శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By dv
Last Updated : గురువారం, 11 ఆగస్టు 2016 (15:57 IST)

రేయ్‌.. తిక్క హీరో అంటున్నారు... డిజాస్టర్ నుంచి చాలా నేర్చుకున్నా : సాయిధరమ్ తేజ్

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వారసుడు సాయిధరమ్‌ తేజ్‌. 'రేయ్‌' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా.. డిజాస్టర్‌తో చాలా నేర్చుకున్నాననీ.. ఇప్పటికీ తాను స్టూడెంట్‌ అనీ.. సాయిధరమ్‌ తేజ్‌ అంటున్నారు.

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వారసుడు సాయిధరమ్‌ తేజ్‌. 'రేయ్‌' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా.. డిజాస్టర్‌తో చాలా నేర్చుకున్నాననీ.. ఇప్పటికీ తాను స్టూడెంట్‌ అనీ.. సాయిధరమ్‌ తేజ్‌ అంటున్నారు. 'సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌', 'సుప్రీం' చిత్రాల తర్వాత తాజాగా 'తిక్క' సినిమాతో ఈనెల 13న ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు. 
 
* 'తిక్క' అనే టైటిల్‌ పెట్టడానికి కారణం? 
లవ్‌ బ్రేక్‌ అప్‌ అయిన అబ్బాయి సిట్యుయేషన్‌ అంతా తిక్క తిక్కగా ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం లోపల అతను అలాంటి పరిస్థితుల్ని చాలా ఎదుర్కొంటాడు. అందుకే ఈ టైటిల్‌ పెట్టాం. పైగా నేను ఫేస్‌ చేసే పర్సన్స్‌ అంతా డిఫరెంట్‌గా ఉంటారు. తిక్కతిక్కగా అనిపిస్తారు. కథ ప్రకారం తిక్క టైటిల్‌ బాగుంటుందని దర్శకుడు చెప్పడంతో అదే ఖాయం చేశాం. 
 
* మీ పాత్ర ఏం చేస్తుంది? 
రియల్‌ ఎస్టేట్‌ ఆఫీసులో పనిచేస్తాను. అప్పటికే లవ్‌లో ఫెయిల్యూర్‌ అవుతాను. ఆ తర్వాత జరిగిన సంఘటనలే సినిమా. 
 
* పోస్టర్లలో మందుకొడుతూ.. ఎక్కువ పబ్లిసిటీ చేస్తున్నారు? యూత్‌పై ప్రభావం పడుతుందనిపించలేదా? 
అది ఓ కోణంలో మాత్రమే.. అసలు మందు కొట్టడం వల్లే హీరోకు సమస్యలు ఎదురవుతాయి. అవి ఎలా పరిష్కరించుకున్నాడు.. మందు వల్ల ఎంత నష్టమనేది ఎంటర్‌టైన్‌గా చెప్పాం. 
 
* చిత్రంలో 'పవన్‌ కళ్యాణ్‌' ప్రస్తావన ఏమైనా ఉందా? 
లేనేలేదు. 'పవన్‌ కళ్యాణ్‌' గురించిన ప్రస్తావన ఏమీ ఉండదు. ఇది సోషల్‌ మెసేజ్‌ ఇచ్చే సినిమా కూడా కాదు. 
 
* ఈ సినిమా హాలీవుడ్‌ 'హ్యాంగోవర్‌'లా ఉందనే కామెంట్లు విన్పిస్తున్నాయి? 
హాలీవుడ్‌ సినిమా 'హ్యాంగోవర్‌'కి దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా డిఫరెంట్‌గా ఉంటుంది. 
 
* ఈ పాత్రను ఒప్పుకోవడానికి కారణం? 
ఇందులో క్యారెక్టర్‌ కొత్తగా ఉంటుందనిపించింది. అందుకే ఒప్పుకున్నా. చిరంజీవిగారు కూడా గతంలో ఇలాంటి పాత్రలు చాలా చేశారు. వాళ్ళలా నేనూ చెయ్యాలనే ఈ సినిమా ఒప్పుకున్నాను. పైగా ఇది నాకు ఛాలెంజింగా ఉంటుందనిపించింది. తాగుబోతు రమేష్‌ పాత్ర ఎలా చెయ్యాలో నాకు కొన్ని సలహాలు కూడా ఇచ్చాడు. 
 
* 'తిక్క' అనే టైటిల్‌ పరంగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి కామెంట్స్‌ వచ్చాయి? 
'తిక్క' అనే టైటిల్‌ వినగానే చిరంజీవిగారు గానీ, మిగతా పెద్దవాళ్ళు గానీ ఏమీ అనలేదు. బన్నీ, చరణ్‌‌లాంటి నా ఏజ్‌ గ్రూప్‌ వాళ్ళు మాత్రం 'తిక్క' హీరో అంటూ సరదాగా అన్నారు అంతే. 
 
