శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By pnr
Last Updated : సోమవారం, 12 డిశెంబరు 2016 (22:19 IST)

నేనేం పెద్ద హీరోనా.. సనాతో నాకేం కెమిస్ట్రీ ఉంటుంది... కొత్త నిర్మాతలు జంకుతున్నారు: పృథ్వీరాజ్‌

నటుడిగా.. కృష్ణవంశీ ఇచ్చిన అవకాశంతో 'థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ' డైలాగ్‌తో తన కెరీర్‌ను మార్చుకున్న నటుడు పృథ్వీరాజ్‌. తాడేపల్లిగూడెంలో ఒక వీధిలో కృష్ణవంశీ ఉంటే. మరో వీధిలో అలనాటి రేలంగి వుండేవారు. వారి

నటుడిగా.. కృష్ణవంశీ ఇచ్చిన అవకాశంతో 'థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ' డైలాగ్‌తో తన కెరీర్‌ను మార్చుకున్న నటుడు పృథ్వీరాజ్‌. తాడేపల్లిగూడెంలో ఒక వీధిలో కృష్ణవంశీ ఉంటే. మరో వీధిలో అలనాటి రేలంగి వుండేవారు. వారి మధ్య వీధిలో మా ఇల్లు వుండేది.. అ లాంటి వాతావరణం నుంచి వచ్చిన తాను ఇప్పుడు ఈ స్థితికి ఎదుగుతానని ఎప్పుడూ ఊహించలేదని.. పృథ్వీ అంటున్నాడు. ఆయన ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం 'మీలో ఎవరు కోటీశ్వరుడు'. ఈ చిత్రం ఈనెల 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా పృథ్వీతో ఇంటర్వ్యూ.
 
* కొందరు హీరోలను ఇమిటేట్‌ చేస్తూ నటిస్తున్నారు. దానిపై ఇండస్ట్రీలో విమర్శలు వచ్చాయిగదా?
అవును. నా స్నేహితులు కూడా నీకిది అవసరమా! అని అడిగారు. ఇక ఇండస్ట్రీలో సరేసరి.. ఇకపై జాగ్రత్త ఉండాలని.. బాలయ్య ఫ్యాన్స్‌ అయితే ఫోన్‌లోనే తలంటుపోసేశారు. వీరందరికి ఓ విషయం చెప్పాలి. బాలయ్యను ఓ సినిమాలో ఇమిటేట్‌ చేస్తున్నానని ఫ్యాన్స్‌ ఫీలయ్యారు. ఈ విషయం తెలిసి బాలయ్యబాబు ప్రెసిడెంట్‌ జగన్‌కు ఫోన్‌ చేసి వివరించారు. నేనూ వాళ్లతో మాట్లాడటంతో సమస్య సద్దుమణిగింది. ఆ తర్వాత 'డిక్టేటర్‌' సినిమాలో బాలయ్యతో కలిసి నటించాను. ఆయన ముందే ఆయన్ని ఇమిటేట్‌ చేసి డైలాగ్‌ చెబితే బాగుందని అభినందించారు. అంతేకాకుండా ఆయన నాతో లక్ష్మీ నరసింహా స్వామి దీక్ష చేయించారు. ఇక బాహుబలి తరహాలో ప్రభాస్‌నూ ఫాలోఅయ్యాయను. ఆయన కూడా ఎంటర్‌టైన్‌ ఫీలయ్యారు.
 
* శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌‌లో చేయడం ఎలా అనిపిస్తుంది?
ఇ.సత్తిబాబు నాకు పాత్ర వుందని చెబితే వెళ్ళాను. నిర్మాత ఎవరంటే.. ఫలానా అన్నారు. 'మీలో ఎవరు కోటీశ్వరుడు' నిర్మాత కె.కె.రాధామోహన్‌ తీసిన గత చిత్రంలో 'బెంగాల్‌ టైగర్‌'లో మంచి క్యారెక్టర్‌ చేశాను. అందులో నా క్యారెక్టర్‌కు పేరుతో పాటు అవార్డ్స్‌ కూడా వచ్చాయి.
 
