శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: గురువారం, 28 ఏప్రియల్ 2016 (21:38 IST)

వెయిట్‌ తగ్గే పనిలోనే ఉన్నా: 'రాజా చెయ్యి వేస్తే' నారా రోహిత్‌ ఇంటర్వ్యూ

'బాణం' సినిమాలో హీరో లక్షణాలున్న నారా రోహిత్‌ రీసెంట్‌గా తుంటరి, సావిత్రి సినిమాల్లో బాగా వళ్లు చేశాడు. దీంతో హీరోగా కేర్‌ తీసుకోవడంలేదనే విమర్శలు వచ్చాయి. అందుకే బాడీపై శ్రద్ధ పెడుతున్నాడు నారా రోహిత్‌. అందుకే ఇప్పటికి 5 కేజీలు తగ్గాననీ.. ఇంకా తగ్గు

'బాణం' సినిమాలో హీరో లక్షణాలున్న నారా రోహిత్‌ రీసెంట్‌గా తుంటరి, సావిత్రి సినిమాల్లో బాగా వళ్లు చేశాడు. దీంతో హీరోగా కేర్‌ తీసుకోవడంలేదనే విమర్శలు వచ్చాయి. అందుకే బాడీపై శ్రద్ధ పెడుతున్నాడు నారా రోహిత్‌. అందుకే ఇప్పటికి 5 కేజీలు తగ్గాననీ.. ఇంకా తగ్గుతానని చెప్పాడు. 'కథలో రాజకుమారి' అనే సినిమాలో నటిస్తున్నాడు. కూకట్‌పల్లిలో షూటింగ్‌ జరుగుతోంది. రేపు అనగా.. ఈ నెల 29న ఆయన నటించిన 'రాజా చెయ్యి వేస్తే' విడుదల. ఇషా తల్వార్‌ జంటగా నటించిన ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వంలో వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి ప్రొడక్షన్‌ వారాహి చలనచిత్రం బ్యానర్‌‌పై సాయిశివాని సమర్పణలో ఈ చిత్రం రూపొందింది. ఈ సందర్భంగా నారా రోహిత్‌ తన కెరీర్‌ గురించి తన సినిమా గురించి మాట్లాడారు.
 
రేపు రిలీజ్‌ కానున్న సినిమాపై ఎలాంటి అంచనాలున్నాయి?
బాగా ఆడాలని కోరుకుంటాం. అయితే పరీక్ష రాసి ఫలితం కోసం ఎదురుచూసిన ఫీలింగ్‌ కలగుతుంది. ఈ మాటే చాలామంది అంటుంటారు. నాకూ అలానే వుంది.
 
ముందు చిత్రాల్లో బాగా లావుగా కన్పించారే.. నటుడిగా ఇబ్బంది అనిపించలేదా?
ఈ విషయం మొదట పెద్దగా గ్రహించలేదు. ఎందుకంటే.. 'బాణం' తర్వాత వెయిట్‌ పెరగాలని ప్లాన్‌ చేయలేదు. అనుకోకుండా జరిగిపోయింది. ఇప్పుడు వెయిట్‌ తగ్గే పనిలో ఉన్నాను. అయితే నా సినిమాలు గ్యాప్‌ లేకుండా విడుదలవుతుండటంతో వెయిట్‌ తగ్గినట్టు కనిపించడం లేదు. కాస్తా వెయిట్‌ చేస్తే వెయిట్‌ తగ్గుతాను. ప్రస్తుతానికి ఐదు కిలోలు తగ్గాను.
 
సినిమాల స్పీడ్‌ పెంచారే?
ఇన్ని సినిమాలు చేయాలనేది పెట్టుకోలేదు. అలాగని టార్గెట్‌ ఏదీ లేదు. సంవత్సరానికి ఒక సినిమా చేస్తే హిట్‌ వస్తుందనే గ్యారంటీ లేదు కదా, కథ నచ్చితే దర్శకుడు, నిర్మాతలు కొత్తవారని ఆలోచించకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నాను. అంటే ప్రతి సినిమాను ఓ ప్రయోగంగా చేస్తున్నాను. 
 
