గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: శనివారం, 9 మే 2015 (20:50 IST)

నా లవర్‌ గురించి మీకెందుకు?, దెయ్యం ఉంది...: తాప్సీ ఇంటర్వ్యూ

'ఝుమ్మంది నాదం'లో అందాలను ఆరబోసిన భామ తాప్సీ. ఆ తర్వాత మంచు ఫ్యామిలీతోనే వరుసగా చిత్రాలు చేసేసింది. లక్ష్మీమంచు కూడా తాప్సీని తెగ పొగిడేసింది కూడా. ఆ తర్వాత కొన్ని చిత్రాలు చేసినా పెద్ద విజయాలు దక్కించుకోలేదు. 'మిస్టర్‌ పర్‌‌ఫెక్ట్‌', 'గుండెల్లో గోదారి', 'సాహసం' తదితర చిత్రాల్లో చేసింది. ప్రస్తుతం తెలుగులో చిత్రాలు లేవు. తమిళంలో చేస్తుంది. ఏ భాష అయినా ఒక్కటే అంటున్న తాప్సీ.. లారెన్స్‌తో 'గంగ'లో నటించింది. ఆ చిత్రం మంచి పేరు తెచ్చిందంటున్న తాప్సీతో జరిపిన ఇంటర్వ్యూ...
 
గంగ రిలీజ్‌ తర్వాత ఎలాంటి స్పందన వచ్చింది?
రెండు సంవత్సరాల తరువాత తెలుగులో నా సినిమా విడుదలయింది. ఈ చిత్రం హిట్‌ అవుతుందని తెలుసు కానీ మరీ ఇంత పెద్ద హిట్‌ అవుతుందని ఊహించలేదు. మామూలు హీరోయిన్‌గా కాకుండా ఓ విభిన్నమైన పాత్రలో నన్ను చూపించారు. ఇంతకుముందు ఇలాంటి చిత్రంలో నేను నటించలేదు. ఇప్పటివరకు నేను గ్లామరస్‌, క్యూట్‌, ఇన్నోసెంట్‌ రోల్స్‌ ఉన్న సినిమాలలో మాత్రమే కనిపించాను. మొదటిసారి 'గంగ'లాంటి చిత్రంలో నటించాను.
 
రెండేళ్ళనాటికీ ఇప్పటికీ మీ బాడీలో ఛేంజ్‌ కన్పిస్తుంది.. అంటే.. బాగా తగ్గారు. కారణం?
కరెక్ట్‌గా చెప్పారు. నేను అప్పటికీఇప్పటికీ చాలా తగ్గాను. ముందు తెలీనితనంలో బాడీని మెయిన్‌టేన్‌ చేయడం నేర్చుకోలేకపోయాను. ఈ సినిమా చేస్తున్నప్పుడు చాలా విషయాలు అటు బాడీపరంగా, నటనపరంగా, బిహేవ్‌పరంగా నేర్చుకున్నాను. 
 
లారెన్స్‌ నుంచి ఏం నేర్చుకున్నారు?
లారెన్స్‌ గారి దగ్గర నుండి మల్టీటాస్కింగ్‌ నేర్చుకున్నాను. దర్శకుడిగా, నటుడిగా, డాన్సర్‌‌గా తన నుంచి చాలా నేర్చుకున్నా.
 
ఈ సినిమాలో నిత్యమీనన్‌ మిమ్మల్ని డామినేట్‌ చేసింది కదా?
అలాంటిది ఏమీలేదు. అంతా అపోహే. తన పాత్రకు న్యాయం చేసింది. తను తెరపై కనిపించిన ఇరవై నిమిషాల వ్యవధిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. నేను నటించిన 'బేబీ' మూవీలో కూడా నేను ఇరవై నిమిషాలు మాత్రమే కనిపిస్తాను. కాని ఆ సినిమాతో నాకు చాలా మంచి పేరు వచ్చింది. నిత్య కూడా అంతే. తన పాత్రలో తను నటించింది. 
 
మీపై దెయ్యం ఆవహించిన సీన్‌ ఎలా చేయగలిగారు?
సినిమా మొదటి భాగం సింపుల్‌గా, నేచురల్‌గా సాగిపోతుంది. సెకండ్‌ హాఫ్‌లో చాలెంజింగ్‌ రోల్‌లో నటించాల్సి వచ్చింది. చాలా కష్టపడి చేసాను. ఫస్ట్‌ షాట్‌‌లో దయ్యంలా నటించడానికి సుమారుగా 35 నుండి 40 టేక్స్‌ తీసుకున్నాను. అలానే సిగరెట్‌ కాల్చే సన్నివేశంలో కూడా చాలా టేక్స్‌ తీసుకున్నాను. నాకు అసలు సిగరెట్‌ ఎలా హ్యాండిల్‌ చేయాలో తెలియదు. ఎప్పుడు ట్రై చేయలేదు. అందుకే చాలా టేక్స్‌ తీసుకున్నాను.
 
దయ్యాలు ఉన్నాయని నమ్ముతారా..?
ఖచ్చితంగా ఉన్నాయి. దేవుడు ఉంటే దయ్యం కూడా ఉంటుంది కదా. ప్లస్‌ ఉన్నప్పుడు మైనస్‌ కూడా ఉంటుంది.
 
మీరు ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయి?
అది పర్సనల్‌ విషయం. నా ప్రేమ గురించి మీకెందుకు చెప్పాలి. నా తల్లిదండ్రులకే చెబుతాను. ఏదైనా వారికి తెలీకుండా ఏమీ చేయను. 
 
తెలుగులో సినిమాలు తగ్గాయే?
వాటి గురించి నిర్మాతల్ని అడగడండి. నన్ను కాదు. తెలుగు కాకపోతే తమిళం మరో భాష వుందికదా.. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలలో నటిస్తున్నాను. తెలుగు సినిమాలో నటించే అవకాశం వస్తే ఖచ్చితంగా నటిస్తాను అని ముగించింది.