులే మాకు వెన్నెముక. ఎప్పటినుండో మమ్మల్ని ఆదరిస్తూ.. వస్తున్నారు. పెదనాన్న ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అభిమానులను దృష్టిలో పెట్టుకొనే సినిమాలు చేయాలని.
 
క్రిష్‌ ఎలాంటి దర్శకుడు?
క్రిష్‌ నాకు మంచి స్నేహితుడు. తన సినిమాలంటే చాలా ఇష్టం. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించాడు. సెట్స్‌‌లో ఎప్పుడూ ఉత్సాహంతో ఉంటాడు. ఆ ఉత్సాహమే మాకు ఎనర్జీ ఇస్తుంది.
 
ప్రజ్ఞతో రొమాన్స్‌ ఎలా వుంది?
హీరోయిన్‌ ప్రజ్ఞతో చాలా కంఫర్టబుల్‌‌గా వర్క్‌ చేసాను. మా ఇద్దరి మధ్య రొమాన్స్‌ కూడా సెటిల్డ్‌‌గా ఉంటుంది. మేము ఇద్దరం పరిచయమవ్వడమే సినిమాలో ఇంట్రడక్షన్‌ సీన్‌‌తో ఇంట్రడ్యూస్‌ అయ్యాం.
 
తదుపరి చిత్రాలు? 
చాలా కథలు విన్నాను. వింటున్నాను. క్రిష్‌ కూడా ఓ కథ చెప్పాడు. ఆ సినిమా కూడా చేసే అవకాశం వుంది.
 
ఎక్కువగా ఏ తరహా చిత్రాలు చూస్తుంటారు?
నాకు యాక్షన్‌ చిత్రాలంటే ఇష్టం. అందుకే వార్‌ సినిమాలు తెగ చూసేశా.. ఆ చిత్రాలు కంచెకు బాగా ఉపయోగపడ్డాయి.
 
పాత్ర పరంగా ఎలాంటి డైట్‌ తీసుకున్నారు?
సైనికుడిగా చేయడం కష్టమే.. మామూలు ఫుడ్‌ కాకుండా కాస్త విటమిన్స్‌ వున్న ఫుడ్స్‌.. డ్రై ఫూట్స్‌ తీసుకునేవాడిని. సైనికుల మ్యానిఫెస్టో చూసి కొద్దిరోజులు పాటించాం. నూనె అస్సలు వాడరు అని చెప్పి ముగించారు.