గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: బుధవారం, 25 మార్చి 2015 (19:24 IST)

లిప్‌లాక్‌ ఓ పెగ్‌ లాంటింది : రాశీఖన్నా

సినిమాల్లో హీరోయిన్లు హీరోలతో లిప్‌లాక్‌ చేస్తే అది ఒకప్పుడు హాట్‌ టాపిక్‌. కానీ ఇప్పటి ట్రెండ్‌ హీరోయిన్లకు అది కాజువల్‌. ఈ విషయంలో నటి రాశీఖన్నాకు ఒక పెగ్‌ వేసుకున్నంత.. నిజమేనండి. ఈ విషయాన్ని ఆమె చెప్పింది. మోడ్రన్‌ సొసైటీ కల్చర్‌ వంట పట్టిన ఆమె తొలిసారిగా బాలీవుడ్‌ నుంచి సినిమా రంగంలోకి ప్రవేశించింది. మద్రాస్‌ కేఫ్‌ అనే చిత్రంతో వెలుగులోకి వచ్చింది. తెలుగు 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమై ఆ తర్వాత 'జోరు' చిత్రంలో నటించింది. కానీ అది పెద్దగా ఫలితం లేదు. మూడోసారి గోపీచంద్‌తో 'జిల్‌'తో నటించింది. ఈ చిత్రం ఈనెల 27న విడుదలవుతుంది. మిర్చి నిర్మాతలు నిర్మించిన ఈ చిత్రం గురించి రాశీఖన్నా చెప్పిన సంగతులు మీకోసం.. 
 
మీరు 'జిల్‌' అనిపిస్తారా? 
సినిమా మొత్తం జిల్‌ అనిపించేతగా వుంటుంది. నా క్యారెక్టర్‌ పేరు సావిత్రి. బబ్లీగా వుంటూ ఎంతో ఎనర్జిటిక్‌గా వుండే క్యారెక్టర్‌. సావిత్రికి, నాకు చాలా డిఫరెన్స్‌ వుంది. నేను మాత్రం సావిత్రిలా బబ్లీగా వుండలేను. మొదట ఈ క్యారెక్టర్‌ చెయ్యడానికి నేను చాలా భయపడ్డాను. తనకి నా నుంచి ఎలాంటి పెర్‌ఫార్మెన్స్‌ కావాలో రాధాకృష్ణగారికి క్లియర్‌గా తెలుసు. హీరోయిన్స్‌ గ్లామర్‌కి మాత్రమే పరిమితమవుతారు. కానీ, ఈ సినిమా గ్లామర్‌ విషయం మర్చిపోతారు. సావిత్రి క్యారెక్టర్‌ని బాగా ఇష్టపడతారు. నా క్యారెక్టర్‌ని చాలా బాగా డిజైన్‌ చేశారు. ఇది యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. దర్శకుడు రాధాకృష్ణ బాగా డీల్‌ చేశారు. 
 
గోపీచంద్‌తో లిప్‌లాక్‌ సీన్స్‌ బయటకు వచ్చాయి? 
లిప్‌లాక్స్‌ ఇందులో లేవు. అది లిప్‌లాక్‌ కాదు. ఓ పెగ్‌ లాంటింది. దర్శకుడు కథ చెప్పినప్పుడే పాజిటివ్‌గా ఆలోచించాను. ఆడియన్స్‌ తప్పకుండా అలా చూడాలని మాత్రం అనుకోలేదు. ప్రేమను వ్యక్తం చేయడంలో సీన్‌ బాగా రావాలనే అలా చేసింది. 
 
మీ దృష్టిలో లిప్‌లాక్‌ గురించి..? 
నా విషయానికి వస్తే లిప్‌‌లాక్‌ అనేది ఆ సిట్యుయేషన్‌కి అవసరం అంటే తప్పకుండా చేస్తాను. అలా చేయడం తప్పేమీకాదు. ఈ సినిమా చూస్తే సీన్‌ అవసరాన్ని బట్టి వుందో లేదో మీరే చెబుతారు.
 
గోపీచంద్‌తో నటించడం ఎలా అనిపించింది? 
మొదట్లో కొంత నెర్వస్‌ ఫీల్‌ అయ్యాను. సెట్‌లో నేను చాలా కంఫర్టబుల్‌గా వుండటానికి చాలా హెల్ప్‌ చేశారు. అందుకే మా మధ్య సినిమాలో కెమెస్ట్రీ బాగా వర్కవుట్‌ అయింది. నన్ను ఎంతగానో ఎంకరేజ్‌ చేశారు. డాన్స్‌ విషయంలో కొన్ని స్టెప్స్‌ నాకు కష్టమనిపించినపుడు ఎలా చెయ్యాలి అనే టెక్నిక్‌ నాకు నేర్పించారు. ఏ హీరో అయినా అలా చెప్తారని అనుకోను. 
 
జిల్‌ను అంగీకరించడానికి కారణం? 
మెయిన్‌ రీజన్‌ స్క్రిప్ట్‌. స్క్రిప్ట్‌ నాకు బాగా నచ్చింది. స్టోరీ బ్రిలియంట్‌గా వుంది, నా క్యారెక్టర్‌ కూడా బ్రిలియంట్‌గా వుంది. అందుకే నేను రెండో క్వశ్చన్‌ లేకుండా ఈ సినిమా ఓకే చేశాను. నన్ను పాటల్లో అంత గ్లామరస్‌గా చూపిస్తారని నాకు మొదట తెలీదు. నా వరకు కథ, నా క్యారెక్టర్‌ బాగున్నాయి. అందుకే ఎంతో ఇష్టపడి ఈ సినిమా చేశాను. 
 
డబ్బింగ్‌ చెప్పారా? 
నేను డబ్బింగ్‌ చెప్పాలి అనుకున్నాను. కానీ, కొన్ని తెలుగు పదాలు పలుకడంలో నాకు కొంత ప్రాబ్లమ్‌ వుంది. మామూలుగా మాట్లాడగలను. డబ్బింగ్‌ విషయంలో ప్రొనౌన్సేషన్‌ సరిగ్గా లేకపోతే బాగుండదు కాబట్టి నేను చెప్పలేకపోయాను. 
 
అఖిల్‌ సినిమాలో ఐటంసాంగ్‌ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి? 
అదంతా అబద్ధం. ఎందుకంటే ఈ విషయంలో నన్ను ఎవరూ అప్రోచ్‌ అవ్వలేదు. అది ఒక రూమర్‌ మాత్రమే. క్లియర్‌గా చెప్పాలంటే నాకు ఐటమ్‌ సాంగ్స్‌ చెయ్యడం ఇష్టంలేదు. ప్రస్తుతానికి కేమియోస్‌ వరకు చెయ్యగలను. ఫ్యూచర్‌లో ఐటమ్‌ సాంగ్స్‌ చేస్తానేమో చెప్పలేను గానీ ప్రస్తుతానికి మాత్రం ఆ ఆలోచన లేదు.
 
మీతో చేసిన మీకు నచ్చిన హీరో? 
నాగశౌర్యతో నేను కంఫర్టబుల్‌గా ఫీల్‌ అయ్యాను. ఎందుకంటే మాది సేమ్‌ ఏజ్‌ గ్రూప్‌ కావడం వల్ల కావచ్చు. ఒకేసారి కెరీర్‌ స్టార్ట్‌ చెయ్యడం కావచ్చు. 
 
తదుపరి చిత్రాలు? 
ప్రస్తుతం టైగర్‌లో నటిస్తున్నాను. రవితేజ పక్కన మంచి పాత్ర అది. మరి రెండు చిత్రాలు వున్నాయని చెప్పారు.