* సినిమాలు స్పీడు పెంచారే? 
కథ గురించి ఎక్కువగా ఆలోచించను. కథ వినేటప్పుడు ఓ కామన్‌ ఆడియన్‌లాగానే వింటా. ఆ కథ వర్కవుట్‌ అవుతుంది అనిపించగానే ఒకే చెప్పేస్తా. పెద్దగా టైమ్‌ తీసుకోను. 
 
* మెగా హీరోలతో పోటీ ఎలా అనిపిస్తుంది? 
మా ఫ్యామిలీలో హీరోల మధ్య కాంపిటీషన్‌ ఉండదు. మంచి కథలు వస్తే, అవి నచ్చితే చేసుకుంటూ వెళ్లిపోతుంటాం అంతే. 
 
* మెగా హీరోలెవరితోనైనా మల్టీ స్టారర్‌ చేయాలని ఉందా? 
తప్పకుండా. నాకైతే చిరంజీవితో, పవన్‌ కళ్యాణ్‌తో, చరణ్‌, బన్నీ, వరుణ్‌ అందరితో కలిసి చేయాలనుంది. సరైన కథ దొరికి టైమ్‌ కలిసొస్తే తప్పకుండా చేస్తాను. ఇప్పుడు కళ్యాణ్‌ రామ్‌తో కూడా చేస్తున్నాను. 
 
* ఇందులో ధనుష్‌, శింబులతో పాటలు పాడించారు. అది ఎవరి ఐడియా? 
ఇదంతా సంగీత దర్శకుడు థమన్‌ ఐడియానే. ఈ పాటలు వాళ్ళు పాడితే బాగుంటుందని నమ్మి అతనే వాళ్ళనడిగాడు. వాళ్ళు కూడా అడగ్గానే ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా ఒప్పేసుకున్నారు. 
 
* మీ ఇంట్లో క్రిటిక్‌ ఎవరు? 
అమ్మ, బ్రదర్‌.. అమ్మ అయితే.. బాగోకపోతే.. బాగోలేదు. ఇలాంటి కథలా చేసేదంటూ.. క్లాస్‌ పీకుతుంది. దాంతో.. అమ్మ.. క్షమించు.. అంటూ చెబుతాను. మా బ్రదర్‌ అయితే.. చీల్చి చండాడేస్తాడు. 
 
* మీ సోదరుడు సినిమాల్లోకి వచ్చే ఛాన్సుందా ? 
ప్రస్తుతానికి చదువుకుంటున్నాడు. ఫ్యూచర్‌‌లో ఏం జరుగుతుందో చెప్పలేం. 
 
* మీరు హీరోగానే అవ్వాలని మొదట్లో అనుకున్నారా? 
నిజం చెప్పాలంటే. నేను చదివిన చదువుకు సరైన ఉద్యోగం రాలేదు. పి.జి. చేశాను. దాంతో.. ఫ్రెండ్స్‌ అంతా.. ఒక్కసారి సినిమాల్లో ట్రై చేయకూడదా! అనేవారు.. ఇంట్లో కూడా ప్రోత్సహించారు. అలా అయ్యేను.
 
* వేరే భాషల్లో సినిమాలు చేసే ఆలోచనేమన్నా ఉందా? 
ప్రస్తుతానికైతే ఏమీ లేదు. ఒకవేళ వేరే భాషల్లో సినిమా చేస్తే రీమేక్‌ చెయ్యను. స్ట్రైట్‌ సినిమానే చేస్తాను. 
 
* రెండేళ్ళనాటి కథలో మార్పులు చేశారా? 
దర్శకుడు సునీల్‌ రెడ్డి నాకు చాలా కాలంగా తెలుసు. 'పిల్లా నువ్వులేని జీవితం' టైమ్‌‌లోనే ఈ కథ విన్నాను. అతని పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. అయితే.. కథలో ఏమీ మార్పుచేయకుండానే కుదిరింది. ఇక నిర్మాత రోహిణ్‌ రెడ్డి కథ చెప్పి సినిమా కోసం ఎంతైనా ఖర్చుపెడతాని, బాగా తీస్తానని అన్నారు. అన్నట్టుగానే ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా సినిమా తీశారు. అందరినీ చాలా బాగా చూసుకున్నారు. 
 
* పోలీసుగా కష్ణ వంశీ సినిమాలో చేస్తున్నారా?
అవును. 'నక్షత్రం' సినిమాలో నాది పోలీస్‌ రోల్‌. 20 నిమిషాలు ఉంటుంది. ఆ క్యారెక్టర్‌ గురించి నాక్కూడా ఏమీ తెలీదు. కష్ణవంశీ అడగ్గానే ఒకే చెప్పేశా. షూటింగ్‌‌కు వెళితే అసలు పాత్ర ఏమిటనేది తెలుస్తుంది. 
 
* ఇంకా కొత్త చిత్రాలు?
మలినేని గోపిచంద్‌తో సినిమా ఈనెల 20 నుంచి మొదలవుతుంది. ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్‌ మాటల్లోనే ఉన్నాయి అని చెప్పారు.