మంగళవారం, 19 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: మంగళవారం, 3 జనవరి 2017 (16:59 IST)

పవన్‌ కళ్యాణ్‌ ఏమీ చిన్నపిల్లాడు కాదు.. వస్తే వస్తాడు లేదంటే లేదు: రామ్‌ చరణ్‌ సంచలన వ్యాఖ్య(ఇంటర్వ్యూ)

చిరంజీవి సినిమా ఫంక్షన్‌ అంటే ఎంతమంది అతిథులు వచ్చినా పవన్‌ కళ్యాణ్‌ వస్తాడా?రాడా? అనేది ఫ్యాన్స్‌లోనూ బయట జనాల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతుంటుంది. ఈ విషయమై రామ్‌ చరణ్‌ ఫేస్‌బుక్‌ ఇంటర్వ్యూలో మంగళవారంనాడు వివరిస్తూ వాటిని మీడియాకు పంపించారు. పవన్‌ ఏమీ

చిరంజీవి సినిమా ఫంక్షన్‌ అంటే ఎంతమంది అతిథులు వచ్చినా పవన్‌ కళ్యాణ్‌ వస్తాడా?రాడా? అనేది ఫ్యాన్స్‌లోనూ బయట జనాల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతుంటుంది. ఈ విషయమై రామ్‌ చరణ్‌ ఫేస్‌బుక్‌ ఇంటర్వ్యూలో మంగళవారంనాడు వివరిస్తూ వాటిని మీడియాకు పంపించారు. పవన్‌ ఏమీ చిన్నపిల్లాడు కాదని కూడా చరణ్‌ వ్యాఖ్యానించారు. అదేమిటో చూద్దాం.
 
ఈ నెల 4న ప్రి-రిలీజ్‌ విజయవాడలో అన్నారు. ఏమయింది?
ఖైదీ నెం.150వ సినిమా ప్రి-రిలీజ్‌ పంక్షన్‌ ఈ నెల 4వ తేదీ అనుకున్నాం. కానీ అక్కడ పర్మిషన్‌ ఇవ్వలేదు. అంతకుముందు కూడా ఇలానే జరిగింది. అందుకే ఈ నెల 7న గుంటూరులో చేయాలనుకుంటున్నాం.
 
ఖైదీ నెం.150 సినిమా రిలీజ్‌ ఎప్పుడు?
ఖైదీ నెం.150 రిలీజ్‌ డేట్‌.. నాన్నగారి పర్మిషన్‌. వినాయక్‌గారి పర్మిషన్ తీసుకుని ఈ నెల 11న విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. మా పంపిణీదారులు కూడా హ్యాపీగా వున్నాం. 
 
ముందుకు రావడానికి కారణం?
బాలయ్యగారి సినిమా 12న ప్రకటించారు. రెండు అగ్రహీరోల సినిమాలు ఒకేరోజు మంచి పరిణామం కాదని నాన్నగారి చెప్పడంతో.. ముందుకు వస్తున్నాం.
 
ప్రి-రిలీజ్‌ గుంటూరులోనే ఎందుకు చేస్తున్నారు?
ఈ నెల 4న ప్రి-రిలీజ్‌ పర్మిషన్‌.. అది 7కు మారింది. గుంటూరు విజయవాడ హైవేలో ఐలాండ్‌ గ్రౌండ్‌లోకి మారింది. మీ అన్నయ్య ఫ్యాన్స్‌కు ఇండస్ట్రీ వారికి 7కు రావాల్సిందిగా కోరుతున్నాం.
 
ధృవ లాంటి సినిమాలు చేస్తారా?
ధృవ లాంటి సినిమాలు తప్పకుండా చేస్తాను..
 
చిరంజీవిగారు ఎక్కడా మాట్లాడలేదు?
ఈ ప్రి-రిలీజ్‌ అయ్యాక.. నాన్నగారు మాట్లాడతారు. ప్రతి మీడియాతో ఇంట్రాక్ట్‌ అవుతారని చెబుతున్నాను.
 
ట్రైలర్ ఎప్పుడు?
ఈ నెల 7న ట్రైలర్‌ విడుదల చేస్తున్నాం. ఇందాక నేను చూశాను. చాలా బాగా వచ్చింది.
 
బాలీవుడ్‌లో మీరు ఏమైనా చేస్తున్నారా?
ప్రస్తుతానికి 3 తెలుగు సినిమాలు సైన్‌ చేశాను. తర్వాత ఆలోచిస్తాను.
 
మీరు బాడీ పెంచారు. చాలా బాగున్నారు?
ధృవ సినిమా తర్వాత సుకుమార్‌ సినిమాకు లూజ్‌ వెయిట్‌ అయ్యాను.
 
మల్టీస్టారర్‌ మహేష్ బాబుతో చేస్తారా?
మంచి కథ వుంటే తప్పకుండా చేస్తాను. ఎవరితోనైనా సరే.. 
 
ప్రి-రిలీజ్‌కు గెస్ట్‌లు ఎవరెరు?
నాన్నగారి ఫంక్షన్‌కు చాలామంది రాబోతున్నారు. దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు ముఖ్య అతిథులు.
 
పోస్టర్‌లు అదిరిపోయాయ్‌?
అవును. పోస్టర్‌ దగ్గరుండి చూసుకున్నాం. చాలా యంగ్‌గా కన్పిస్తున్నారు.
 
మీరు, చిరంజీవితో సినిమా చూడాలనుంది?
నా లైఫ్‌ గోల్‌ కూడా నాన్నగారితో కన్పించాలని... ఖైదీలో. 30 సెకండ్ల రోల్‌ చేశాను. మంచి కథ దొరికితే తప్పకుండా చేస్తా.
 
పవర్‌ స్టార్‌ వస్తున్నారా?
నేను ఈరోజే కలవడానికి వెళుతున్నాను, ఆయన చిన్నపిల్లాడు కాదు. ఆహ్వానం ఇస్తాను. రావచ్చా? లేదా.. అనేది ఆయన ఇష్టం.
 
బాలయ్య, చిరంజీవి క్లాష్‌ వస్తుందా?
సంక్రాంతి ఫెస్టివల్‌ అనేది చాలా సినిమాలు వస్తాయి. ఇంతకుముందు నాది, మహేష్‌ది (సీతమ్మవాకిట్లో..) వచ్చింది. రెండూ బాగా ఆడాయి. అందరి విషెస్‌ వున్నాయి. 
 
ఆడియో బాగుంది. రిలీజ్‌ చేస్తే బాగుండేది?
కొత్తగా వుండాలని.. ప్రి-రిలీజ్‌ చేస్తున్నాం. ఆడియో చేయలేకపోయాం. దేవీశ్రీప్రసాద్‌ సంగీతం ప్రత్యేకం. రేపు అంటే బుధవారం.. స్టోరీని తెలియజెసే సాంగ్‌ను విడుదల చేయనున్నాం. 
 
తర్వాత మూవీ పీకెనే కదా?
నాన్నగారితో 151వ సినిమా కూడా మా కొణిదల ప్రొడక్షన్‌లో వుంటుంది. ఈ సినిమా విడుదలయ్యాక పూర్తి వివరాలు తెలియజేస్తామనని ప్రకటించారు.