గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2017
Written By Raju
Last Updated :హైదరాబాద్ , ఆదివారం, 16 ఏప్రియల్ 2017 (09:42 IST)

ఆండర్సన్, బిల్లింగ్స్ బ్యాటింగ్ థమాకా: ఢిల్లీ మరో ఘనవిజయం

అటు బ్యాటింగ్ లోనూ, ఇటు బౌలింగ్ లోనూ సమష్టి ప్రదర్శన కనబరచిన ఢిల్లీ.. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కల్గిన కింగ్స్ పంజాబ్ కు షాకిచ్చింది. 189 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన కింగ్స్ పంజాబ్ ను 9

అటు బ్యాటింగ్ లోనూ, ఇటు బౌలింగ్ లోనూ సమష్టి ప్రదర్శన కనబరచిన ఢిల్లీ.. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కల్గిన కింగ్స్ పంజాబ్ కు షాకిచ్చింది. 189 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన కింగ్స్ పంజాబ్ ను 9 వికెట్లకు 137 పరుగుల వద్దే వద్ద కట్టడి చేసి గెలుపు సాధించింది. ఢిల్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 లో ఢిల్లీ డేర్ డేవిల్స్ మరో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.

శనివారం రాత్రి కింగ్స్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ 51  పరుగుల తేడాతో విజయం సాధించింది. దాంతో ఈ సీజన్ లో వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఢిల్లీ.కింగ్స్ పంజాబ్ ఆటగాళ్లలో ఇయాన్ మోర్గాన్(22), డేవిడ్ మిల్లర్(24), అక్షర్ పటేల్ (44),హషీమ్ ఆమ్లా(19)లు మాత్రమే రెండంకెల స్కోరును సాధించారు. ఢిల్లీ బౌలర్లలో క్రిస్ మోరిస్ మూడు వికెట్లు సాధించగా, కమిన్స్ , నదీమ్ తలో రెండు వికెట్లు తీశారు. అమిత్ మిశ్రా, కోరీ అండర్సన్‌లకు చెరో వికెట్ వికెట్ దక్కింది
 
 టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో నిర్ణీత ఓవర్లలో ఢిల్లీ ఆరు వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. ఢిల్లీ ఓపెనర్లలో శాంసన్(19) తొందరగా అవుటైనప్పటికీ, శ్యామ్ బిల్లింగ్స్(55;40 బంతుల్లో 9 ఫోర్లు) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.అయితే  శాంసన్ తొలి వికెట్ గా అవుటైన స్వల్ప వ్యవధిలోనే కరుణ్ నాయర్ డకౌట్ గా పెవిలియన్ చేరాడు. అనంతరం శ్రేయస్ అయ్యర్(22) ఫర్వాలేదనిపించడంతో ఢిల్లీ వేగం మళ్లీ పుంజుకుంది. చివర్లో కోరీ అండర్సన్(39 నాటౌట్;22 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు), క్రిస్ మోరిస్(16), కమిన్స్(12 నాటౌట్; 6 బంతుల్లో 2 ఫోర్లు) లు బ్యాట్ ఝుళిపించడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ప్రధానంగా చివరి రెండు ఓవర్లలో 35 పరుగులను ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరు చేసింది. ఇది ఢిల్లీకి వరుసగా రెండో విజయం కాగా, కింగ్స్ కు వరుసగా రెండో ఓటమి.
 
శనివారం మ్యాచ్‌ల తర్వాత ఇదీ పాయింట్ల పట్టికను చూస్తే 4 మ్యాచ్‌లలో 3 విజయాలు సాధించిన కొల్‌కతా నైట్ రైడర్స్ 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, ముంబై ఇండియన్స్ (6 పాయింట్లు), ఢిల్లీ డేర్ డెవిల్స్ (4 పాయంట్లు), సన్ రైజర్స్ హైదరాబాద్ (4 పాయింట్లు), కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ (4 పాయింట్లు), రాయల్ చాలెంజెర్స్ బెంగళూరు (2 పాయింట్లు), గుజరాత్ లయన్స్ (2 పాయింట్లు), రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ (2 పాయింట్లు)తో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.