శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: మంగళవారం, 10 నవంబరు 2015 (20:18 IST)

హీరోయిన్లంటే గ్లామర్ కోసమే... నేను అలా చేసి చూపిస్తా... 'అఖిల్' సయేషా

టాలీవుడ్‌లో మూడో తరం నటుడు అఖిల్. అతనితో బాలీవుడ్‌లోని మూడోతరం నటి సయేషా. ఇద్దరూ కలిసి నటించిన చిత్రం 'అఖిల్‌'. దిలీప్‌ కుమార్‌, సైరాభాను మనవరాలైన సయేషా.. తెలుగులో నటించిన చిత్రమిది. ముందుగా బాలీవుడ్‌లో నటించినా తెలుగు సినిమానే ముందుగా విడుదల కావడం.. దీపావళి నాడు పండుగలా వుందని అంటోంది. ఈ సందర్భంగా సయేషాతో చిట్‌చాట్‌..
 
మొదటి సినిమా ఎలా అనిపించింది?
నిజానికి నా మొదటి సినిమా హిందీలో చేయాల్సింది కాని అది డిలే కావడంతో తెలుగులో చేసిన సినిమా మొదట రిలీజ్‌ అవుతుంది. తెలుగు ఇండస్ట్రీ చాలా గొప్పది. ఈ ఇండస్ట్రీ ద్వారా పరిచయమవ్వడం చాలా సంతోషంగా ఉంది.
 
నటిగా వారసత్వం తీసుకున్నారా?
మా అమ్మమ్మ, అమ్మ ఇద్దరూ నటీమణులే.. సహజంగా వారినుంచే వారసత్వం నాకూ వచ్చింది. అయినా ఈ రంగంలో ప్రవేశించాలంటే వారసత్వం ఒక్కటే కొలమానం కాదు. నటన కూడా వచ్చివుండాలి. డాన్స్‌ రావాలి.
 
మరి శిక్షణ ఎక్కడ తీసుకున్నారా?
ఎటువంటి యాక్టింగ్‌ ఇనిస్టిట్యూట్‌కు వెళ్ళలేదు. ఒకరు ఇంటికి వచ్చి నాకు యాక్టింగ్‌ గురించి డిస్కస్‌ చేసేవారు. నటనలో మెళకువలు నేర్పారు. వాటిని ప్రాక్టీస్‌ చేసేదాన్ని. చిన్నప్పుడు డాన్సుల్లో శిక్షణ తీసుకున్నా. కథక్‌, ఒడిసి ఇలా కొన్ని రకాల డాన్సులు వచ్చు. నాకు డాన్స్‌ చేయడమంటే చాలా ఇష్టం. డాన్స్‌కు ప్రాముఖ్యత ఇచ్చే పాత్రల్లో నటించాలనుంది. 'అఖిల్‌' సినిమాలో రెండు సాంగ్స్‌లో బాగా డాన్సు చేసే ఛాన్స్‌ దొరికింది.
 
ఈ సినిమా ఎలా ఉండబోతోంది..?
అన్ని అంశాలున్న ఫిలిం ఇది. రొమాన్స్‌, సాంగ్స్‌, ఫైట్స్‌ అన్ని ఉంటాయి. ప్రతిది కథకు లింక్‌ అయ్యి ఉంటుంది. కామెడీ ప్రేక్షకులకు బాగా అలరిస్తుంది. ఈ చిత్రంలో దివ్య అనే ఒక అమాయకపు స్వీట్‌ గర్ల్‌ క్యారెక్టర్‌‌లో కనిపిస్తాను. 
 
అఖిల్‌తో నటించడం ఎలా అనిపించింది..?
ఇద్దరం నటన ఫ్యామిలీ నుంచి వచ్చాం. అఖిల్‌ బాగా హార్డ్‌ వర్క్‌ చేస్తాడు. చాలా సపోర్టింగ్‌గా వున్నాడు. తనలో చాలా కాన్ఫిడెన్స్‌ ఉంది. అంత కాన్ఫిడెన్స్‌ నేను ఎవరి దగ్గరా చూడలేదు. మంచి డాన్సర్‌. బాగా పెర్ఫార్మ్‌ చేసాడు.
 
ఎవరి సలహాలు తీసుకున్నారు?
దర్శకుడు వినాయక్‌ చాలా సపోర్ట్‌ ఇచ్చారు. ''నువ్వు కంఫర్ట్‌‌గా ఉంటేనే ఏదైనా చేయగలవు.. సో.. ముందు నీ కంఫర్ట్‌ చూస్కో.. తరువాతే ఏదైనా..'' అని చెప్పారు. ఆయన మంచి ప్యాషన్‌ ఉన్న డైరెక్టర్‌. వినాయక్‌ గారితో కలిసి మరిన్ని సినిమాలు చేయాలనుంది.
 
ఎలాంటి దర్శకులతో చేయాలనుంది? 
నా దగ్గర నేను పనిచేయాలనుకున్న డైరెక్టర్స్‌ లిస్టు ఉంది. డిఫరెంట్‌ రోల్స్‌, పెద్ద డైరెక్టర్స్‌, మంచి స్క్రిప్ట్‌ ఉన్న సినిమాల్లోనే నటిస్తాను. రాజమౌళి, మణిరత్నం లాంటి దర్శకుల చిత్రాల్లో నటించాలనుంది.
 
మీ రోల్‌ మోడల్‌ ఎవరు?
ఇంకెవరు! మా అమ్మే (సహేనా భాను) నాకు రోల్‌ మోడల్‌. చాలామంది నటన నాకు నచ్చుతుంది. ఒక్కరి పేరు చెప్పడమంటే చాలా కష్టం.
 
తెలుగు సినిమాలు చూస్తారా?
హిందీలో డబ్‌ అయిన కొన్ని సినిమాలు మాత్రమే చూశా. ఇటీవలే 'శ్రీమంతుడు', 'బాహుబలి' సినిమాలు చూసాను. మహేష్‌ బాబు, అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌ లాంటి వారితో  కలిసి వర్క్‌ చేయాలనుంది.
 
గ్లామరస్‌ పాత్రల్లో నటిస్తారా?
ఖచ్చితంగా నటిస్తాను. హీరోయిన్స్‌ గ్లామరస్‌‌గానే కనిపించాలి.
 
తదుపరి చిత్రాలు?
ప్రస్తుతం అజయ్‌ దేవగన్‌ గారితో 'శివాయ్‌' అనే హిందీ సినిమాలో నటిస్తున్నాను. ఈ నెల 6 నుండి ఆ సినిమా షూటింగ్‌ మొదలయ్యింది. త్వరలో హాజరవుతాను అని ముగించారు.