* మీరు హీరో అని చెప్పారా?
దర్శఖుడు కథ చెప్పి.. మీ పాత్ర ఇలా వుంటుంది.. ఆ తర్వాత అలా ట్రావెల్‌ అవుతుంది అన్నారంతే.. పూర్తిగా నాపై ఉంవుంటుందని చెప్పలేదు. ఆయన నా క్యారెక్టర్‌ను నెరేట్‌ చేసిన దాని కంటే బాగా ప్రెజెంట్‌ చేశారు. నా క్యారెక్టర్‌ ఇంత బాగా వస్తుందని ఊహించలేదు.
 
* అందరూ  మిమ్మల్నే హీరో అనుకుంటున్నారుగదా?
 
ఈ సినిమాలో నేను ఓ కీలకపాత్రలో కనపడతానే తప్ప నేను హీరో కాదు. ఇక సినిమాలో నవీన్‌చంద్ర హీరో. తను బయట అందరూ నన్నే హీరో అనుకుంటున్నారని అంటున్నారని చెప్పారు. నవీన్‌చంద్ర  చాలా ఫ్రెండ్లీ హీరో. సినిమా కోసం డైరెక్టర్‌ ఏం చెబితే అదే చేశామంతే. కమెడియన్‌ ఇంపార్టెంట్‌ క్యారెక్టర్‌ చేసినా కమెడియన్‌గానే ఉండాలి అని.. కోటగారు నాతో ఓ సందర్భంలో అన్నమాటను నేనెప్పటికీ గుర్తుంచుకుంటాను. అందుచేత నేనేదో హీరో అయిపోయానని ఫీలవ్వడం లేదు.
 
* ట్రైలర్స్‌ రెస్పాన్స్‌ ఎలా వుంది?
సినిమా కోసం చాలా మంది ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారు. ట్రైలర్‌ చాలా బావుందని అంటున్నారు. ఫోన్‌ చేసి చాలా మంది అభినందించారు కూడా. రీసెంట్‌గా నేను 'ధవ' సినిమా చూస్తున్నప్పుడు 'మీలో కోటీశ్వరుడు' ట్రైలర్‌ వేసినప్పుడు ప్రేక్షకుల నుంచి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఆ రెస్పాన్స్‌ చూసి కళ్లంట నీళ్లు వచ్చాయి.
 
* సలోనితో కెమిస్ట్రీ ఎలా వుంది?
 
మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఏం వుంటుంది. నేనేమీ పెద్ద హీరోనుకాదు గదా.. ఇందులో నాకు జతగా సలోని నటించింది. అయితే మా మధ్య ఓ పాట తప్ప కెమిస్ట్రీ ఏమీ లేదు. సాంగ్‌లో నేను డ్యాన్స్‌ బాగా వేశానంటున్నారు కానీ ఆ క్రెడిట్‌ అంతా గణేష్‌ మాస్టర్‌కే దక్కుతుంది. ఈ సినిమాలో సాంగ్‌ చేయాల్సిన సమయంలో వేరే సినిమా షూటింగ్‌లో కాలు బెణికింది. ఈ బెణికి కాలుతో డ్యాన్స్‌ ఎలా చేయగలను అని గణేష్‌ మాస్టర్‌కి చెబితే మీతో నేను చేయిస్తానని ఆ సాంగ్‌ చేయించారు. అందులో ముఠామేస్త్రి గెటప్‌లో డ్యాన్స్‌ మూమెంట్‌ ఉంటుంది. ఇది ఫస్ట్‌ షాట్‌కే ఓకే అయిపోయింది. ఈ సాంగ్‌ వచ్చినప్పుడు థియేటర్స్‌‌లో విజిల్సే విజిల్స్‌ పడతాయి.
 
