బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By dv
Last Updated : బుధవారం, 28 సెప్టెంబరు 2016 (20:14 IST)

బాలీవుడ్ హీరోలు పొట్టిగా ఉంటారు.. పెద్దపెద్ద విలన్స్‌ను చితక్కొడుతారు.. నేనూ అంతే: రామ్ ఇంటర్వ్యూ

చూడ్డానికి పిల్లాడిలా ఉంటాడు.. కానీ.. భారీకాయుల్ని సైతం యాక్షన్‌తో రఫ్పాడిస్తాడు.. కొడితే ఎగిరెగిరి.. పల్టీలు కొడుతూ దూరంగా పడుతుంటారు.. ఇది రామ్‌ విషయంలో ఎలా సాధ్యం.. తను చేసిన 'హైపర్‌' సినిమాలో.. రా

చూడ్డానికి పిల్లాడిలా ఉంటాడు.. కానీ.. భారీకాయుల్ని సైతం యాక్షన్‌తో రఫ్పాడిస్తాడు.. కొడితే ఎగిరెగిరి.. పల్టీలు కొడుతూ దూరంగా పడుతుంటారు.. ఇది రామ్‌ విషయంలో ఎలా సాధ్యం.. తను చేసిన 'హైపర్‌' సినిమాలో.. రావు రమేష్‌ విలన్‌. "25 ఏళ్ళ రాజకీయానుభవంత లేదు వాడి వయస్సు.. 25 ఏళ్ళ పిల్లాడు.. నన్ను ఎదురిస్తున్నాడంటూ".. ఓ డైలాగ్‌ వుంది... ఇలాంటివి చేస్తున్నప్పుడు.. మీకెలా ఉందంటే... బాలీవుడ్‌, హాలీవుడ్‌లోనూ.. హీరోలు పొట్టిగానే వుంటారు.. కానీ పెద్దపెద్ద విలన్స్‌ను కొడుతుంటారు.. ఇదీ అంతే.. అంటూ తెలివిగా సమాధానం చెప్పాడు.. దేవదాసు చిత్రం నుంచి.. నేటి హైపవర్‌ వరకు.. స్పీడ్‌గా ఉండే రామ్‌కు.. ఇందులో హైపర్‌ ఎంతో ఉందని చూపిస్తున్నాడు. ఈనెల 30నే ప్రేక్షకుల తీర్పు కోసం వస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయనతో 'వెబ్‌దునియా' జరిపిన ప్రత్యేక ఇంటర్య్వూ. 
 
* చాలా యాక్టివ్‌గా ఉండే మీరు 'నేను శైలజ'లో చాలా సాఫ్ట్‌గా కన్పించారే? 
అబ్బో! ఆ సినిమా చేస్తుండగానే.. నేను నటించినట్లులేదు. ఆయన టేక్‌ అన్నప్పుడు కెమెరాముందుకు వచ్చేవాడిని.. వెంటనే.. కట్‌ చెప్పేవారు.. ఏమిటిసార్‌! నటించినట్లులేదని అడిగాను.. మీరు ఈ సినిమాకు ఇలా చేస్తేచాలు.. చివరి 20 నిమిషాలు మీరు రెచ్చిపోవాలి అన్నారు. ఎంతో ఎనర్జిటిక్ ఉండే నాకు ఆ సినిమా ఏమిటో అనిపించింది. 
 
* 'కందిరీగ' సీక్వెల్‌ అన్నారు.. అది ఇదేనా? 
కాదు. కందిరీగ తర్వాత దర్శకుడు సంతోష్‌ శ్రీన్‌వాస్‌తో సీక్వెల్‌ అనుకున్నాం. కానీ కుదరలేదు. ఆ కథను.. రభస పేరుతో చేసేశారు. హైపర్‌ వేరే కథ. 
 
