శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: ఆదివారం, 15 మే 2016 (20:27 IST)

ప్రతి ఒక్కరినీ వెంటాడే "బ్రహ్మోత్సవం'' ఇది: 'ప్రిన్స్' మహేష్‌ బాబు ఇంటర్వ్యూ

ప్రతి కుటుంబంలోని తరాలుంటాయి. వెనుకటి తరం.. వారినుంచి మనం ఎలా వచ్చాం.. అనేది ఒక్కసారి తలచుకుని.. వారంతా కలిసి వుంటే ఎలా వుంటుందో ఊహించుకుంటే.. చాలా థ్రిల్‌గా వుంటుంది. వాటి విలువలు.. అందరూ కలిసి ఒక్కచోట వుంటే ఎలా వుంటుందో.. అదే బ్రహ్మోత్సవం అని మహేష్

ప్రతి కుటుంబంలోని తరాలుంటాయి. వెనుకటి తరం.. వారినుంచి మనం ఎలా వచ్చాం.. అనేది ఒక్కసారి తలచుకుని.. వారంతా కలిసి వుంటే ఎలా వుంటుందో ఊహించుకుంటే.. చాలా థ్రిల్‌గా వుంటుంది. వాటి విలువలు.. అందరూ కలిసి ఒక్కచోట వుంటే ఎలా వుంటుందో.. అదే బ్రహ్మోత్సవం అని మహేష్‌ బాబు అంటున్నాడు. పి.వి.పి. సినిమా పతాకంపై శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి నిర్మిస్తున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని ఈ నెల 20న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా శనివారంనాడు ఆయనతో ఇంటర్వ్యూ... 
 
అనుకున్న సమయానికి సినిమా రిలీజ్‌ చేస్తున్నారే? 
ముందుగా దర్శకుడు ప్లాన్‌ ప్రకారం చేశారు. ఎక్కడా అడ్డు రాకుండా షూటింగ్‌ సాగింది. ఈ సినిమా అనుకున్న సమయానికి రావడానికి అందరూ నెల రోజులు 24 గంటలు పనిచేశారు. 
 
మీ పాత్ర ఏమిటి? 
నా పాత్ర ఎలా వుంటుందో ట్రైలర్స్‌లో దర్శకుడు చెప్పేశారు. 'సీతమ్మ వాకిట్లో..' కంటే ఇందులో పాత్ర భిన్నంగా వుంటుంది. 
 
'అర్జున్‌' సోదరి కోసం వెతుక్కుంటూ కథ సాగుతుంది. మరి ఇందులో ఎవరి కోసం? 
ఇది కొత్త క్యారెక్టర్‌. శ్రీకాంత్‌ అడ్డాల శైలిలో వుంటుంది. కుటుంబ విలువల కోసం పడే తపన ఇందులో కన్పిస్తుంది. మోడరన్‌ డేస్‌లో కెరీర్‌ ముఖ్యమని వారి గోల్స్‌ను మాత్రమే గుర్తుపెట్టుకుంటూ.. కుటుంబ విలువల్ని మర్చిపోతున్నారు. ఆ విలువల్ని గుర్తు చేసే విధంగా ఈ సినిమా ఉంటుంది. 
 
'శ్రీమంతుడు'లో గ్రామాన్ని దత్తతతో సందేశాన్ని ఇచ్చారు. మరి ఇందులో ఏమి ఇవ్వబోతున్నారు? 
ఇందులో మానవ విలువలు. కుటుంబంలోని ఆప్యాయతలు అనురాగాలతో పాటు మనకు తెలీని చిన్నచిన్న మూమెంట్స్‌ కూడా ఎంతో హాయిని ఇస్తాయి. అవన్నీ కోల్పోతున్నాం. అవి ఎలా వుంటే బాగుంటుందో ఈ సినిమాలో చెబుతున్నాం. 
 