* నోట్ల సమస్య  గురించి మీరెలా స్పందిస్తారు?
 
ఈమధ్య నోట్ల గురించి.. స్వాగతిస్తున్నాం అని అందరూ అంటున్నారు. అది పైకి మాత్రమే. వారంతా పారితోషికాన్ని తగ్గించుకోవాలి కదా! అసలు డీ మానిటైజేషన్‌ వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాలు తీయాలన్నా నిర్మాతలకు కష్టమే. ఫ్లో లేదు. కొత్తగా వచ్చే నిర్మాతలు రావడానికి జంకుతున్నారు. చాలామంది నిర్మాతలు వారి వారి సమస్యలు చెబుతున్నారు. డబ్బులువుంటే. ఇంట్లో అమ్మాయి పెళ్లిచేయవచ్చు. మరేదైనా కొనుక్కోవచ్చని అంటున్నారు. ఇటీవలే  కొందరు నిర్మాతలు ల్యాబ్స్‌లో ఆగిపోయిన సినిమాల గురించి చెప్పారు. అసలు షూటింగ్‌ జరగాలంటే లిక్విడ్‌ క్యాష్‌ ఉండాలి. అలా అయితేనే 24 క్రాఫ్ట్‌లో చాలామందికి కడుపునిండుతుంది. ఇప్పుడు అది లేకపోవడంతో.. అందా గందరగోళంగా వుంది. డీమానిటైజేషన్‌ వల్ల రేట్లు త గ్గాలి. ఎక్కువ తీసుకునేవారు తగ్గించాలి. అందుచేత నేనైతే లక్ష రూపాయలు తీసుకునే వర్క్‌కి 20,000 తీసుకుంటాను. నాలాగే మిగిలిన ఆర్టిస్టులు కూడా రెమ్యూనరేషన్‌ తగ్గించుకుంటే బాగుంటుంది అనేది నా ఆలోచన.
 
* ప్రముఖ కమేడియన్‌కు పోటీ మీరే అని వార్తలు విన్పిస్తున్నాయి?
అవన్నీ నమ్మను. నేను పులస చేపలాంటివాడిని. అవి వర్షాలు, నీరు వున్నప్పుడే వస్తాయి. అన్ని కాలాల్లో రావు. అవి తింటే రుచిగా ఉంటాయి. నేనుకూడా అంతే. నా టైమ్‌ బాగున్నప్పుడు చూసినంతసేపు బాగా చూస్తారు. రేపు అనేది వుంది. కొత్తనీరు రావాలి. వాళ్ళొస్తే ఈ సీటు ఖాలీచేస్తాను. అంతేకానీ.. గొప్ప ఆర్టిస్టులకు పోటీ నేను కాదు. నాకంటే సీనియర్‌ ఆయన. (బ్రహ్మానందంను దృష్టిలో పెట్టుకుని). ఆయనకు ఆయనే సాటి.
 
* కొత్త చిత్రాలు?
'కాటమరాయుడు'లో హీరోయిన్‌ బాబాయ్‌గా నటిస్తున్నాను. ఈ చిత్రంలో పవన్‌ కళ్యాణ్‌, శతిహాసన్‌ కాంబినేషన్లో ఎక్కువ సీన్స్‌లో నటిస్తున్నందుకు హ్యాపీగా ఫీలవుతున్నాను. సాయిధరమ్‌ తేజ్‌ 'విన్నర్'‌, వరుణ్‌ తేజ్‌ 'మిస్టర్'‌, నాని, జయగారి 'వైశాఖం' చిత్రాల్లో నటిస్తున్నాను. వీటితో పాటు తెలంగాణ పోరాట యోధుడు కథతో 'మల్లప్ప' అనే సినిమా చేయబోతున్నా. ఈ పాత్ర కోసం జిమ్‌కూ వెళుతున్నా.