* కమర్షియల్‌ సినిమా అంటే బోర్‌ అనిపించడం లేదా? 
ఎందుకు చిన్న చూపు చూస్తారో నాకర్థం కాదు. ఎక్కువ మంది ప్రేక్షకులు వీటినే ఇష్టపడతారు. ఇలాంటివి చేయడం మాకూ ఇంట్రెస్ట్‌. అయితే అప్పుడప్పుడు కొన్ని సాఫ్ట్‌ చిత్రాలు చేస్తున్నా. గత చిత్రం నేను శైలజ పూర్తిగా లవ్‌స్టోరీ, హైపర్‌ అందుకు భిన్నమైన సినిమా. 
 
* మరి ఆ సినిమాకు ముందు సరైన హిట్‌ రాని సమయంలో ఎలా ఫీలయ్యేవారు? 
నేను శైలజకు ముందు అలా జరిగింది, వాస్తవమే! అయితే అప్పుడు కూడా యాక్టింగ్‌ పరంగా నాకు విమర్శలు రాలేదు. ఎందుకంటే ప్రేమంట, జగడం, మసాలా ఇలా నేను డిఫరెంట్‌గా ఏదైనా చేస్తే వర్కౌట్‌ అవ్వలేదు. దాంతో అన్నింటినీ బ్యాలెన్స్‌ చేస్తూ నేను శైలజతో మళ్ళీ హిట్‌ కొట్టా. ఇదంతా కాలంతో నేర్చుకోవడమే! 
 
* రభసతో భారీ ఫ్లాప్‌ ఇచ్చిన దర్శకుడుతో సినిమా అంటే రిస్క్‌ అనిపించలేదా? 
వాటిని నేనస్సలు పట్టించుకోను. సినిమా ఎలా ఉంటుందన్నది ఎక్కువగా స్క్రిప్ట్‌ మీదే ఆధారపడి ఉంటుంది. కిషోర్‌ తిరుమలతో నేను శైలజ చేసేప్పుడు కూడా చాలా మంది వద్దన్నారు. నేను స్క్రిప్ట్‌నే నమ్మాను కాబట్టి సక్సెస్‌ వచ్చింది అనుకుంటున్నా. 
 
* రాశిఖన్నానే మరోసారి ఎంపికచేయడంలో కారణం? 
రాశిఖన్నాది, నాది మంచి జోడీ. ఈ సినిమాలోనూ మా ఇద్దరి కెమిస్ట్రీ బాగా కుదిరింది. హైపర్‌లో రాశి పాత్రలోనూ మంచి ఫన్‌ ఉంటుంది. ఇందులో పాత్రకు అలానే కావాలి. అందుకే ఆమెను ఎంపిక చేశాం. 
 
* మీ హైపర్‌కూ, బ్యాక్‌గ్రౌండ్‌కు పెద్ద హీరో కావాలి. ఎప్పుడైనా అలా అనిపించిందా? 
స్టార్‌ స్టేటస్‌ కోసం లాబీలు చేయడం, రోల్స్‌ పనిగట్టుకొని అడగడం నాకు నచ్చదు. ఇప్పటివరకూ నాకంటూ ఒక దారి ఏర్పరచుకొని సినిమాలు చేస్తూ వచ్చా. ఏదో ఒకరోజు నా సినిమాలకు రావాల్సినంత గుర్తింపు వస్తుందన్న నమ్మకం ఉంది. 
 
* పరాజయాలే పాఠాలు నేర్పాయా? 
అదే అనొచ్చు. నా కెరీర్‌ మొదట్లోనే దేవదాస్‌, రెడీ లాంటి సూపర్‌ హిట్‌ సినిమాలు చేశా. అప్పట్లోనే మంచి ఫాలోయింగ్‌ వచ్చింది. ఇక అదేసమయంలో సినిమాలు ఫెయిలై కెరీర్‌ పక్కదారి పట్టింది కూడా. ఇప్పుడిప్పుడే నాకు ఎటువంటి సినిమాలు సెట్‌ అవుతాయో తెలుసుకొని ఆ రకంగానే ముందుకు వెళుతున్నా. 
 
* వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా ఎవరితో పంచుకోరు ఎందుకని? 
నాకెందుకో వ్యక్తిగత జీవితాన్ని ప్రపంచానికి చెప్పుకోవాలని అనిపించదు. అందుకే సమయం చిక్కినప్పుడల్లా నాతో నేను గడపడానికి ప్రపంచం చుట్టేసి వస్తూంటా. 
 