మీ నుంచి లవ్‌ స్టొరీ ఆశించవచ్చా? 
ఈ సినిమాలో లవ్‌ స్టొరీ ఉంటుంది. కుటుంబం మధ్య జరిగే కథే ఇది. ఫ్యామిలీ ఎమోషన్స్‌, సెంటిమెంట్స్‌ కలగలిపిన చిత్రం. ఈ సినిమాలో ఎమోషన్స్‌ ప్యూర్‌గా రియలిస్టిక్‌గా ఉంటాయి.
 
సీతమ్మ వాకిట్లోకి.. దీనికి తేడా ఏమిటి? 
శ్రీకాంత్‌తో ఇదివరకు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా చేశాను. ఆ సినిమాకు బ్రహ్మోత్సవానికి ఎలాంటి పోలికలు ఉండవు. ఇదొక కొత్త కాన్సెప్ట్‌. ఇప్పటివరకు ఇలాంటి సినిమా చేయలేదు. ఫ్రెష్‌ ఫిలిం. 
 
షూటింగ్‌ ఎక్కువగా బయట ప్రాంతాల్లో చేయడం ఎలా అనిపించింది? 
ఈ సినిమా కోసం చాలా అవుట్‌‌డోర్‌ షూటింగ్స్‌ చేశాం. ఇప్పటివరకు నేనేసినిమాకు ఇన్ని ఊర్లు తిరగలేదు. హరిద్వార్‌, ఉదయ్‌ పూర్‌ ఇలా చాలా ప్రాంతాలకు వెళ్లాం. బ్రహ్మోత్సవాలు జరిగే ఒక ప్రాంతాన్ని తీసుకొని సినిమాను చిత్రీకరించాం. 
 
నిర్మాణ వాల్యూస్‌ ఎలా వున్నాయి? 
ఈ సినిమా కోసం పివిపి గారు ఎంతో ఖర్చుపెట్టారు. అడిగింది కాదనకుండా.. ఇచ్చారు. కథను నమ్మి ఈ సినిమాను నిర్మించారు. 
 
శ్రీకాంత్‌తో రెండో సినిమా చేయడం ఎలా భావిస్తున్నారు? 
'శ్రీమంతుడు' లాంటి ఇన్స్పిరేషనల్‌ సినిమా తరువాత 'బ్రహ్మోత్సవం' లాంటి ఫ్యామిలీ సినిమా చేయడం నా అదృష్టం. ఒకే తరహా చిత్రాలు కాకుండా డిఫరెంట్‌ ఫిల్మ్స్‌ చేయాలి. శ్రీకాంత్‌ గారు 'శ్రీమంతుడు' సినిమా సమయంలో నాకు బ్రహ్మోత్సవం స్టొరీ చెప్పారు. అప్పుడే సినిమా చేయడానికి ఒకే చెప్పాను. 
 
బ్రహ్మోత్సవం పేరు తిరుపతి నేపథ్యమని పెట్టారా? 
అలా అని కాదు. ప్రతి ఊరిలోనూ పండుగలా బ్రహోత్సవాలు జరుగుతుంటాయి. అవి కుటుంబంలో వుంటే ఎలా వుంటుందనేది కథకు సరిపడా టైటిల్‌. 
 
ట్రైలర్‌లో బైక్‌ కొత్తగా వుంది.. దీనివెనుక ఏదైనా కథ వుందా? 
పెద్ద కథేమీలేదు. రాజస్థాన్‌లో షూటింగ్‌ చేస్తున్నప్పుడు అక్కడ టూరిజంలో ఇటువంటి బైక్‌ చూశాం. కొత్తగా వుంది.. కథక్కూడా సరిపోతుందని దర్శకుడు చెప్పారు. సినిమాలోనూ చాలా థ్రిల్‌ కల్గించే బైక్‌ ఇది. 
 
మీ తదుపరి చిత్రం ఎవరితో? 
నేను వెంటనే మురుగదాస్‌ గారితో చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం. రెండు భాషల్లో ఆ సినిమా విడుదలవుతుంది అని చెప్పారు.