శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By ivr
Last Modified: మంగళవారం, 19 ఆగస్టు 2014 (19:10 IST)

లిప్‌లాక్‌లకు దూరం... శ్రీదేవి, అనుష్కల్లా పేరు తెచ్చుకోవాలి - నందిత

'ప్రేమకథాచిత్రమ్‌'తో భయపెట్టించిన భామ నందిత. సికింద్రాబాద్‌లో చదువుకుంటున్న ఈ అమ్మాయి మారుతి దృష్టిలో పడి హీరోయిన్‌గా అవకాశం పొందింది. మారుతి తొలిచిత్రం 'ఈ రోజుల్లో'నే సెలక్ట్‌ అయినా.. పరీక్షల వల్ల ఆమె డేట్స్‌ కుదరక చేయలేకపోయింది. అదికూడా ఒకందుకు మంచిదే అయిందంటుంది నందిత. మారుతీ దర్శకత్వంలో 'లవర్స్‌'లో నటించింది. ఈ చిత్రం విడులైంది. ఈ సందర్భంగా ఆమెతో జరిపిన ఇంటర్య్వూ విశేషాలు.
 
ఎటువంటి కథను ఎంపిక చేసుకుంటారు? 
కథ వినగానే చక్కని ఫీలింగ్‌ కలగాలి. నేనీ కథకు న్యాయం చేయగలను అనే నమ్మకం కుదరాలి. అప్పుడే ఆ సినిమా చేయడానికి అంగీకరిస్తాను. ప్రతి సినిమాలో ఒకే తరహా పాత్ర కాకుండా కొత్తగా కనిపించాలను కుంటాను.
 
థియేటర్‌ స్పందన ఎలా అనిపించింది? 
శనివారం థియేటర్‌లో సినిమా చూశాను. ప్రేక్షకుల నుండి వస్తున్న స్పందన చూసి చాలా ఆనందపడ్డాను. అంతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని ఊహించలేదు. ముఖ్యంగా సెకెండాఫ్‌లో సప్తగిరి ఎంటర్‌ కాగానే థియేటర్‌ మొత్తం చప్పట్లు, విజిల్స్‌తో మార్మోగిపోయింది. అతని క్యారెక్టర్‌ సినిమాకి హైలైట్‌గా నిలిచింది. నాకు ఫస్టాఫ్‌లో బ్రేకప్‌ చేయడం, హీరోతో ఫోన్‌లో అరవడం, అక్కడ డైలాగ్‌లు బాగా నచ్చాయి. 
 
స్పందనకు కారణం ఏమనుకుంటున్నారు? 
కథ వినగానే ఫ్రెష్‌గా, స్ట్రాంగ్‌గా అనిపించింది. మారుతి నా వెర్షన్‌ బాగా రాస్తారని, నటన పరంగా మంచి అవుట్‌పుట్‌ తీసుకుంటారని నా నమ్మకం. అందుకే ఈ కథను అంగీకరించాను. హరి డైరెక్షన్‌ బావుంది. సీనియర్‌ దర్శకులతో సినిమా చేస్తే పెర్‌ఫార్మెన్స్‌కి స్కోపు ఉంటుంది. ఈ సినిమాలో నాది సాధారణమైన పాత్ర అయినప్పటికీ మంచి అప్‌లాజ్‌ వచ్చింది. 
 
నిజ జీవితంలో ఎవరినైనా ప్రేమించారా? 
లవర్స్‌ సినిమాలో చిత్ర పాత్రలా నా రియల్‌ లైఫ్‌ పాత్ర ఉండదు. ప్రేమనేది చక్కని ఫీలింగ్‌ అని ఒపీనియన్‌. అలాగని నాకెలాంటి లవ్‌ ఎఫైర్స్‌ లేవు. ఎవరి లవ్‌ని బ్రేకప్‌ చేయలేదు. 
 
ప్రేమకథాచిత్రమ్‌ సీన్స్‌ చూపించడానికి కారణం? 
అది దర్శకుడి టెక్నిక్‌. ప్రేమకథాచిత్రమ్‌లో కొన్ని సన్నివేశాలు ఇందులో చూపించారు. ఆ సీన్స్‌ చేస్తునంత సేపు ఆ సినిమానే గుర్తొచ్చింది. మారుతి ముందుగానే ఈ సీన్స్‌ ప్లాన్‌ చేశారు. భయపడటం కన్నా భయపెట్టడమే బావుంది. 
 
ఇతర భాషల్లో చేస్తారా? 
మలయాళంలో లండన్‌ బ్రిడ్జ్‌ సినిమా చేశాను. తెలుగులో లవ్‌ ఇన్‌ లండన్‌గా విడుదలవుతుంది. అక్కడి సినిమా వాతావరణానికి, ఇక్కడికి చాలా తేడాలున్నాయి. ఎన్ని భాషల్లో యాక్ట్‌ చేసినా టాలీవుడ్‌కే మొదటి ప్రాధాన్యతనిస్తాను. 
 
లిప్‌లాక్‌లు పెట్టాల్సివస్తే? 
క్షణక్షణంలో శ్రీదేవి, ప్రస్తుతం అనుష్క చేస్తున్న పాత్రలు చెయ్యాలనుంది. అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. ప్రస్తుతం నా వయసుకి సూటయ్యే పాత్రలే వస్తున్నాయి. ఆర్మీ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి నాకంటూ కొన్ని పరిమితున్నాయి. వాటిని దాటకుండా ఉండటానికి జాగ్రత్తపడతాను. లిప్‌లాక్‌లు, స్కిన్‌ షోలకు దూరంగా ఉంటాను. 
 
కొత్త చిత్రాలు? 
చార్మినార్‌కి రీమేక్‌గా తెరకెక్కుతున్న 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరి'ని చిత్రంలో కథానాయికగా చక్కని పాత్ర చేస్తున్నాను. అలాగే 'లవ్‌ ఇన్‌ లండన్‌' సినిమా రిలీజ్‌కి రెడీగా ఉంది అని చెప్పింది.