'తుంటరి', 'సావిత్రి' ఎలాంటి ఫలితాల్ని ఇచ్చాయి?
'తుంటరి', 'సావిత్రి' రెండు సినిమాలు ఒకే నెలలో విడుదలయ్యాయి. ఐదు కోట్ల సినిమా చేసి పదిహేను కోట్లు రావాలనుకోను. మన పెట్టుబడికి తగినంత వస్తే చాలనుకుంటాను. ఆ విషయంలో 'తుంటరి' నిర్మాతలు చాలా సంతోషంగా వున్నారు. కానీ  'సావిత్రి' అనుకున్న మేర సక్సెస్‌ సాధించలేదు. ఆ విషయంలో కాస్త నిరుత్సాహపడ్డాను. అయితే ఆ సినిమాలో ఎక్కడ మిస్‌ ఫైర్‌ అయిందో తెలియలేదు. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాను. కథను నమ్మి చేశాను. 
 
'రాజా చెయ్యి వేస్తే' ఎలాంటి కథ?
చిత్ర కథను సింగిల్‌ లైన్‌లో చెప్పాలంటే రెగ్యులర్‌ కథే కదా అనిపిస్తుంది. అయితే చాలా మంచి స్క్రీన్‌ ప్లే. దర్శకుడు కథ చెప్పే స్టయిల్‌ నన్ను పట్టేసింది. తన నెరేషన్‌ నచ్చింది. నేను సినిమా చేయడానికి ఒప్పుకున్నాను.
 
ఇందులో ఎలాంటి పాత్ర చేశారు?
రాజారాం నా పాత్ర పేరు. డైరెక్టర్‌ కావాలనుకుని అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అయ్యే పాత్ర. నా క్యారెక్టర్‌ను చాలా థ్రిల్లింగ్‌గా డిజైన్‌ చేశారు. ప్రదీప్‌ చిలుకూరి కొత్త దర్శకుడైనా టెక్నికల్‌గా తను స్ట్రాంగ్‌గా ఉన్నాడు. తనకు ఏం కావాలో ఆ విషయంపై క్లారిటీతో ఉన్నాడు. తనకు కావాల్సిన అవుట్‌‌పుట్‌ వచ్చేవరకు వదిలిపెట్టడు. టైటిల్‌ పెట్టడానికి కారణం ఈ సినిమాలో నా క్యారెక్టర్‌ పేరు రాజారాం. ఓ పాపులర్‌ సాంగ్‌ ఉండటంతో క్యాచీగా ఉంటుందనే కారణంతోనే 'రాజా చెయ్యివేస్తే' అనే టైటిల్‌ పెట్టాం. 
 
తారకరత్న సినిమాకు హెల్ప్‌ అవుతాడా?
అసలు నాకంటే ముందుగా సినిమాలో నటించడానికి సైన్‌ చేసింది తనే. ఆ తర్వాత నేను చేశా. తారకరత్న విలన్‌గా హైప్‌ వచ్చింది. సినిమాకు ముందు మా మధ్య పరిచయం ఉండేది కానీ ఈ సినిమాతో మంచి రిలేషన్‌ ఏర్పడింది. తను కొత్తగా కన్పిస్తాడు.
 
ఫెయిల్యూర్స్‌ ఎలా స్వీకరిస్తారు?
వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాను. ఫెయిల్‌ అయింది అనే ఆలోచించి బాధపడే కంటే.. తర్వాత సినిమాను జాగ్రత్తగా చేసుకుంటూ పోతుంటాను. ఇందులో ఎక్కడ లోపాలున్నాయనేది గత సినిమా నుంచి తీసుకుంటున్నాను.
 
కొత్త చిత్రాలు?
ప్రస్తుతం 'జో అచ్యుతానంద' సినిమా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇది ఇద్దరి అన్నదమ్ములకు సంబంధించిన కథ. అలాగే 'కథలో రాజకుమారి' సినిమా ఒక షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. సెకండ్‌ షెడ్యూల్‌ స్టార్ట్‌ కావాల్సి ఉంది. ఈ చిత్రానికి ఇళయరాజాగారు సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడి మూడు పాటలు చిత్రీకరణ కూడా పూర్తయ్యింది. 'అప్పట్లో ఒకడుండేవాడు' సినిమా షూటింగ్‌ చేయబోతున్నాం. 'పండగలా వచ్చాడు' సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను జరుపుకుంటుంది. జూన్‌లో సినిమాను రిలీజ్‌ చేయాలనుకుంటున్నాం అని చెప్పారు.