* సహచర హీరోలతో కాంపిటీషన్‌ను గమనిస్తుంటారా? 
ఖచ్చితంగా! ఎవరెవరు ఎలాంటి సినిమాలు చేస్తున్నారు వంటివి ఎప్పుడూ చూస్తూనే ఉంటా. వారి సినిమాల నుంచి మనమేం నేర్చుకోవచ్చన్నది కూడా ఆలోచిస్తూంటా. 
 
* పెళ్ళెప్పుడు చేసుకుంటున్నారు? 
ఇప్పటికైతే పెళ్ళి ఆలోచన అస్సలు లేదు. ఆ రోజు వస్తే నేనే తెలియజేస్తా. 
 
* తండ్రి కథలు చాలానే ఉన్నాయి కదా? 
తండ్రి నేపథ్యంలో వచ్చే సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ ఇది కొత్తగా ఉంటుంది. మిర్చి, బాహుబలి, నేను శైలజ.. వంటి సినిమాల్లో సత్యరాజ్‌ క్యారెక్టర్‌ చాలా సీరియస్‌గా ఉంటుంది. ఈ సినిమాలో కామిక్‌గా ఉంటుంది. సాధారణంగా అందరికీ అమ్మ మీద ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమను వివిధ సందర్భాల్లో చూపిస్తూనే ఉంటాం. అయితే నాన్నపై ప్రేమ ఉంటుంది. కానీ అది సందర్భాన్నిబట్టే బయటకు వస్తుంది. కానీ ఈ సినిమాలో హీరోకు నాన్నంటే ప్రేమ కాదు పిచ్చ ఉంటుంది. హీరో తన ప్రేమను అన్నీ సందర్భాల్లో ప్రదర్శిస్తుంటాడు. అది సినిమాలో ఆడియెన్స్‌కు కామెడీని పంచుతుంది. 
 
* నిజ జీవితంలో తండ్రితో సినిమాల్లో చూపించినట్లే ఉంటారా? 
నేను మా నాన్నతో మీరందరూ ఎలా ఉంటారో నేను అలాగే ఉంటాను. అయితే నాన్నకు భయపడను. భయం అనే కాన్సెప్ట్‌ లేకుండా ఇంట్లో నన్ను పెంచారు. 
 
* రాశీఖన్నాను తీసుకోవడానికి... 
'హైపర్‌' లవ్‌స్టోరీ కాదు. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో పాటు సందేశం వున్నా... ప్రేమ అనే అంశం కూడా ఇందులో ఉంటుంది. ఇపుడున్న హీరోయిన్స్‌లో రాశిఖన్నాకు కామెడీ టచ్‌ ఎక్కువగా ఉంది. 'సుప్రీమ్‌' సినిమాలో కూడా అది ప్రూవ్‌ అయ్యింది. దాంతో రాశిఖన్నాను హీరోయిన్‌గా తీసుకున్నాం. ఈ సినిమాతో తను డ్యూయెల్‌ టచ్‌ ఉన్న క్యారెక్టర్‌లో కనపడుతుంది. 
 
* భారీ కాయులతో ఫైట్స్‌ చేస్తుంటే.. మీకు ఎలా అనిపిస్తుంది? 
నేనేకాదు.. హాలీవుడ్‌లో జాకీచాన్‌ కూడా చేస్తుంటాడు. బాలీవుడ్‌ అమీర్‌ఖాన్‌లాంటివారు ఫైట్స్‌ చేస్తుంటారు. వారే చేయగలేనిది.. నేను చేయడంలో తప్పేమిలేదు. ఆడియన్స్‌ కూడా కథ ప్రకారం.. కనెక్ట్‌ అవుతారు. 
 
* తదుపరి చిత్రాలు? 
కిషోర్‌ తిరుమల వెంకటేష్‌తో సినిమా తర్వాత నాతో సినిమా చేసే అవకాశం ఉంది. ఇంకా కరుణాకరన్‌తో చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే వివరాలు తెలియజేస్తాను.